Saturday, November 1, 2014
జోడీ బాగుంటేనే ఆ సినిమా భారీ హిట్ !
జోడీ బాగుంటేనే ఆ సినిమా భారీ హిట్ ! | |
హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు దక్కే పారితోషికాలు తక్కువనే విషయం అందరికీ తెలిసిందే. బెంగాలీ బ్యూటీ బిపాసా బసు ఈ విషయాన్ని బహిరంగంగానే ఒప్పకుంది. పారితోషికాలు ఇలాగే కొనసాగుతాయని, ఈ విషయంలో మార్పు సాధ్యం కాకపోవచ్చని చెప్పింది. దీని గురించి ఆలోచించడం కూడా వృథాయేనంటూ కుండబద్దలు కొట్టింది. సల్మాన్ ఖాన్ వంటి హీరోకు కత్రినా వంటి హీరోయిన్ జోడీగా ఉంటేనే ఆ సినిమా భారీ హిట్ కొట్టే అవకాశముంటుందని, అయినా పారితోషికాల్లో మాత్రం తేడాలు ఉంటాయని చెప్పింది.
దీని గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల ఒరిగేదీ లేదంటూ నిట్టూర్పు విడిచింది. అయితే పాత్రల విషయంలో మాత్రం సానుకూల మార్పులు వస్తున్నాయని, కథానాయికలకు కూడా సత్తా ఉన్నవి దొరుకుతున్నాయని చెప్పింది.‘మాకు పరిశ్రమలో మంచిస్థానం దొరుకుతోంది. ఇదివరకైతే ఆడిపాడడానికే హీరోయిన్లు పరిమితమయ్యే వాళ్లు. పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయి. నటనకు అవకాశం ఉన్న పాత్రలు మహిళలకూ వస్తున్నాయి. అన్ని వయసుల మహిళా నటులకు కూడా ఆసక్తికర పాత్రలు దొరుకుతున్నాయి’ అని చెప్పిన బిప్స్ 2001 నుంచి బాలీవుడ్లో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ తాజా సినిమా' క్రిచర్ 'త్వరలో విడుదలకు రెడీ అవుతోంది.అంతేకాదు దీనిని 3డీ సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రీకరించారు. ఇటీవల విడుదలైన 'బాబీ జాసూస్' వంటి మహిళల ఆధారిత చిత్రాల కథలు ఎంతో బాగున్నాయని ప్రశంసించింది. అయితే బిప్స్ తాజాగా నటించిన 'షమ్షకల్స్' బాక్సాఫీసు వద్ద నిలదొక్కుకోలేకపోయింది. అంతేగాక ఇందులో ఈమె పాత్ర నిడివి చాలా తక్కువే కాదు.. బిప్స్ కంటే చాలా జూనియర్ అయిన తమన్నాకు ప్రధాన హీరోయిన్ పాత్ర ఇచ్చారు. దీంతో బిపాసా బసు సినిమా ప్రచార కార్యక్రమాల్లోనూ కనిపించలేదు. |
నేను సిగ్గుతో తలవంచుకున్నాను!
నేను సిగ్గుతో తలవంచుకున్నాను! | |
కుంగ్ ఫూ సూపర్ స్టార్ జాకీ చాన్ కుమారుడు జాయ్ సీ చాన్ ను చైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత మాదక ద్రవ్యాలను తీసుకోవడంతో అతన్నిపోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా, బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నజాయ్ సీ చాన్ .. ఫాంగ్ జుమింగ్ గా అభిమానులకు సుపరిచయం. ఈ స్టార్ హీరో, అతని స్నేహితుడైన తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్ తో కలిసి వస్తుండగా వారిద్దరూ పోలీసులకు పట్టుబడ్డారు.
తన కుమారుడు జాయ్ సీ చేసిన నిర్వాకం వల్ల సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని హాలీవుడ్ నటుడు, చైనా కుంగుఫూ స్టార్ జాకీ చాన్ అన్నారు. జాకీ చాన్ నివాసంలో ఆయన కుమారుడు డ్రగ్స్ తో ఆగస్టు 14 తేదిన పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. చైనాలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా జాకీ చాన్ గతంలో ప్రచారం నిర్వహించారు. మొదటిసారి ఈ వార్త వినగానే చెప్పలేనంత కోపం వచ్చింది. ఎంతో ప్రజాదరణ కలిగిఉన్న నేను సిగ్గుతో తలవంచుకున్నాను. విషాదంలో మునిగిపోయాను అంటూ ఓ వెబ్ సైట్ కు తెలిపారు. జాయ్ సీ తల్లి దుఖంలో మునిగిపోయారని జాకీ చాన్ అన్నారు. జాకీ చాన్ చేసిన తప్పు తెలుసుకుని యువతరం మంచి మార్గంలో నడుస్తుందని ఆశిస్తున్నానని జాకీ చాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జాయ్ సీ చాన్ ప్రజలకు క్షమాపణలు మత్తు పదార్థాల కేసులో అరెస్టైన కుంగ్ ఫూ సూపర్ స్టార్ జాకీ చాన్ కుమారుడు జాయ్ సీ చాన్ క్షమాపణ ప్రజలకు చెప్పాడు. మత్తు పదార్థాల కేసులో పట్టుబడినందుకు తనను మన్నించాలని వేడుకున్నాడు. జాయ్ సీ చాన్ వ్యవహారాలు చూసే 'ఎమ్ స్టోన్స్' క్షమాపణ ప్రకటన విడుదల చేసింది. జాయ్ సీ చాన్ చేసిన పని సామాజికంగా చాలా ప్రభావం చూపుతుందని పేర్కొంది. అతడు త్వరలోనే మంచిదారిలోకి వస్తాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది. సినిమా, బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న 31 ఏళ్ల జాయ్ సీ చాన్ ను చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాంగ్ జుమింగ్ గా అభిమానులకు సుపరిచితుడైన ఈ స్టార్ హీరో, అతని స్నేహితుడైన తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్ తో కలిసి పోలీసులకు పట్టుబడ్డాడు. వీరు నిషేధిత మారిజూనా డ్రగ్ తీసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. చాన్ ఇంటి నుంచి వంద గ్రాములు మారిజూనా డ్రగ్ తీసుకొచ్చినట్టు వారు విచారణలో అంగీకరించారు. |
తొలిసారి ఈ పాట కు చాలా ఇబ్బందిపడ్డా!
తొలిసారి ఈ పాట కు చాలా ఇబ్బందిపడ్డా! | |
నా కెరీర్లో ఇంత వరకు ఏ సినిమాలోనూ నటించడానికి ఇబ్బంది పడలేదు. కానీ తొలిసారి 'మీగమన్' అనే తమిళ చిత్రంలోని ఓ పాట చేయడానికి చాలా ఇబ్బందిపడాల్సి వచ్చింది అని తెలిపింది హన్సిక. తెలుగులో ప్రస్తుతం పవర్ చిత్రంలో నటిస్తున్న ఈ సుందరి తమిళంలో అరడజను చిత్రాలతో బిజీగా వుంది. ఈ సందర్భంగా హన్సిక మరిన్ని వివరాలు తెలియజేస్తూ తమిళంలో ఆర్య హీరోగా దర్శకుడు మగిళ తిరుమేని 'మీగమన్' చిత్రం రూపొందిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ పాటలో అయిష్టంగానే నటించాల్సి వచ్చింది.
