'యువ కళా వాహిని' వై .కె .నాగేశ్వర్ రావు ఆధ్వర్యం లో త్యాగరాయగాన సభలో 21న జరిగిన కార్యక్రమం లో డా" అనుమాండ్ల భూమయ్యకు బి.యన్.సాహితీ పురస్కారాన్ని డా" సినారే అందజేశారు . సినారే మాట్లాడుతూ - 'అగ్ని వృక్షం' వంటి ప్రౌఢ కావ్యాన్ని అందించిన అనుమాండ్ల భూమయ్య సాహితీ వ్యక్తిత్వం గొప్పది . సాహితీ విమర్శకుడిగా ప్రారంభించి, కవిత్వ రంగానికి వచ్చిన భూమయ్య తన రచనల ద్వారా అందరి మన్ననలు అందుకున్నారని అన్నారు . ' వాస్తు శిల్పి' గా అందరికీ సుపరిచితుడైనా, ' అక్షర శిల్పి' గా కూడా అభినందనలు అందుకున్న బి.యన్.రెడ్డి నెలకొల్పిన సాహితీ పురస్కారాన్ని మానవీయ కవి అనుమాండ్ల భూమయ్యకు ఇవ్వడం సముచితం గా వుందని - సభకు అధ్యక్షత వహించిన డా"ఓలేటి పార్వతీశం అన్నారు . పురస్కార గ్రహీత అనుమాండ్ల భూమయ్యను డా" సి .హెచ్ .లక్ష్మణ చక్రవర్తి సభకు పరిచయం చేసారు . సభ ప్రారంభం లో పద్మశ్రీ ఆలపించిన అన్నమయ్య కీర్తనలు సభికులను అలరించాయి .
0 comments:
Post a Comment