'తడాఖా' చిత్ర సమీక్ష 2.5 / 5
శ్రీ సాయి గణేష్ పతాకం ఫై కిషోర్ దర్సకత్వం లో బెల్లం కొండ సురేష్ ,గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు .
అక్కినేని వారసుడిగా నాగచైత్య 'జోష్'తో మొదలైన కెరియర్ తర్వాత ఎత్తుపల్లాలుగా మారింది. '100%లవ్' మినహా 'దడ', 'జెజవాడ' మాస్ ఇమేజ్ చూపించి భంగపడ్డాడు. మళ్ళీ అటువంటి ఇమేజ్‌కోసం ట్రై చేస్తున్నాడు. చాలా కథలు విన్నాక... ఏదీ నచ్చకపోవడంతో తమిళచిత్రం 'వెట్టయ్' ను 'తడాఖా' గా రీమేక్ చేశాడు. ఇందులో మరో హీరో సునీల్‌కూడా ఉన్నాడు.విశేషమేమంటే - నిర్మాత బెల్లం కొండ సురేష్ హక్కులు కొని ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం .
తాతనుంచి వస్తున్న ఆస్తిగా పోలీసు ఉద్యోగం తన తండ్రి వెంకట్రామ్ (నాగబాబు) చనిపోతే పెద్దకొడుకైన శివరామకృస్ణ (సునీల్)కు వస్తుంది. చిన్నకొడుకు ఉద్యోగంసద్యోగంలేక బేవార్స్‌గా తిరుగుతుంటాడు. దానికి తగ్గట్లు ధైర్యవంతుడుకూడా. ఇతనికి రివర్స్ శివరామకృష్ణ. ఎస్.ఐ.గా సిటీకి వెళ్ళిన శివరామకృష్ణకు మొట్టమొదటి డ్యూటీ... ఊరినే శాసిస్తున్న రౌడీల ఆటలు కట్టించడమే. ఈ విషయాన్ని తమ్ముడికి చెప్పడంతో ఆ సమస్యలన్నీ తనే తీరుస్తాడు కార్తీక్ (నాగచైతన్య).చివరికి అసలు విషయం తెలిసిన రౌడీలు శివరామకృష్ణకు టార్గెట్ పెడతారు. అది తెలిసిన తమ్ముడు కార్తీక్ ఏంచేశాడు? అన్నలో ధైర్యాన్ని రెచ్చగొట్టి ప్రత్యర్ధులను ఎలా చిత్తు చేసాడన్నదే ఈ సినిమా.

ఇక దర్శకుడిగాకిషోర్ 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' తో ఫీల్ వున్న మంచి కదా చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందాడు . ఈ యాక్షన్ మసాలా 'తడాఖా' చిత్రానికి అతన్ని దర్శకుడిగా ఎంపిక చెయ్యడమే పెద్ద తప్పు . తమిళ చిత్రాన్ని కాపీ చేయడానికి కూడా తడబడ్డాడు. సొంత తెలివితో కాస్త స్టోరీని మార్చాడు. అయితే , సన్నివేశాలు ఆసక్తి కరం గా లేకపోవడం ... టేకింగ్ మరీ నీరసం గా వుండటం వల్ల సినిమా చూసిన వాళ్లకు చిర్రెత్తుకొస్తుంది .
ఈ చిత్ర కథ చాలా సింపుల్. గతంలో ఇలాంటివి చాలానే వచ్చాయి. అన్నదమ్ములుగా సునీల్, చైతన్య సరిపోయారు. కేవలం మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ పెట్టుకుని ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. హీరో ను ఎలివేట్ చేయాలి కాబట్టి- చైతన్యకు అనుగుణంగా ఫైట్స్, పాటలు పెట్టారు. ఇందుకు రివర్స్‌లో సునీల్ పాత్ర ఉంటుంది. తమిళవర్షన్ మార్చి దర్శకుడు డాలీ ఈ చిత్రాన్ని తీశాడు. ముఖ్యంగా సంభాషణల విషయం లో కొంత జాగ్రత్తపడ్డారు. ఫస్టాఫ్‌లో హీరో ఆడిన గేమ్‌ను సెకండాఫ్‌లో విలన్ రివర్స్‌లో ఆడి చూపిస్తాడు.మాస్ ఆడియన్స్ కోసమే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. యాక్షన్ పార్ట్ సినిమాటిక్‌గా ఉంది. పాతకాలపు సినిమాని మళ్ళీ కొత్త ఆర్టిస్ట్ లతో చూస్తున్నట్లుంది .

' దడ', 'బెజవాడ'తో మాస్ ఇమేజ్ కావాలనుకున్న నాగచైతన్య '100%లవ్‌స్టోరీ'తో లవర్‌బాయ్‌గా మారాడు. గతంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడం కోసం చేసిన ప్రయత్నమే' తడాఖా'.అయితే అంతగా ఆకట్టుకోలేక పోయాడు . నిష్కర్షగా చెప్పాల్సి వస్తే ఈ చిత్రానికి అతనే పెద్ద మైనెస్ అయ్యాడు . నాగ చైతన్య నటనను అన్ని విధాలుగా మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో సునీల్ పాత్ర కథాపరంగా భయస్తుడు కావడంతో.. అతనికి డాన్స్‌లు ఫైట్లు పెద్దగా లేవు. కానీ సెకండాఫ్‌లో ధైర్యవంతుడుగా ఆయన చేసిన బాడీ బిల్డప్ కథకు సరిపోయింది. తమన్నా పాత్ర పరిమితమనే చెప్పాలి.అయినా అందాలొలికించింది .ఆండ్రియా పాత్ర , నటన అంతంత మాత్రమే .
హిందీ విలన్ అశుతోష్ రాణా కు బగ్గా పాత్ర సరిపోయింది. క్రూరత్వంతో నిండిన ఆ పాత్రతో దాదాపు అందరినీ డామినేట్ చేశాడనే చెప్పాలి. బ్రహ్మానందం పొరుగింటి బాబాయి గా చేసినా ఆకట్టుకోలేకపోయాడు . వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, రమాప్రభ, రఘుబాబు, జయప్రకాశ్ రెడ్డి ఇతర పాత్రలు చేసారు .
ఈ చిత్రం లో ఆర్ధర్ విల్సన్ సినిమాటోగ్రఫీ హై లైట్ గా చెప్పుకోవాలి . డైలాగ్స్‌లు సన్నివేశపరంగా బాగానే రాశారు . నిర్మాణపు విలువు బాగున్నాయి. పాటల పరంగా తమన్ ఇచ్చిన ట్యూన్స్ గత చిత్రాలతరహాలో ఆకట్టుకోలేకపోయాయి. ఒక్క మాస్‌పాట మిగిలినవి సోసోగా ఉన్నాయి.రీ రికార్డింగ్ కొన్ని చోట్ల బాగుంది . -రవళి

0 comments:
Post a Comment