పాటలోని కొన్ని సన్నివేశాల్లో మోతాదుకు మించి ఎక్స్పోజింగ్ చేయాలన్నారు. అలాగైతే ఇందులో నటించడం నా వల్ల కాదని దర్శకుడితో చెప్పేశాను. అయితే పాటలో ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేవు. నన్ను నమ్ము. ఈ విషయంలో నాదీ పూచీ -అని దర్శకుడు నన్ను ఒప్పించారు. ఆయన ఎంత చెప్పినా చివరికి అయిష్టంగానే పాటలో నటించాను. ఇకపై ఎవరు ఎంత బలవంతపెట్టినా నా మనస్సాక్షికి విరుద్ధంగా అసభ్యకర సన్నివేశాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నాను అని తెలిపింది. అందుకనే హన్సిక ఎగ్గొట్టింది! ఈ చిత్ర ప్రచారానికి నిర్మాత ఆహ్వానించినా నటి హన్సిక రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆర్య, హన్సిక జంటగా నటించిన చిత్రం మరియాన్ మిగమాన్'. నెమిచంద్ జపక్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత వి.హిదేశ్ జపక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాగిళ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు. తడయరతాక్క చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది.ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఆర్.సతీష్‌కుమార్ చాయాగ్రహణం నెరుపుతున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ చెన్నైలో ఒక ఎఫ్ఎం రేడియో సంస్థ కార్యాలయంలో జరిగింది. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మగిళ్ తిరుమేణి మాట్లాడుతూ- ఇది కమర్షియల్ అంశాలతో రూపొందిస్తున్న వైవిద్యభరిత కథా చిత్రం అని తెలిపారు. నటుడు ఆర్యను దృష్టిలో పెట్టుకుని చిత్ర కథను తయారు చేయకున్నా ఆయన పాత్ర పోషణ చూసిన తరువాత మిగమాన్ చిత్రం హీరో పాత్రకు ఆర్యనే కరెక్ట్ అనిపించిందన్నారు. అదేవిధంగా హీరోయిన్ పాత్రకు నటి హన్సిక తన ఆలోచనలోనే లేదన్నారు. ముంబాయి నుంచి కొత్త హీరోయిన్ను పరిచయం చేద్దామనుకున్నానన్నారు. అయితే నిర్మాత హన్సికనే తమ చిత్ర హీరోయిన్ కావాలని, పట్టుబట్టి ఆమెతో మాట్లాడినట్లు చెప్పారన్నారు. దీంతో హన్సికను కలిసి కథ వినిపించగా మరో మాటలేకుండా వెంటనే తానీ చిత్రం చేస్తున్నానని చెప్పారన్నారు. ఆమె నటన ఈ చిత్రంలో ప్రశంసలందుకుంటుందన్నారు.ఈ కార్యక్రమానికి హన్సిక రాలేదేమన్న విలేకర్ల ప్రశ్నకు ఆర్య కల్పించుకుని- అలాంటి వ్యవహారాలన్నీ నిర్మాతనే చూసుకుంటున్నారని బదులిచ్చారు. నిర్మాత పిలిచినా ఆమె రాలేదని ఈ సారి తాను ఆమెను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని నవ్వుతూ చెప్పారు. |
ఒక్క సక్సెస్... మూడు సూపర్ ఛాన్సులు !
ఒక్క సక్సెస్... మూడు సూపర్ ఛాన్సులు ! | |
ఓవర్‌నైట్ జీవితం మారిపోవడం అంటే అదే మరి! బాలీవుడ్ హాట్‌గాళ్, శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ కెరీర్‌ని చూస్తే ఆ సంగతి ఇట్టే అర్థమై పోతుంది. నిన్నటివరకూ సినిమాల్లేక క్యాట్‌వాక్ లకే పరిమితమైన ఈ అమ్మడు వచ్చిన ఏకైక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్టార్ రేంజ్ కి పెరిగిపోయింది . సల్మాన్‌ఖాన్ సరసన ఈ అమ్మడు `కిక్'లో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో సల్మాన్ భాయ్ స్టంట్స్ ఎంత పేరొచ్చిందో ?జాక్విలిన్ గ్లామర్‌కి, నటనకి అంతే పేరొచ్చింది. దాంతో ఇప్పుడు అమ్మడి ఇంటి ముందు దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారని సమాచారం. ఇప్పటికే 'రాయ్' అనే సినిమాలో అవకాశం అందుకుంది. హృతిక్‌రోషన్ సరసన ఛాన్స్ అందుకుంది. అదేగాక అక్షయ్‌కుమార్ సరసన ఓ సినిమాకి సంతకం చేసి బాలీవుడ్ లో 'టాక్ ఆఫ్ ది టౌన్' అయ్యింది. 'వారియర్' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కరణ్‌జోహార్ దర్శకత్వం వహిస్తు న్నారు. ఒక్క సక్సెస్. మూడు సూపర్ ఛాన్సులిచ్చింది. అందుకే 'ఎవిరి డాగ్ హాజ్ ఎ డే' అని అంటుంటారు. ఈరోజు జాక్విలిన్ వంతు వచ్చింది. నిన్నటివరకూ కేవలం దీపిక, సోనాక్షి, కత్రిన అంటూ చదువుకున్నాం. ఇక నుంచి జాక్విలిన్ పేరు కూడా ఈ వరుసలో చేరిపోయినట్టేనన్న మాట!
|
అప్పుడప్పుడు విలన్ పాత్రలు చేస్తేనే ఆనందం!
అప్పుడప్పుడు విలన్ పాత్రలు చేస్తేనే ఆనందం! | |
యాక్షన్, కామెడీ పాత్రలతోపాటు అప్పుడప్పుడు విలన్ పాత్రలు చేస్తేనే ఆనందంగా ఉంటుంద’ని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అన్నాడు. సినిమాల్లో విలన్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నాడు. ‘సినిమాలో అందరికంటే ఎక్కువ సేపు కనిపించేది విలనే.. హీరోయిన్ వెనుక ఎక్కువ తిరిగే ఛాన్స్ హీరోకన్నా విలన్‌కే ఉంటుంది..హీరోకు తన చెల్లి, తల్లి కోసం కష్టపడటం, వారిని రక్షించుకోవడంతోనే సమయం అంతా గడిచిపోతుంది.. కాకపోతే విలన్ చివరి ఐదు నిమిషాలు హీరో చేతిలో దెబ్బలు తింటాడు అంతే..’ అంటూ విలన్ పాత్ర తనకు ఎందుకు ఇష్టమో ఈ సూపర్ హీరో చెప్పుకొచ్చాడు.
తన రాబోయే సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడాడు. అక్షయ్‌కు మంచి కామెడీ, యాక్షన్ హీరోగా పేరుంది. కాగా, కామెడీ చేయడమంటే తనకు చాలా ఇష్టమని అక్షయ్ చెప్పాడు. హాస్యంలో పలు రకాలున్నాయని, వాటి గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని ఆయన అన్నాడు. కాగా, ప్రకాష్ రాజ్ చేసే కామెడీ అంటే తనకు చాలా ఇష్టమని, ఆతరహా హాస్యం పండించడానికి కష్టపడతానని చెప్పాడు. తన 27 యేళ్ల సినీ ప్రస్థానంపై అతడు చాలా ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ‘ఈ రోజుకీ నేను ఉదయం లేవగానే షూటింగ్‌కు వెళ్లేందుకు చాలా ఉత్సుకత చూపిస్తాను ఈ వృత్తి నాకు చాలా బాగా నచ్చింది.. మున్ముందు కూడా నా వృత్తిపట్ల అంకిత భావంతోనే పనిచేస్తా’నన్నాడు. ఒక జీవితకాలంలో అనేక పాత్రలను పోషించగలిగే అవకాశమున్న ఏకైక వృత్తి నటన అని ఆయన వ్యాఖ్యానించాడు. ‘ఇప్పటివరకు నేను చాలా సినిమాలు చేశా.. వాటిలో వివిధ పాత్రలను పోషించా.. నటనా వృత్తిలో మనం ఎంతోమంది అమ్మాయిలతో రొమాన్స్ చేయవచ్చు (నవ్వుతూ..) ఎన్నో ఆటలు ఆడొచ్చు.. పోలీస్ ఆఫీసర్ అవ్వొచ్చు.. విలన్‌గా మారొచ్చు.. ఏ పాత్ర చేసినా డబ్బులు మాత్రం వస్తాయి.. అందుకే ఈ వృత్తి అంటే నాకు ప్రాణం..’ అంటూ నవ్వుతూ ముక్తాయించాడు. |
నాయకురాలైన సినీ తార గా ప్రియాంక
నాయకురాలైన సినీ తార గా ప్రియాంక | |
బాలీవుడ్లో వైవిధ్యానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే కథానాయికల్లో ప్రియాంకచోప్రా ఒకరు. ప్రతి చిత్రంలో పాత్రపరంగా కొత్తదనాన్ని ప్రదర్శించడానికి ఇష్టపడుతుందామె. ప్రస్తుతం భారతీయ మహిళా బాక్సర్ మేరీకోమ్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కుతున్న మేరీకోమ్ చిత్రంతో అభిమానుల్ని అలరించడానికి సిద్ధమవుతోంది ప్రియాంకచోప్రా.
