Monday, May 20, 2013
కమల్ ని ఆహ్వానించిన 'కోచ్చడయాన్'
హాలీవుడ్-భారతీయ కథల కలబోత ‘ది రిలక్టంట్ ఫండమెంటలిస్ట్’
Wednesday, May 15, 2013
సన్నీకి పోటీగాప్రియా అంజలీరాయ్!
ఇసబెల్లా కైఫ్ కూడా సల్మాన్ తోనే...
Friday, May 10, 2013
' సుకుమారుడు' చిత్ర సమీక్ష
' సుకుమారుడు' చిత్ర సమీక్ష 1.5 / 5
ఆది, నిషా అగర్వాల్, కృష్ణ, శారద, రఘుబాబు, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, చలపతిరావు, రావురమేష్ తదితరులు ఈ చిత్రం లో నటీ నటులు .
సాయికుమార్ వారసుడిగావచ్చిన ఆది 'ప్రేమకావాలి'తో ప్రేక్షకుల ప్రేమను పొందాడు. ఆ తర్వాత 'లవ్‌లీ' లవర్‌బాయ్‌గా నటించాడు. ముచ్చటగా మూడవ సినిమా ' సుకుమారుడు' గా చేశాడు. అయితే కథల ఎంపికలో ఎలా ఉండాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవిషయం లో కొంత తమాషా జరిగినట్లు అనిపిస్తుంది . ఎండుకంటే... ఇటీవలే విడుదలైన' గ్రీకువీరుడు' చిత్ర కథను పోలినట్లు ఉండడం ఈ చిత్రం ప్రత్యేకత. ' పిల్లజమిందార్' తీసిన దర్శకుడు అశోక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. లోగడ 'సుందరకాండ' వంటి చిత్రాన్ని నిర్మించిన కెవివి సత్యనారాయణ ఈ చిత్రాన్ని సమర్పించారు .
యూరప్‌లో తండ్రి పెంపకంలో కమర్షియల్ మైండ్‌తో పెరిగినవాడు సుకుమార్ (ఆది). ఇండియా అంటే చికాకు. యూరప్‌లోనే వ్యాపారం చేసుకుని సెటిల్ అవ్వాలని తాపత్రయపడుతుండాడు. దానికి తగినట్లు బిజనెస్ చేయాలను ట్రై చేస్తాడు. కానీ అందుకు తగిన సొమ్ముఉండదు. బ్యాంక్‌లు ససేమిరా అంటాయి. దాంతో 150 కోట్ల ఆస్తి తన తాత ఊరైన ఇండియా వస్తాడు. తాత అమ్మమ్మగా కృష్ణ, శారద నటించారు. సుకుమారుడు కోట్ల ఆస్తిని అమ్మేసి చెక్కేయాలని ట్రై చేస్తాడు. కానీ అతనికి అడుగడునా రావురమేష్ అడ్డుపడుతుంటాడు. ఇంకోవైపు అసలు వారసురాలిని నేనే అని శారద కొడుకు కూతురు వస్తుంది. ఈ ట్విస్ట్‌తో ఆది ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది సినిమా.
ఆది ఇందులోతన నటనను హైలైట్ చేయాలనుకున్నాడు అందుకు మూడు పార్శాలున్న పాత్ర చేశాడు. అయితే దేనికి సూట్‌కాలేదు. నటన ఇంకాస్త మెరుగు పర్చుకోవాలి. డైలాగ్ డెలివరీ పర్వాలేదు. కానీ.. ఎన్‌టి.ఆర్ చెప్పే యమసభ డైలాగ్‌ను మాట్లాడినా.. అంత ఎఫెక్ట్ అనిపించలేదు.
నిషా అగర్వాల్ పాత్ర హీరోను పడేయమనే రొటీన్ కాన్సెప్ట్‌తో ఉన్నదే. అందులో ప్రత్యేకత ఏమీలేదు. బామ్మగా శారద చాలా కాలం తర్వాత తెరపై కన్పించింది. తాతగా కృష్ణ కన్పిస్తాడు. పాత్ర పరిమితమే. ఊరిలో దుష్టపాత్రగా తనికెళ్ళభరణి, రఘుబాబు పాత్రలు అలరిస్తాయి. హీరోకు స్నేహితులుగా 'పిల్లజమిందార్'లో ఉన్న బ్యాచ్‌నే దర్శకుడు తీసుకోవడం విశేషం .
