అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలని, పెళ్లిచేసుకోకపోయినా సహజీవనం చేయవచ్చునని నటి రీమా కళింగళ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మలయాళ భామ కోలీవుడ్‌లో భరత్ సరసన 'యువన్ యువతి' చిత్రం ద్వారా పరిచయమైంది.
మాలీవుడ్‌లో 'కేరళ కబే', 'హ్యాపీ హజ్‌బెండ్స్', 'సిటీ ఆఫ్ గాడ్స్', 'నీలతామర' తదితర చిత్రాలలో నటించిన రీమా కళింగళ్ '22 ఫీమేల్ కొట్టాయం', 'నిత్యా' చిత్రాలలోని నటనకు గాను కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ నటి అవార్డును అందుకుంది. కాగా '22 ఫిమేల్ కొట్టాయం' చిత్రంలో నటిస్తున్న సమయంలో ఆ చిత్ర దర్శకుడు ఆషిక్ అబుతో స్నేహం ప్రేమగా మారింది.
ఆ తరువాత ఒకే ఇంట్లో కలిసి సహజీవనం చేస్తున్నారు. వీరి వ్యవహారం మలయాళ చిత్ర పరిశ్రమలో కలకలం పుట్టిస్తోంది. ఈ సహజీవనం గురించి రీమా కళింగళ్ తొలిసారిగా పెదవి విప్పింది. సహజీవనం చేయడంలో తప్పులేదని పేర్కొంది. కలిసి జీవించడానికి పెళ్లి తప్పనిసరి కాదని అంది. తనకు ఈ జీవితం నచ్చిందని అందుకే సహజీవనాన్ని కొనసాగించడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలియజేస్తోంది.
0 comments:
Post a Comment