ఈ సినిమా కోసం గత రెండేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తోన్న ఆమె ఇటీవలే మధుర్ బండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'మేడమ్‌జీ' చిత్రానికి ఓకే చెప్పింది. ఐటెంగర్ల్ స్థాయి నుంచి దేశరాజకీయాలను శాసించే నాయకురాలిగా ఎదిగిన ఓ సినిమా తార జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. సన్నివేశాల పరంగా ఈ సినిమా స్క్రిప్ట్ తొలి భాగంలో దర్శకుడు మధుర్ బండార్కర్ శృంగార సన్నివేశాలకు ఎక్కువగా చోటుకల్పించినట్లు తెలిసింది. ఇటీవలే చిత్ర కథను విన్న ప్రియాంకచోప్రా ఈ సన్నివేశాలను పట్ల ఆసంతృప్తి వ్యక్తం చేసిందని, వాటిని తగ్గించాల్సిందిగా మధుర్ బండార్కర్‌ను కోరినట్లు తెలిసింది. ఈ చిత్రానికి మధుర్ బండార్కర్‌తో పాటు ప్రియాంకచోప్రా కూడా నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. |
మేం హార్డ్ వర్క్ తోనే సాధించి చూపించాం!
మేం హార్డ్ వర్క్ తోనే సాధించి చూపించాం! | |
ఎక్కడైనా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి తాజాగా మన బాలీవుడ్ అగ్రహీరోల విషయంలో మరోసారి రుజువైంది. గతంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ , కండల వీరుడు సల్మాన్ ఖాన్ లు తమ మధ్య చోటు చేసుకున్నవివాదానికి తెరదించే క్రమంలో పడ్డారు . ఈ మధ్యనే 'కింగ్ ఆఫ్ ద బాలీవుడ్' ఎవరని విలేకర్లు అడిగిన ప్రశ్నకు- 'షారుఖ్ ఖాన్' అని సమాధానమిచ్చి సల్మాన్ తన విధేయతను చాటుకున్నాడు. అందుకు షారుఖ్ ఖాన్ కూడా సల్మాన్ కు ధన్యవాదాలు తెలియజేశాడు.
తాజాగా సల్మాన్ వ్యాఖ్యలపై షారుఖ్ స్పందిస్తూ.. 'మేము ఇద్దరం గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటాం. ఒకరి పట్ల ఒకరికి ద్వేషాలు ఏమీ లేవు.మేము ఏమి సాధించినా హార్డ్ వర్క్ తోనే చేసి చూపించాం. దాంతోనే మాకు పేరు ప్రతిష్టలు వచ్చాయి' అని షారుఖ్ తెలిపాడు. తాము ఎప్పుట్నుంచో సినిమా ఇండస్ట్రీలో ఉంటూ అభిమానుల్ని అలరిస్తున్నామన్న సంగతిని బాద్ షా గుర్తు చేశాడు. అయినప్పటికీ ఇద్దరం ఎప్పుడూ ఒకర్నొకరు కించపరుచుకునే విధంగా ప్రవర్తించ లేదని తెలిపాడు. మా ఇద్దరికీ నంబర్ గేమ్ పై అంతగా నమ్మకం లేదని తెలిపాడు. తాము ఎప్పుడూ మా తదుపరి సినిమాను ఎంత బాగా చేయాలని మాత్రమే ఆలోచిస్తామని షారుఖ్ తెలిపాడు.అంతకుముందు కూడా తనకు, సల్మాన్ ఖాన్ కు మధ్య స్నేహం, ప్రేమ మెండుగా ఉన్నాయని షారూఖ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. |
ఆ లెటర్ చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు !
ఆ లెటర్ చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు ! | |
ప్రతీ ఒక్కరి జీవితంలో కన్నీళ్లు పెట్టుకునే సందర్భాలు వుంటాయి . కన్నీళ్లు పెట్టుకోవడానికి వారు వీరు అనే తారతమ్యం కూడా ఏమీ ఉండదు. అటువంటి సందర్భమే ఒకటి బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ జీవితంలో కూడా తాజాగా చోటు చేసుకుంది. 'సింగమ్ రిటర్న్స్' విజయాన్ని ఆకాంక్షిస్తూ- తన స్నేహితుడు, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాసిన లెటర్ చూసి అజయ్ కన్నీళ్లు పెట్టుకున్నాడట.
ప్రస్తుతం పుణేలోని యర్రవాడ సెంట్రల్ జైల్లో ఉంటున్న సంజయ్ దత్ రాసిన ఉత్తరం అజయ్ ను మనసును కదిలించిందట. ఒక తెల్లటి రూల్ పేపర్ మీద బ్లూ -ఇంక్ తో సంజయ్ రాసిన లెటర్ లో 'సింగమ్ రిటర్న్స్'విడుదల సందర్భంగా అజయ్ దేవగన్ కు అభినందనలు తెలియజేస్తూ- తన పాత జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నాడు. ఇదే సందర్భంలో 2008లో వీరిద్దరూ కలిసి నటించిన 'మెహ్ బూబా' సినిమా సందర్భంలో వారు కలిసి డ్యాన్స్ చేసిన సన్నివేశాలను నెమరవేసుకున్నాడు. 'రాజు(అజయ్ ను సంజయ్ పిలుచుకునే పేరు) మనం తిరిగి కలిసినప్పుడు మన చేతి రాతతో రాసుకున్న పుస్తకాలను మార్చుకుందాం. ముందుగా ఈ లెటర్ రాస్తున్నాను. నువ్వు హీరోగా చేసిన సింగమ్ రిటర్న్స్ విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని లెటర్ లో తెలిపాడు. ఇక్కడ నువ్వు సంతోషించాల్సిన విషయం ఒకటి ఉంది. నేను 11 కిలోల బరువు తగ్గాను. జైల్లో క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తున్నాను.నేను చొక్కా వేసుకోకుండా ఉన్నప్పుడు 8 ప్యాక్స్ కనిపిస్తుందని' సంజయ్ తెలిపాడు. ఈ లెటర్ చూసిన అనంతరం తనకు కన్నీళ్లు ఆగలేదని స్వయంగా అజయ్ దేవగన్ పేర్కొన్నాడు. అంతకుముందు ఆ హీరోల తండ్రులు సునీల్ దత్, వీరూ దేవగన్ లు మధ్య ఉండే సాన్నిహిత్యాన్నే ఈ ఇద్దరూ కంటిన్యూ చేస్తుండటం నిజంగా గర్వించదగ్గ విషయమే. తమిళ హీరో సూర్య నటించిన సింగం-2 రీమేక్ గా వస్తున్న సింగమ్ రిటర్న్స్ లో అజయ్ దేవగన్, కరీనా కపూర్ లు జంటగా నటిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్ టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు |
Thursday, July 10, 2014
‘దృశ్యం’ చిత్ర సమీక్ష 3.5/5
సురేష్ ప్రొడక్షన్స్ పతాకం ఫై శ్రీ ప్రియ దర్శకత్వం లో డి. సురేష్ బాబు , రాజ్ కుమార్ సేతుపతి ఈ చిత్రాన్ని నిర్మించారు .