ఈ చిత్రానికి ప్రధానమైన ఆకర్షణ సినిమాటోగ్రఫీ. పల్లెటూరి అందాల్ని చక్కగా చూపించాడు. సంగీతపరంగా అనూప్ బాణీలు ఏమంత ఎఫెక్ట్‌గా లేవు. 'నీలాకాశంలో మెరిసే చందురుడివి' అనే పాట కాస్త మెలోడీగా ఉంది. ఎడిటర్ కు చాలా పనికల్పించాడు. ఎక్కడ ఏ సన్నివేశం వస్తుందో అర్థంకాకుండా ఉంది. దాన్ని కటింగ్ చేయడం లో సాహసమే చేశాడనే చెప్పాలి. స్క్రీన్‌ప్లే ప్రధాన లోపం. మాటలు ఎఫెక్ట్‌గా లేవు. ప్రాసకోసం పాకులాడుతూ సన పెట్టిస్తాడు.
సినిమాలో ముక్కలు ముక్కలుగా కథను చెప్పడంతో సుకుమారుడు డెప్త్‌పోయింది. ఏ సన్నివేశం బాగోదు. కొత్తగా మెగాఫోన్ పట్టుకున్న వ్యక్తి చేసినట్లుగా వుంది . ' పిల్లజమిందార్' అనే చిత్రం ఓ మలయాళ రీమేక్ కనుకదర్శకుడు దాన్ని చక్కగా డీల్ చేసాడు . అదే 'సుకుమారుడు'కు వచ్చేసరికి అసలు సరుకు బయటపడింది. దర్శకుడు ఎక్కడా మెప్పించలేకపోయాడు. కథకూడా అదే తరహాలో లో ఉంటుంది.' పిల్లజమీందార్' లో...జల్సాగా తిరిగే నానికి తాత 'తన ఆస్తి మనవడు బాగుపడితేగానీ' ఇవ్వరాదని వీలునామా రాస్తాడు. 'సుకుమారుడు'లో.... విదేశీవ్యామోహంలో బిజినెస్‌కోసం డబ్బుకావాల్సివస్తే... ఆస్తికోసం ఇండియా వస్తే.. వీడు తగినవాడాకాదా? అని బామ్మ టెస్టింగ్ పెడుతుంది. ఈ కథ నాగార్జున నటించిన 'గ్రీకువీరుడు'కు డిటోనే. ఇద్దరు దర్శకులకు ఒకే ఐడియా రావడం కామనే అయినా.. దాన్ని తీసేవిధానంలో ఇంకాస్త ఎఫెక్ట్ పెడితే బాగుండేది.
ఇది ప్రధానంగా దర్శకుడి సినిమా. భారీ తారాగణం ఉన్న ఈ కథను నడిపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఏ సన్నివేశాం ఇంట్రస్ట్‌గా ఉండదు. పంచ్ డైలాగ్స్ పేరుతో వచ్చే డైలాగ్స్ విసుగు తెప్పిస్తాయి. పాటలుకూడా ఏమంత బాగోలేవు. నవ్వుకోవాలంటే.. గిలిగింతలు పెట్టుకోవాల్సిందే.
-రవళి
'తడాఖా' చిత్ర సమీక్ష
'తడాఖా' చిత్ర సమీక్ష 2.5 / 5
శ్రీ సాయి గణేష్ పతాకం ఫై కిషోర్ దర్సకత్వం లో బెల్లం కొండ సురేష్ ,గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు .
అక్కినేని వారసుడిగా నాగచైత్య 'జోష్'తో మొదలైన కెరియర్ తర్వాత ఎత్తుపల్లాలుగా మారింది. '100%లవ్' మినహా 'దడ', 'జెజవాడ' మాస్ ఇమేజ్ చూపించి భంగపడ్డాడు. మళ్ళీ అటువంటి ఇమేజ్‌కోసం ట్రై చేస్తున్నాడు. చాలా కథలు విన్నాక... ఏదీ నచ్చకపోవడంతో తమిళచిత్రం 'వెట్టయ్' ను 'తడాఖా' గా రీమేక్ చేశాడు. ఇందులో మరో హీరో సునీల్‌కూడా ఉన్నాడు.విశేషమేమంటే - నిర్మాత బెల్లం కొండ సురేష్ హక్కులు కొని ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం .
తాతనుంచి వస్తున్న ఆస్తిగా పోలీసు ఉద్యోగం తన తండ్రి వెంకట్రామ్ (నాగబాబు) చనిపోతే పెద్దకొడుకైన శివరామకృస్ణ (సునీల్)కు వస్తుంది. చిన్నకొడుకు ఉద్యోగంసద్యోగంలేక బేవార్స్‌గా తిరుగుతుంటాడు. దానికి తగ్గట్లు ధైర్యవంతుడుకూడా. ఇతనికి రివర్స్ శివరామకృష్ణ. ఎస్.ఐ.గా సిటీకి వెళ్ళిన శివరామకృష్ణకు మొట్టమొదటి డ్యూటీ... ఊరినే శాసిస్తున్న రౌడీల ఆటలు కట్టించడమే. ఈ విషయాన్ని తమ్ముడికి చెప్పడంతో ఆ సమస్యలన్నీ తనే తీరుస్తాడు కార్తీక్ (నాగచైతన్య).చివరికి అసలు విషయం తెలిసిన రౌడీలు శివరామకృష్ణకు టార్గెట్ పెడతారు. అది తెలిసిన తమ్ముడు కార్తీక్ ఏంచేశాడు? అన్నలో ధైర్యాన్ని రెచ్చగొట్టి ప్రత్యర్ధులను ఎలా చిత్తు చేసాడన్నదే ఈ సినిమా.

