'సమ్ థింగ్ సమ్ థింగ్' చిత్ర సమీక్ష 3/5
లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ పతాకం ఫై సుందర్. సి దర్శకత్వంలో బి .సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మించారు.
చేదు అనుభవాల వల్ల సాఫ్ట్ వేర్ కుర్రాడు కుమార్ కి అమ్మాయిలూ -ప్రేమ అంటే గిట్టదు . అయితే, వారి ఆఫీస్ కి కొత్త ఉద్యోగిని సంజన రావడం తో తన ఉద్దేశాలను పక్కన పెట్టి,ఆమె ఆకర్షణలో పడతాడు .సంజన ప్రేమను పొందడానికి 'లవ్ గురు' ప్రేమ్ జీ సలహాలను తీసుకుంటాడు .అతని సహాయంతో- మరో యువకుని ఆకర్షణలో పడ్డ సంజనను అతని నుండి విడదీసి,తన ప్రేమలో పడేటట్లు చేసుకుంటాడు . ఆ తర్వాత... సంజన స్వయానా తన మేనకోడలనే వాస్తవం'లవ్ గురు' ప్రేమ్ జీకి తెలుస్తుంది . దాంతో-సంజనను ప్రేమలోకి దించిన కుమార్ నుండి సంజనను విడదీసే ప్రయత్నాలు చేస్తాడు . ఆ తర్వాత జరిగింది సినిమాలో చూడాలి ...
డబ్బింగ్ సినిమా అని చెప్పకుండా...కొన్ని సన్నివేశాలను తెలుగు ఆర్టిస్టులతో చిత్రీకరించి 'ద్విభాషా చిత్రం' -అంటూ పబ్బం గడుపుకునే బాపతు చిత్రాల్లో ఇదీ ఒకటి .బ్రహ్మానందం తో చిత్రీకరించిన సన్నివేశాలు మినహా ఇది పూర్తిగా తమిళ చిత్రమే . నాలుగు పదుల వయసున్నప్పటికీ ఇంకా కుర్ర వేషాలు వేస్తున్న సిద్దార్ధ ఇందులో హీరో ఐనప్పటికీ, నిజానికి హీరో బ్రహ్మానందమే.సినిమా అంతా అతని ఫై నడవడమే కాదు ...అతని నటనే ప్రేక్షకులను ఆకట్టుకుంది .దీనికి ప్రముఖ నటి ఖుష్బు భర్త సుందర్ దర్సకత్వం వహించారు . తెలుగులో చాలా సినిమాల్లో చూసిన ప్రేమ కధతో చేసిన ఈ చిత్రం రెండవ భాగం లో- హన్సిక బ్రహ్మానందం మేనకోడలనే ట్విస్ట్ తో సినిమా కొంత పర్వాలేదనే స్థితికి వచ్చింది . ఆ తర్వాత కుమార్ నుండి సంజనను ప్రేమ్ జీ విడదీసే ప్రయత్నాలు కూడా వినోదాత్మకంగా వున్నాయి . ఇందులో సత్య సంగీతం లో పాటలు మైనస్ ఐతే ... వెలిగొండ శ్రీనివాస్ రాసిన సంభాషణలు చాలా ప్లస్ అయ్యాయి . గోపి అమర్నాద్ ఫోటోగ్రఫీ, రీ రికార్డింగ్ ఓకే . మొత్తం మీద ఈ చిత్రం గొప్ప వినోదాన్ని ఇవ్వక పోయినా... నిరాశ పరచదు.
తెలుగులో ఎందరో చేసిన ప్రేమికుడి పాత్రనే కుమార్ గా ఇందులో సిద్ధార్ధ పోషించాడు . తను మంచి నటుడని మరోసారి నిరూపించుకున్నాడు . అందగత్తె హన్సిక సంజన గా ప్రేక్షకులను ఆకట్టుకుంది . అక్కడక్కడా ఎక్కువగా...రొటీన్ గా అనిపించినా 'లవ్ గురు' ప్రేమ్ జీ గా బ్రహ్మానందం పెద్ద పాత్రలో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాడు . హన్సిక మొదటి ప్రియుడిగా గణేష్ వెంకట్రామన్ నటించాడు. అతిధి పాత్రల్లో- సిద్ధార్ధ లేటెస్ట్ లవర్ సమంత,రానా ,సుధ ,వేణుమాధవ్ ,ఒకప్పటి నాయిక నళిని కనిపించారు . 'మగ ధీర' ఇన్స్పిరేషన్ తో సినిమా చివర్లో యూనిట్ అందరి ఫై చేసిన 'దొంగ భడవలు' పాట బాగుంది . హన్సికను తమిళ నాట 'చిన్న ఖుష్బూ' అని అంటారు . ఖుష్బూ కూడా ఈ పాటలో చెయ్యడం విశేషం -రాజేష్
0 comments:
Post a Comment