విజయనగరం దగ్గరలోని రాజవరం అనే ఊరిలో కథ మొదలవుతుంది. రాంబాబు (వెంకటేష్) అక్కడి పోలీసుస్టేషన్లో కూర్చొని ఉంటాడు. అప్పుడే డ్యూటీలోకి వచ్చిన కొత్త కానిస్టేబుల్ .. రాంబాబును చూసి.... ఈయనవల్లే పోలీసుస్టేషన్ మొత్తం ట్రాన్ఫర్ అయిందని చెబుతాడు. ఎందుకు అలా జరిగిందనేది ఫ్లాష్‌బ్యాక్.... ఆ ఊరిలో జ్యోతి కేబుల్ నెట్వర్క్స్ పెట్టుకున్న రాంబాబు(వెంకటేష్) తన కుటుంబం... భార్య ఇద్దరు పిల్లలైన... (మీనా) ,అంజు (కృతిక), అను (బేబీ ఎస్తర్) లతో హ్యాపీగా జీవిస్తుంటాడు. రాంబాబు చాలా నిజాయితీ పరుడు. అదే ఊరిలో బాగా లంచాలకు మరిగిన వీరభద్రం(రవి కాలే)కి రాంబాబుకి అస్సలు పడదు. కాగా, ఒకరోజు స్కూల్ టూర్ నిమిత్తం అంజు .. ఓ ఊరు వెళుతుంది. అక్కడ ఐజి గీత ప్రభాకర్(నదియా) కుమారుడు వరుణ్ ఆడవాళ్ళ ఫొటోలు తీస్తాడు. హైదరాబాద్ అమ్మాయి గొడవ చేస్తుంది. ఓసారి అంజు ఊరు వచ్చిన వరుణ్.... కనపడకుండా పోతాడు. దీనికి కారణం రాంబాబే అయి ఉంటాడని వీరభద్రం ఐజీకి చెబుతాడు. దాంతో అతని ఫ్యామిలీ ఇరుక్కుంటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏమన్నా సంబంధం ఉందా? లేక కావాలనే ఇరికించారా ? చివరికి రాంబాబు కుటుంబం ఆ కేసు నుంచి బయటపడ్డారా? అన్నది సినిమాలో చూడాల్సిందే....
మలయాళంలో మోహన్‌లాల్ నటించిన సూపర్ హిట్ ‘దృశ్యం’ చిత్రాన్ని అదే పేరుతో రీమేక్ చేశారు. తమిళంలో సినిమాలు తీసే రాజ్ కుమార్ సేతుపతి తో డి. సురేష్ బాబు కలిసి నిర్మించారు. మొదటిభాగం సాదాసీదాగా పల్లెటూరిలో ఓ కుటుంబం... చుట్టూ ఉన్న ప్రజల మధ్య సాగుతుంది. ఇంటర్వెల్ ధ్రిల్లింగ్ గా ఉంటుంది. సెకండాఫ్‌లో అది కంటెన్యూ అవుతుంది. థియేటర్స్ లో సినిమా చూసే ప్రతి ఒక్కరి చేత 'వావ్' 'సూపర్బ్' అనిపిస్తుంది . ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని జోడించి చూపించడం ఇదే తొలిసారి కావడం వలన ఆడియన్స్ థ్రిల్ కి ఫీలవుతారు. సెకండాఫ్ మొత్తం చాలా గ్రిప్పింగ్ గా అందరూ సీట్లో నుంచి కదలకుండా ఏం జరుగుతుందా? అని చూసేలా ఉంటుంది. ఇది మళయాళ సినిమాకి రీమేక్ అయినా -యూనివర్సల్ కాన్సెప్ట్ కనుక , తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. తెలుగు ఆడియన్స్ మునుపెన్నడూ చూడని విధంగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఉండే కొన్ని థ్రిల్లింగ్ మోమెంట్స్, ఎమోషనల్ సీన్స్, నటీనటుల పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్స్ అయితే , అలాగే రొటీన్ కి విభిన్నంగా కోరుకునే వారికి కావాల్సిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే ఆసక్తికరంగా సాగే సినిమా చూడాలనుకునే వారిలో ఉత్కంఠని కలిగించే అంశాలు -ఈ సినిమాలో ఉండడం వలన అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.
ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపైన వెంకటేష్ నడిపించారు . వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించడం కొత్తేమీ కాదు, కానీ ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాలో చేయడం మాత్రం ఇదే తొలిసారి. రాంబాబు పాత్రలో అద్భుతమైన నటనని కనబరిచాడు.
అమాయకుడిగానూ, తెలివిమీరిన వాడిగా బాగా చేశాడు. కేవలం నాల్గవతరగతి ప్యాస్ అయినా... లోకజ్జానాన్నితను చూసే సినిమాలద్వారా ఎలా పొందాడనేది ఇందులో కీలకం. చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించిన మీనా- వెంకటేష్ భార్య పాత్రలో చక్కగా సరిపోయింది.10వతరగతి ఫెయిల్ అయిన జ్యోతిగా మీనా నటించింది. తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఎప్పటిలానే వెంకీ – మీనాల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కుటుంబాల్లో ఉండే అల్లరి చిలిపి సరదాలు ఇందులో బాగానే ఉన్నాయి.అలాగే ఈ సినిమాతో పరిచయమైన కృతిక, బేబీ ఎస్తర్ లు తమ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించేలా నటించారు .అవినీతి పోలీసుగా రవికాలే బాగా చేశాడు. ఐజీ గా నదియా చాలా బాగా చేసింది . తల్లిగా,పోలీస్ అధికారిగా జీవించింది. ఆమె భర్తగా సీనియర్ నరేశ్ బాగా చేశాడు. వెంకీ – సప్తగిరి మధ్య వచ్చే సన్నివేశాలు, అలాగే కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. పరుచూరి వెంకటేశ్వరావు, చిత్రం శ్రీను, ఉత్తేజ్, చైతన్య కృష్ణ, సమీర్,బెనర్జీ, కాదంబరికిరణ్, చలపతిరావు, అన్నపూర్ణమ్మ మిగిలిన పాత్రలు చేసారు .
