RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, May 10, 2013

' సుకుమారుడు' చిత్ర సమీక్ష


' సుకుమారుడు' చిత్ర సమీక్ష   1.5 / 5                                            


శ్రీ సౌదామిని పతాకం ఫై అశోక్ దర్శ కత్వం లో వేణుగోపాల్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు . 

 ఆది, నిషా అగర్వాల్‌, కృష్ణ, శారద, రఘుబాబు, వెన్నెల కిషోర్‌, తాగుబోతు రమేష్‌, చలపతిరావు, రావురమేష్‌ తదితరులు ఈ చిత్రం లో నటీ నటులు . 

    సాయికుమార్‌ వారసుడిగావచ్చిన ఆది 'ప్రేమకావాలి'తో ప్రేక్షకుల ప్రేమను పొందాడు. ఆ తర్వాత 'లవ్‌లీ'  లవర్‌బాయ్‌గా నటించాడు. ముచ్చటగా మూడవ సినిమా ' సుకుమారుడు' గా చేశాడు. అయితే కథల ఎంపికలో ఎలా ఉండాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవిషయం లో కొంత తమాషా జరిగినట్లు అనిపిస్తుంది .  ఎండుకంటే... ఇటీవలే విడుదలైన' గ్రీకువీరుడు' చిత్ర కథను పోలినట్లు  ఉండడం ఈ చిత్రం ప్రత్యేకత. ' పిల్లజమిందార్‌' తీసిన దర్శకుడు అశోక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. లోగడ 'సుందరకాండ' వంటి చిత్రాన్ని నిర్మించిన  కెవివి సత్యనారాయణ ఈ చిత్రాన్ని సమర్పించారు  . 

    యూరప్‌లో తండ్రి పెంపకంలో కమర్షియల్‌ మైండ్‌తో పెరిగినవాడు సుకుమార్‌ (ఆది). ఇండియా అంటే చికాకు. యూరప్‌లోనే వ్యాపారం చేసుకుని సెటిల్‌ అవ్వాలని తాపత్రయపడుతుండాడు. దానికి తగినట్లు బిజనెస్‌ చేయాలను ట్రై చేస్తాడు. కానీ అందుకు తగిన సొమ్ముఉండదు. బ్యాంక్‌లు ససేమిరా అంటాయి. దాంతో 150 కోట్ల ఆస్తి తన తాత ఊరైన ఇండియా వస్తాడు.  తాత అమ్మమ్మగా కృష్ణ, శారద నటించారు. సుకుమారుడు కోట్ల ఆస్తిని అమ్మేసి చెక్కేయాలని ట్రై చేస్తాడు. కానీ అతనికి అడుగడునా  రావురమేష్‌ అడ్డుపడుతుంటాడు. ఇంకోవైపు అసలు వారసురాలిని నేనే అని శారద కొడుకు కూతురు వస్తుంది. ఈ ట్విస్ట్‌తో ఆది ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది సినిమా.

    ఆది ఇందులోతన  నటనను హైలైట్‌ చేయాలనుకున్నాడు అందుకు మూడు పార్శాలున్న పాత్ర చేశాడు. అయితే దేనికి సూట్‌కాలేదు. నటన ఇంకాస్త మెరుగు పర్చుకోవాలి. డైలాగ్‌ డెలివరీ పర్వాలేదు. కానీ.. ఎన్‌టి.ఆర్‌ చెప్పే యమసభ డైలాగ్‌ను మాట్లాడినా.. అంత ఎఫెక్ట్‌ అనిపించలేదు.

    నిషా అగర్వాల్‌ పాత్ర  హీరోను పడేయమనే రొటీన్‌ కాన్సెప్ట్‌తో ఉన్నదే. అందులో ప్రత్యేకత ఏమీలేదు. బామ్మగా శారద చాలా కాలం తర్వాత తెరపై కన్పించింది. తాతగా కృష్ణ కన్పిస్తాడు. పాత్ర పరిమితమే. ఊరిలో దుష్టపాత్రగా తనికెళ్ళభరణి, రఘుబాబు పాత్రలు అలరిస్తాయి. హీరోకు స్నేహితులుగా  'పిల్లజమిందార్‌'లో ఉన్న బ్యాచ్‌నే దర్శకుడు తీసుకోవడం విశేషం . 

    ఈ చిత్రానికి ప్రధానమైన ఆకర్షణ సినిమాటోగ్రఫీ. పల్లెటూరి అందాల్ని చక్కగా చూపించాడు. సంగీతపరంగా అనూప్‌ బాణీలు ఏమంత ఎఫెక్ట్‌గా లేవు. 'నీలాకాశంలో మెరిసే చందురుడివి' అనే పాట కాస్త మెలోడీగా ఉంది. ఎడిటర్ కు చాలా పనికల్పించాడు. ఎక్కడ ఏ సన్నివేశం వస్తుందో అర్థంకాకుండా ఉంది. దాన్ని కటింగ్‌ చేయడం లో  సాహసమే చేశాడనే చెప్పాలి. స్క్రీన్‌ప్లే ప్రధాన లోపం. మాటలు ఎఫెక్ట్‌గా లేవు. ప్రాసకోసం పాకులాడుతూ సన పెట్టిస్తాడు.

    సినిమాలో ముక్కలు ముక్కలుగా కథను చెప్పడంతో సుకుమారుడు డెప్త్‌పోయింది. ఏ సన్నివేశం బాగోదు. కొత్తగా మెగాఫోన్‌ పట్టుకున్న వ్యక్తి చేసినట్లుగా వుంది . ' పిల్లజమిందార్‌' అనే చిత్రం ఓ మలయాళ రీమేక్  కనుకదర్శకుడు  దాన్ని చక్కగా డీల్‌ చేసాడు . అదే 'సుకుమారుడు'కు వచ్చేసరికి అసలు సరుకు  బయటపడింది. దర్శకుడు ఎక్కడా మెప్పించలేకపోయాడు. కథకూడా అదే తరహాలో లో ఉంటుంది.' పిల్లజమీందార్' లో...జల్సాగా తిరిగే   నానికి తాత 'తన ఆస్తి మనవడు బాగుపడితేగానీ' ఇవ్వరాదని వీలునామా రాస్తాడు. 'సుకుమారుడు'లో.... విదేశీవ్యామోహంలో బిజినెస్‌కోసం డబ్బుకావాల్సివస్తే... ఆస్తికోసం ఇండియా వస్తే.. వీడు తగినవాడాకాదా? అని బామ్మ టెస్టింగ్‌ పెడుతుంది. ఈ కథ నాగార్జున నటించిన 'గ్రీకువీరుడు'కు డిటోనే. ఇద్దరు దర్శకులకు ఒకే ఐడియా రావడం కామనే అయినా.. దాన్ని తీసేవిధానంలో ఇంకాస్త ఎఫెక్ట్‌ పెడితే బాగుండేది. 

    ఇది  ప్రధానంగా దర్శకుడి సినిమా. భారీ తారాగణం ఉన్న ఈ కథను నడిపించడంలో దర్శకుడు ఫెయిల్‌ అయ్యాడు. ఏ సన్నివేశాం ఇంట్రస్ట్‌గా ఉండదు. పంచ్‌ డైలాగ్స్‌ పేరుతో వచ్చే డైలాగ్స్‌ విసుగు తెప్పిస్తాయి. పాటలుకూడా ఏమంత బాగోలేవు. నవ్వుకోవాలంటే.. గిలిగింతలు పెట్టుకోవాల్సిందే. 
-రవళి

0 comments:

Post a Comment