ఇక దర్శకుడిగాకిషోర్ 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' తో ఫీల్ వున్న మంచి కదా చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందాడు . ఈ యాక్షన్ మసాలా 'తడాఖా' చిత్రానికి అతన్ని దర్శకుడిగా ఎంపిక చెయ్యడమే పెద్ద తప్పు . తమిళ చిత్రాన్ని కాపీ చేయడానికి కూడా తడబడ్డాడు. సొంత తెలివితో కాస్త స్టోరీని మార్చాడు. అయితే , సన్నివేశాలు ఆసక్తి కరం గా లేకపోవడం ... టేకింగ్ మరీ నీరసం గా వుండటం వల్ల సినిమా చూసిన వాళ్లకు చిర్రెత్తుకొస్తుంది .
ఈ చిత్ర కథ చాలా సింపుల్. గతంలో ఇలాంటివి చాలానే వచ్చాయి. అన్నదమ్ములుగా సునీల్, చైతన్య సరిపోయారు. కేవలం మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ పెట్టుకుని ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. హీరో ను ఎలివేట్ చేయాలి కాబట్టి- చైతన్యకు అనుగుణంగా ఫైట్స్, పాటలు పెట్టారు. ఇందుకు రివర్స్‌లో సునీల్ పాత్ర ఉంటుంది. తమిళవర్షన్ మార్చి దర్శకుడు డాలీ ఈ చిత్రాన్ని తీశాడు. ముఖ్యంగా సంభాషణల విషయం లో కొంత జాగ్రత్తపడ్డారు. ఫస్టాఫ్‌లో హీరో ఆడిన గేమ్‌ను సెకండాఫ్‌లో విలన్ రివర్స్‌లో ఆడి చూపిస్తాడు.మాస్ ఆడియన్స్ కోసమే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. యాక్షన్ పార్ట్ సినిమాటిక్‌గా ఉంది. పాతకాలపు సినిమాని మళ్ళీ కొత్త ఆర్టిస్ట్ లతో చూస్తున్నట్లుంది .

' దడ', 'బెజవాడ'తో మాస్ ఇమేజ్ కావాలనుకున్న నాగచైతన్య '100%లవ్‌స్టోరీ'తో లవర్‌బాయ్‌గా మారాడు. గతంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడం కోసం చేసిన ప్రయత్నమే' తడాఖా'.అయితే అంతగా ఆకట్టుకోలేక పోయాడు . నిష్కర్షగా చెప్పాల్సి వస్తే ఈ చిత్రానికి అతనే పెద్ద మైనెస్ అయ్యాడు . నాగ చైతన్య నటనను అన్ని విధాలుగా మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో సునీల్ పాత్ర కథాపరంగా భయస్తుడు కావడంతో.. అతనికి డాన్స్‌లు ఫైట్లు పెద్దగా లేవు. కానీ సెకండాఫ్‌లో ధైర్యవంతుడుగా ఆయన చేసిన బాడీ బిల్డప్ కథకు సరిపోయింది. తమన్నా పాత్ర పరిమితమనే చెప్పాలి.అయినా అందాలొలికించింది .ఆండ్రియా పాత్ర , నటన అంతంత మాత్రమే .
హిందీ విలన్ అశుతోష్ రాణా కు బగ్గా పాత్ర సరిపోయింది. క్రూరత్వంతో నిండిన ఆ పాత్రతో దాదాపు అందరినీ డామినేట్ చేశాడనే చెప్పాలి. బ్రహ్మానందం పొరుగింటి బాబాయి గా చేసినా ఆకట్టుకోలేకపోయాడు . వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, రమాప్రభ, రఘుబాబు, జయప్రకాశ్ రెడ్డి ఇతర పాత్రలు చేసారు .
ఈ చిత్రం లో ఆర్ధర్ విల్సన్ సినిమాటోగ్రఫీ హై లైట్ గా చెప్పుకోవాలి . డైలాగ్స్‌లు సన్నివేశపరంగా బాగానే రాశారు . నిర్మాణపు విలువు బాగున్నాయి. పాటల పరంగా తమన్ ఇచ్చిన ట్యూన్స్ గత చిత్రాలతరహాలో ఆకట్టుకోలేకపోయాయి. ఒక్క మాస్‌పాట మిగిలినవి సోసోగా ఉన్నాయి.రీ రికార్డింగ్ కొన్ని చోట్ల బాగుంది . -రవళి