దర్శకురాలు శ్రీ ప్రియ మళయాళ వెర్షన్ లోని సీన్స్ ని ' సేమ్ టు సేమ్' దించినా- థ్రిల్లింగ్ మోమెంట్స్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడంలో మాత్రం పూర్తిగా సక్సెస్ అయ్యింది. అలాగే నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. ఇక సినిమాకి శరత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. థ్రిల్లింగ్ మోమెంట్స్ కి అతను ఇచ్చిన మ్యూజిక్ ఆడియన్స్ లో ఉత్కంఠని మరింత పెంచింది . అలాగే ఎస్. గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి మరింత హెల్ప్ అయ్యింది. సినిమా అంతా పచ్చని పల్లెటూరి వాతావరణాన్ని చాలా బాగా చూపించాడు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది. ఆయన మొదటి భాగం లో- మరి కాస్త తగ్గించి ఉంటే సినిమా ఇంకా చాలా బాగుండేది. అలాగే జీటు జోసెఫ్ అందించిన కథ -కథనం, పరుచూరి బ్రదర్స్ రచన, డార్లింగ్ స్వామి డైలాగ్స్ కూడా బాగున్నాయి -రవళి
Friday, June 27, 2014
'ఆటోనగర్ సూర్య' చిత్ర సమీక్ష
'ఆటోనగర్ సూర్య' చిత్ర సమీక్ష 2. 5 / 5
మ్యాక్స్ ఇండియా లిమిటెడ్ పతాకంఫై దేవకట్టా రచన ,దర్శకత్వంలో కె .అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు
మ్యాక్స్ ఇండియా లిమిటెడ్ పతాకంఫై దేవకట్టా రచన ,దర్శకత్వంలో కె .అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు
చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథగా మారిన సూర్య (నాగచైతన్య) అతని మేనమామ సాయికుమార్ కూడా ఆదరించడు. అక్కడే ఆటోనగర్‌లో ఉండే మెకానిక్ (సమ్మెటగాంధీ) ఇచ్చిన ప్రోత్సాహంతో మంచి మెకానిక్‌గా మారతాడు. డీజిల్‌తో పనిలేకుండా బేటరీతోనే జీపుల్ని నడిపే టెక్నిక్‌ను కనిపెడతాడు. కానీ ఆటోనగర్‌పై కన్నేసిన ఇంద్ర (జయప్రకాష్‌రెడ్డి) మాఫియా ముఠా- సూర్య కనిపెట్టిన ఆ టెక్నాలజీ ఇవ్వనందుకు గొడవ చేయడంతో- సూర్య జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడే తను మెకానికల్ ఇంజనీరింగ్ చదివి.. బయటకు వస్తాడు. కానీ మళ్ళీ తన తెలివితేటలతో సొంతంగా షెడ్ పెట్టాలనుకున్నా - మళ్ళీ అదే మాఫియా అడ్డుకుంటుంది. వారిని ఏమీచేయలేని స్థితి. ఇదంతా మేయర్ కోటిలింగం(మధు) కనుసన్నల్లోనే జరుగుతుంది . చివరికి సూర్య వారిని ఎదిరించి- ఆటోనగర్ ని ఎలా కాపాడాడు? అన్నది కథ.
నాగచైతన్య చిత్రాలంటే ప్రేమకథలకు పెట్టింది పేరు . '100%లవ్', ' ఏమాయచేసావె', 'మనం' వంటి సాఫ్ట్ పాత్రలను చేసిన చైతన్యకు మాస్ ఇమేజ్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం లో భాగం గానే 'జోష్', 'దడ', 'బెజవాడ' చిత్రాల్లో ఒక్కోవిధమైన మాఫియాను ఎదిరించే పాత్రలను పోషించాడు.అదేవిధంగా 'వెన్నెల' వంటి హాయిగొలిపే చిత్రానికి దర్శకత్వం వహించిన దేవకట్టా ఆ తరువాత .... 'ప్రస్థానం' అనే రాజకీయ నేపధ్యాన్ని ఎంచుకున్నాడు. ఆ రెండింటికీ మంచి పేరే వచ్చింది. ఇప్పుడు అదే దర్శకుడు నాగచైతన్యకు మాస్ ఇమేజ్ తెచ్చే ప్రయత్నం చేశాడు. విజయవాడలో 'ఆటోనగర్' అనేప్రాంతం ఉంది. అక్కడ వాహనాల షెడ్లేకాదు.. ఆ పేరుతో రకరకాలుగా స్మగ్మింగ్లు, దందాలు, ఆర్థిక లావాదేవీలు జరుగుతుంటాయి. దాన్ని వెలికి తెచ్చేప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ, వాటిని బయటపెట్టే ప్రయత్నంలో ఎంచుకున్న కథానాయకుడు ఇంకా' బలమైన వాడు' అయి ఉంటే బాగుండేది . సమాజంలో దోపిడీదారులు, పెత్తందారులు, సామాన్యులు, వారందరిపై పెత్తనం చెలాయించే ఇంకో రకం కూడా ఉంది. అదే మాఫియా.. అంటూ చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. ఇందులో ప్రధానంగా హీరోకు ఒక ఎయిమ్ ఉంటుంది.. దేశంలో మంచి మెకానిక్‌గా గుర్తింపు పొంది- తాను కనిపెట్టిన మోటర్ టెక్నాలజీతో పేరు, డబ్బు సంపాదించుకోవాలని. కానీ ఆ విషయం కథనం లో మరుగునపడిపోయింది
ఈ సినిమాలో నాగచైతన్య పాత్రే కీలకం. కథంతా అతని చుట్టూనే తిరుగుతుంది. లెంగ్తీ డైలాగ్స్ పలకడం లో ఇబ్బంది పడ్డా - మాస్ పాత్రలో మరోసారి మెప్పించే ప్రయత్నం చేశాడు. ప్రతినాయకులు భారీ ఆకారాలతో ఉండడంతో కొన్ని సన్నివేశాల్లోఅతని హీరోయిజం తేలి పోయింది . మరదలిగా సమంత నటించింది. కేవలం ఆటవిడుపుకోసం ఆమె పాత్ర ఉంది. నటించే అవకాశం కూడా పెద్దగాలేదు.'సురా..సురా' అనే పాటలో గ్లామర్ తో ఆకట్టుకుంది. సాయికుమార్ తన పాత్రను బాగాచేశాడు. విజయవాడ అనే సిటీలో ఆటోనగర్ ను తన చేతుల్లో ఉంచుకున్న రౌడీగా జయప్రకాష్‌రెడ్డి నటించాడు. ఆయన అనుచరుడి గా అజయ్ నటించాడు. వీరందరిని లీడ్ చేసే పాత్ర మేయర్‌ది.ఈ పాత్రను టీవీ నటుడు మధు పోషించాడు. ఇక రఘుబాబు పోలీసు అధికారిగా సరిపోయాడు. కలెక్టర్‌గా ఆహుతిప్రసాద్చేసారు . బ్రహ్మానందం, వేణుమాధవ్,మాస్టర్ భరత్‌ల పాత్రలు ఆశించిన వినోదాన్నివ్వలేదు .
ఇందులో అనూప్ రూబెన్స్ పాటలు అంతంత మాత్రమే. సెకండాఫ్‌లో ఓ పాటనుకూడా ఆలపించాడు.నేపధ్య సంగీతం ఒక మాదిరిగా వుంది . శ్రీకాంత్ నారోజ్ కెమెరా పనితనం పర్వాలేదు. చిత్రంలో ఆర్ట్‌కు ప్రాధాన్యత ఉంది. ఆటోనగర్ సెట్ నిర్మాణంలో రవీందర్ తన పనితనాన్ని చూపించాడు. దేవకట్టా సంభాషణలు చాలా చోట్ల పర్వాలేదు. 'మన పనిలోనే దేవుడు ఉన్నాడు '... 'నిజమైన జైలు జైలు బయటే ఉంది '.. వంటి కొన్ని డైలాగ్‌లు బాగున్నాయి . 'సమాజంలో మనిషి.. వ్యవస్థ' వంటివి కామన్‌మేన్‌కు అర్థంకావు. -రవళి
Friday, June 6, 2014
'తారా' స్థాయిలో మన వాళ్ళు!
'తారా' స్థాయిలో మన వాళ్ళు!
'అత్తారింటికి దారేది' తో తెలుగు సినిమా వంద కోట్ల మార్కుని చేరుకోగలదని ఆశ కలిగింది . తెలుగు సినిమా మార్కెట్ పరిధి పెరుగుతున్న కొద్ది- తెలుగు సినిమా బడ్జెట్ కూడా అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు సినిమా బడ్జెట్లో సింహాభాగం హీరో, దర్శకుల పారితోషికాలే -అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నేడు తెలుగు సినీ పరిశ్రమలో హీరోలతో పాటు దర్శకుల పారితోషికాలు కూడా చుక్కలనంటుతున్నాయి. సక్సెస్, ఫెయిల్యూర్స్ ఆధారంగా వారి పారితోషికాలు మారుతున్నాయి. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోలు, స్టార్ దర్శకులు అందుకుంటున్న పారితోషికాలు ఏ స్థాయిలో వున్నాయో తెలుసుకుందాం....
'అత్తారింటికి దారేది' తో తెలుగు సినిమా వంద కోట్ల మార్కుని చేరుకోగలదని ఆశ కలిగింది . తెలుగు సినిమా మార్కెట్ పరిధి పెరుగుతున్న కొద్ది- తెలుగు సినిమా బడ్జెట్ కూడా అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు సినిమా బడ్జెట్లో సింహాభాగం హీరో, దర్శకుల పారితోషికాలే -అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నేడు తెలుగు సినీ పరిశ్రమలో హీరోలతో పాటు దర్శకుల పారితోషికాలు కూడా చుక్కలనంటుతున్నాయి. సక్సెస్, ఫెయిల్యూర్స్ ఆధారంగా వారి పారితోషికాలు మారుతున్నాయి. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోలు, స్టార్ దర్శకులు అందుకుంటున్న పారితోషికాలు ఏ స్థాయిలో వున్నాయో తెలుసుకుందాం....
నా ఆలోచన కూడా మారింది!
నా ఆలోచన కూడా మారింది!
హీరోహీరోయిన్లు ఎక్కువ సినిమాలు చేస్తుంటే కెమిస్ట్రీ పెరుగుతుంది. నేను, సమంత ఒకేసారి కెరీర్ ప్రారంభించాం. ఇందులో రెండో పాత్ర కంఫర్ట్‌గా అనిపించింది. ఎందుకంటే ఇప్పటి యూత్‌కు కనెక్ట్ అయ్యేపాత్ర. తండ్రి పాత్రలో ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి నాకు పెద్దగా అనుభవంలేనివి. అందుకే ఛాలెంజ్‌గా స్వీకరించాను. అసలు నేను తండ్రి అంటే నమ్ముతారా? అనిపించింది. అప్పుడు దర్శకుడు చాలా సర్దిచెప్పి ఒప్పించారు....
హీరోహీరోయిన్లు ఎక్కువ సినిమాలు చేస్తుంటే కెమిస్ట్రీ పెరుగుతుంది. నేను, సమంత ఒకేసారి కెరీర్ ప్రారంభించాం. ఇందులో రెండో పాత్ర కంఫర్ట్‌గా అనిపించింది. ఎందుకంటే ఇప్పటి యూత్‌కు కనెక్ట్ అయ్యేపాత్ర. తండ్రి పాత్రలో ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి నాకు పెద్దగా అనుభవంలేనివి. అందుకే ఛాలెంజ్‌గా స్వీకరించాను. అసలు నేను తండ్రి అంటే నమ్ముతారా? అనిపించింది. అప్పుడు దర్శకుడు చాలా సర్దిచెప్పి ఒప్పించారు....
పెట్టుబడుల్లోనూ తారలే !
పెట్టుబడుల్లోనూ తారలే !
కోట్లు కోట్లు సంపాదిస్తున్నా కొందరు బాలీవుడ్ స్టార్లు ఆర్థిక అంశాల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. డబ్బుని జల్సాల కోసం ఖర్చు చేసేయకుండా..అలాగని పూర్తిగా బ్యాంకుల్లోనే దాచేయకుండా .. మంచి రాబడులు ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటివారు ఈ కోవకి చెందినవారే. కొత్త కంపెనీలు, ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేస్తుండటం వీరి హాబీ....
కోట్లు కోట్లు సంపాదిస్తున్నా కొందరు బాలీవుడ్ స్టార్లు ఆర్థిక అంశాల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. డబ్బుని జల్సాల కోసం ఖర్చు చేసేయకుండా..అలాగని పూర్తిగా బ్యాంకుల్లోనే దాచేయకుండా .. మంచి రాబడులు ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటివారు ఈ కోవకి చెందినవారే. కొత్త కంపెనీలు, ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేస్తుండటం వీరి హాబీ....
లక్ష్యాన్ని అధిగమించిన రామానాయుడు
లక్ష్యాన్ని అధిగమించిన రామానాయుడు
భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యధిక దర్శకులను పరిచయం చేసిన ఘనత రామానాయుడిదే. ఆయన హస్తవాసి మంచిది కావడంతో ఆయన పరిచయం చేసిన దర్శకులందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారు. తన కోసం, తన కుటుంబం కోసం నిర్మాతగా మారి సినిమాలు తీసినప్పటికీ, పరోక్షంగా కొన్ని వందల కుటుంబాల జీవనోపాధికి కారకులయ్యారు. 'నేను బాగుండాలి, నా చుట్టూ ఉన్నవాళ్లు బాగుండాలి' అనుకొనే మంచి మనసు రామానాయుడిది. 'చేతనైతే ఒకరికి సాయం చెయ్యి.. కానీ పొరపాటున కూడా ఎవరికీ హాని చెయ్యకు'... ఇదీ ఆయన నమ్మి ఆచరించే సిద్ధాంతం....
భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యధిక దర్శకులను పరిచయం చేసిన ఘనత రామానాయుడిదే. ఆయన హస్తవాసి మంచిది కావడంతో ఆయన పరిచయం చేసిన దర్శకులందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారు. తన కోసం, తన కుటుంబం కోసం నిర్మాతగా మారి సినిమాలు తీసినప్పటికీ, పరోక్షంగా కొన్ని వందల కుటుంబాల జీవనోపాధికి కారకులయ్యారు. 'నేను బాగుండాలి, నా చుట్టూ ఉన్నవాళ్లు బాగుండాలి' అనుకొనే మంచి మనసు రామానాయుడిది. 'చేతనైతే ఒకరికి సాయం చెయ్యి.. కానీ పొరపాటున కూడా ఎవరికీ హాని చెయ్యకు'... ఇదీ ఆయన నమ్మి ఆచరించే సిద్ధాంతం....
ప్రేక్షకులకు నచ్చేలా చేస్తే, ఆ తృప్తి వేరు!
ప్రేక్షకులకు నచ్చేలా చేస్తే, ఆ తృప్తి వేరు!
దర్శకుడిగాకన్నా నటుడిగా కన్నా నిర్మాతగా కన్నా నాకు ఏం కావాలో నాకు తెలుసు. నాకు ఏం చేస్తే ఆనందం కలుగుతుందో అదే చేస్తుంటాను. అది నటనకానీ, దర్శకత్వం కానీ. ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి తహతహ పడుతుంటాను. పెద్ద పెద్ద పారితోషికాలు తీసుకుని నటించిన దానిలో ఆనందం ఉంటుందనుకోవచ్చు. కానీ ఓ మంచి చిత్రాన్ని తీసి ప్రేక్షకులకు నచ్చేలా చేస్తే, ఆ తృప్తి వేరు...
దర్శకుడిగాకన్నా నటుడిగా కన్నా నిర్మాతగా కన్నా నాకు ఏం కావాలో నాకు తెలుసు. నాకు ఏం చేస్తే ఆనందం కలుగుతుందో అదే చేస్తుంటాను. అది నటనకానీ, దర్శకత్వం కానీ. ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి తహతహ పడుతుంటాను. పెద్ద పెద్ద పారితోషికాలు తీసుకుని నటించిన దానిలో ఆనందం ఉంటుందనుకోవచ్చు. కానీ ఓ మంచి చిత్రాన్ని తీసి ప్రేక్షకులకు నచ్చేలా చేస్తే, ఆ తృప్తి వేరు...
ఆనందంతో దొర్లి దొర్లి పని చేస్తున్నా!
ఆనందంతో దొర్లి దొర్లి పని చేస్తున్నా!
''నేను ఈ రోజున ఇలా ఉండటానికి కారణం అచ్చిరెడ్డి. అనుక్షణం నాకు తోడుగా నిలబడి, నేనీ స్థానానికి చేరుకోవడానికి కారణమయ్యారు అచ్చిరెడ్డి. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు. ఇది చాలా చిన్న మాట. నాలుగేళ్ల తర్వాత నేను దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'యమలీల - 2'. 'యమలీల' చిత్రం పెద్ద విజయం సాధించింది. ఆ చిత్రం కంటే పది రెట్లు ఈ చిత్రం విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పగలను. నా తొలి సినిమాగా భావించి....Saturday, May 10, 2014
'ప్యార్ మే పడిపోయానే' చిత్ర సమీక్ష
'ప్యార్ మే పడిపోయానే' చిత్ర సమీక్ష 2/5
శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకం ఫై రవి చావలి దర్శకత్వం లో కె.కె. రాధా మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు .
చంద్ర/చిన్నా(ఆది), యుక్త (శాన్వి) చిన్నప్పుడు పక్కపక్క ఇళ్లలోనే వుండేవారు కానీ, వీరిద్దరికీ అస్సలు పడదు. కొద్ది రోజులకి చిన్నా వాళ్ళు ఆ ఇల్లు ఖాళీ చేసే వేరే ఏరియాకి వెళ్ళిపోతారు. కానీ అప్పుడు చేసిన ఓ పని వల్ల యుక్త చిన్నాపై పగ పెంచుకుంటుంది.ఆ తరువాత కొన్నాళ్ళకు ... మ్యూజిక్ కంపోజర్ అవ్వాలనుకునే ఓ బిటెక్ కుర్రాడు చంద్ర. ఆ కాలేజ్ లోనే యుక్త చేరుతుంది. యుక్తని మొదటి చూపులోనే ప్రేమించేసిన చంద్ర తనతో ఎలాగన్నా పరిచయం పెంచుకోవాలనుకుంటాడు. యుక్తకి సింగర్ అవ్వాలనే కోరిక ఉండడంతో తన ట్రూప్ లో చేర్చుకుంటాడు. అలా పరిచయం మొదలై వీరిద్దరూ ప్రేమికులుగా మారుతారు. అప్పుడే- యుక్త తన చిన్నప్పటి ఫ్రెండ్ అని, అలాగే చిన్నాపై పగ పెంచుకొని ఉందని తెలుస్తుంది. యుక్తకి చంద్రనే చిన్నా అని తెలిసిందా? అలా తెలిస్తే చిన్నాని యుక్త ఏం చేసింది? అసలు యుక్తకి చిన్నా చేసిన ద్రోహం ఏంటి అనేది సినిమాలో చూడాల్సిందే....
'శ్రీమన్నారాయణ' తదితర వరుస చిత్రాలతో నిరాశ పరిచిన రవి చావలి ఈసారి ‘లవ్లీ’ జంటతో ఒక ఎంటర్టైనింగ్ లవ్‌స్టోరీ తీసే ప్రయత్నం చేసాడు. అయితే అటు రొమాన్స్‌ని-ఇటు ఎంటర్టైన్మెంట్ని దేన్నీ పూర్తి స్థాయిలో పండించ లేకపోయాడు. ప్రేమకథా చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవడం కీలకం. ఇందులో అది పూర్తిగా లోపించింది. రొటీన్ అనిపించకుండా కొత్తగా అనిపిస్తేనే- లవ్ సినిమాలు ఆదరణ పొందుతాయి .రవి చావలి తన కథని, తన పాత్రల్ని చాలా తేలికగా తీసుకున్నాడు. ఇద్దరూ ప్రేమలో పడడానికి బలమైన కారణాలేమీ చూపించలేదు. కనీసం వారిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలతో మనసుని తాకే ప్రయత్నమూ చేయలేదు. కేవలం ఒక సిల్లీ కారణమొకటి చూపించి -దానినే ప్రధానాంశం చేసేశాడు . దాంతో ఈ చిత్రాన్ని రక్తి కట్టించడం తన వల్ల కాలేదు. మధ్యమధ్యలో కొన్ని కామెడీ సీన్లు పెట్టినా అవేమీ అంతగా నవ్వించలేదు. క్లైమాక్స్ సన్నివేశాలని మరీ పాతకాలపు దర్శకుల ధోరణి లో చేశాడు . రొమాంటిక్ సినిమాలకి వచ్చేసరికి ఎంతో కొంత ఎమోషనల్ ఎటాచ్మెంట్ ఏర్పడేట్టు చేయడం అవసరం . ప్రేమ జంట - లవ్ సక్సెస్ కావాలని, వారికి ఎదురవుతున్న అవరోధాలు తొలగిపోవాలని అనిపించేలా.. కథని నడిపించాలి. ప్రేమకథా చిత్రాల్లో ఉండాల్సిన ఫీల్ వర్కవుట్ చేయడం చేతకాకపోతే - లవ్ స్టోరీస్ జోలికి వెళ్లక పోవడమే ఉత్తమం. రవి చావలి తనకు తోచినట్లుగా సీన్లన్నీ చుట్టి పారేసాడు. ప్రేమికులిద్దరూ కలిసిపోయారనే తృప్తి కంటే... ఇప్పటికైనా కలిసారులే- అనిపించే ట్టుగా తెర కెక్కించాడు . ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థం బెటర్ అనిపిస్తుంది. కొన్ని పాటలు, సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి . కథలోకాస్త విషయమున్నా కానీ, కథనం పరంగా దర్శకుడు చాలా పొరపాట్లు చేయడంతో ఈ చిత్రం -'బోర్ మే పడిపోయామే' అనిపిస్తుంది. మన దర్శకులు అవకాశాలను పట్టడం లోనే తమ పనితనాన్ని చూపిస్తున్నారు కానీ- వచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోలేక పోతున్నారనడానికి ఇది మరో ఉదాహరణ.
ఈ లవ్ ఎంటర్టైనర్ లో ఆది చక్కటి నటనని కనబరిచాడు. స్టైలిష్ లుక్ లో కనిపించిన ఆది కామెడీ సీన్స్ ని చాలా బాగా చేసాడు. ముఖ్యంగా సాయి కుమార్, రవి శంకర్ ని ఇమిటేట్ చేసిన సీన్స్, కొన్ని చోట్ల గందరగోళం క్రియేట్ చేసే సీన్స్ లో చాలా బాగా హావభావాలు పలికించాడు . పాటల్లో డాన్స్ బాగా వేసాడు. హీరోయిన్ శాన్వి కూడా తన పాత్రకి న్యాయం చేసింది. సినిమాలో గ్లామరస్ గా కనిపించడమే కాకుండా ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేసింది.ఫస్ట్ హాఫ్ లో వచ్చే వెన్నెల కిషోర్ కామెడీ ఎపిసోడ్, హర్రర్ సినిమాల ఎపిసోడ్ నవ్విస్తే, ఇక సెకండాఫ్ లో వచ్చే హుస్సేన్ వర్మ పాత్ర పోషించిన సప్తగిరి ఎపిసోడ్, అలాగే తాగుబోతు రమేష్ ఎపిసోడ్, మధు చేసిన కొన్ని సీన్స్ ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. అలాగే ఆది పక్కన ముస్లీం ఫ్రెండ్ పాత్ర కూడా బాగుంది.
టెక్నికల్ విభాగంలో సినిమాటోగ్రాఫర్ టి. సురేందర్ రెడ్డి ప్రతి లొకేషన్ ని చాలా అందం గా చూపించి ఆడియన్స్ కి రిచ్ ఫీల్ కలిగించేలా చేసాడు. అలాగే- అనూప్ అందించిన పాటలు కూడా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి హెల్ప్ అయ్యింది. డైలాగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు.ఎడిటర్ ఇంకాస్త శ్రద్ధ తీసుకొని బోరింగ్ సీన్స్ కట్ చేసి, నిడివి కాస్త తగ్గిస్తే సినిమాకి హెల్ప్ అయ్యేది. -ధరణి
Thursday, May 1, 2014
'అనామిక' చిత్ర సమీక్ష
'అనామిక' చిత్ర సమీక్ష 3/5
శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వయాకామ్10 మోషన్ పిక్చర్స్ ,ఇడెంటిటీ మోషన్ పిక్చర్స్ ,మూవింగ్ పిక్చర్స్ ప్రెజెంట్స్ , లాగ్‌లైన్ ప్రొడక్షన్స్ పతాకం ఫై దీపక్ ధర్ - రజనీష్ ఖనూజ ఈ చిత్రాన్ని నిర్మించారు .
శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వయాకామ్10 మోషన్ పిక్చర్స్ ,ఇడెంటిటీ మోషన్ పిక్చర్స్ ,మూవింగ్ పిక్చర్స్ ప్రెజెంట్స్ , లాగ్‌లైన్ ప్రొడక్షన్స్ పతాకం ఫై దీపక్ ధర్ - రజనీష్ ఖనూజ ఈ చిత్రాన్ని నిర్మించారు .
అనామిక (నయనతార) భర్త అజయ్‌శాస్త్రి (హర్షవర్ధన్ రాణె) ఓ సాప్ట్వేర్ ఇంజనీర్. అమెరికా నుండి హైదరాబాద్ వచ్చి తప్పిపోతాడు. అతని గురించి గాలిస్తూ ఆమె కూడా హైదరాబాద్‌కి వస్తుంది. పాత బస్తీ పోలీస్ స్టేషన్లో కంప్లైట్ ఇవ్వగా పోలీస్‌లు అంతగా సహాయపడరు. ఆ స్టేషన్లోనే పనిచేసే పార్ధసారధి(వైభవ్) అనామికకు తోడ్పడతాడు. అజయ్ గురించి తెలిసిన వాళ్ళంతా చనిపోతుంటారు. పాత బస్తీ పోలీస్ స్టేషన్‌కి కొత్తగా వచ్చిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఖాన్(పశుపతి)అజయ్‌శాస్త్రి తీవ్రవాది అని ఆరోపిస్తాడు. దాన్ని అనామిక వ్యతిరేకిస్తుంది. అజయ్‌శాస్త్రి తీవ్రవాది కాదని అనామిక నిరూపించిందా ? చివరికి అజయ్ ఏమయ్యాడు. పీపుల్స్‌ప్లాజాలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో నిందుతుడైన మిళింద్ ఎవరు? అతని కేస్‌ని హోం మినిస్టర్(నరేష్) ఎందుకు ప్రక్క తోవ పట్టించాడు అనే ప్రశ్నలకు సమాధానం కోసం సినిమా చూడాలి ...
తప్పిపోయిన భర్తను వెతుక్కునే భార్యగా నయనతార అద్భుతంగా నటించింది. మరో నటి అయితే ఈ పాత్ర పండేది కాదేమో అనేలా చేసింది.హెవీ క్యారెక్టర్ని ఎమోషన్స్‌తో బాగా క్యారీ చేసింది. ఎస్.ఐ గా నటించిన వైభవ్ పాత్రకు తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ పెద్దగా చూపించలేకపోయాడు. కానీ చాలా నాచురల్‌గా యాక్ట్ చేశాడు. పశుపతి కూడా పోలీస్ పాత్రకు సూటయ్యాడు. హోటల్ ఓనర్, స్టేషన్లో రైటర్‌గా చేసిన నరసింగరావు బాగానే చేశారు. సెకెండ్ ఇన్నింగ్‌లో జోరుగా సినిమాలు చేసుకుంటూ పోతున్న సీనియర్ నరేష్ ఇందులో హోం మినిస్టర్ ఆదికేశవులుగా నటించాడు. అతను కనిపించిన ప్రతిసారి ఫోన్లో టెన్షన్‌గా హర్డ్‌డిస్క్ గురించి మాట్లాడడం తప్ప చేసిందేమీ లేదు.
చక్కటి విలువలతో తెలుగు సినిమాని తీసే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. 'ఆనంద్' నుంచి 'లైప్ ఈజ్ బ్యూటిఫుల్' వరకు ఫీల్‌గుడ్ సినిమాను చూపించిన ఆయన తొలిసారిగా అరువు కథను చేసేందుకు ధైర్యం చేశాడు. అదీ కూడా బాలీవుడ్లో ప్రూవ్ అయిన 'కహాని' . నయనతార ప్రధాన పాత్రలో తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ఈ 'అనామిక'. బాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థలు నిర్మించాయి. శేఖర్ కమ్ముల కహాని సినిమాను రీమేక్ చేస్తున్నాడనగానే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం ప్రమోషన్‌కి హీరోయిన్
ఆర్టిస్ట్‌ల నుండి చక్కని నటనను రాబట్టుకున్నాడు శేఖర్. తప్పిపోయిన భర్తను వెతుక్కునే భార్యగా నయనతార అద్భుతంగా నటించింది. మరో నటి అయితే ఈ పాత్ర పండేది కాదేమో అనేలా చేసింది.హెవీ క్యారెక్టర్ని ఎమోషన్స్‌తో బాగా క్యారీ చేసింది. ఎస్.ఐ గా నటించిన వైభవ్ పాత్రకు తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ పెద్దగా చూపించలేకపోయాడు. కానీ చాలా నాచ్యూరల్గా యాక్ట్ చేశాడు. పశుపతి కూడా పోలీస్ పాత్రకు సూటయ్యాడు. హోటల్ ఓనర్, స్టేషన్లో రైటర్‌గా చేసిన నరసింగరావు బాగానే చేశారు. సెకెండ్ ఇన్నింగ్‌లో జోరుగా సినిమాలు చేసుకుంటూ పోతున్న సీనియర్ నరేష్ ఇందులో హోం మినిస్టర్ ఆదికేశవులుగా నటించాడు. అతను కనిపించిన ప్రతిసారి ఫోన్లో టెన్షన్‌గా హర్డ్‌డిస్క్ గురించి మాట్లాడడం తప్ప చేసిందేమీ లేదు. సంభాషణలు బావున్నాయి. బ్యాగ్రౌండ్లో వచ్చే సిరివెన్నెల రెండు పాటలు బావున్నాయి. కీరవాణి ఆర్.ఆర్ సినిమాకు పెద్ద ఎసెట్ అనొచ్చు. సెకెండాఫ్ ఎడిటింగ్ చాలా బావుంది. తెలుగులో ఆరీ అలెక్సా కెమెరాతో చిత్రీకరించిన తొలి చిత్రమిది. విజయ్.సి.కుమార్ ఫోటోగ్రఫీ ఎక్స్లెంట్. ఓల్డ్ సిటీని సెట్స్‌ని అద్బుతంగా తీర్చిదిద్దిన చిన్నాకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నిర్మాణ విలువలు బావున్నాయి. మార్తండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ కూడా బాగుంది - ధరణి
Friday, April 11, 2014
' రేసుగుర్రం' చిత్ర సమీక్ష
' రేసుగుర్రం' చిత్ర సమీక్ష 3/5
లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్పతాకం ఫై సురేందర్ రెడ్డి దర్శకత్వం లో
నల్లమలుపు శ్రీనివాస్, డా"కె. వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు .
నీతి, నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ రామ్ , ఎప్పుడూ జల్సాగా తిరిగే లక్కీ అన్నదమ్ములు. వీరికి క్షణం కూడా పడదు. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో గొడవ పడుతుంటారు. ఈ క్రమంలో స్పందన (శృతి హాసన్)తో లక్కీ ప్రేమలో పడతాడు. అయితే లక్కీ-స్పందన ప్రేమ వ్యవహారానికి బ్రేక్ వేసేందుకు రామ్ ప్రయత్నిస్తాడు . శృతిని తనకు దక్కకుండా చేస్తున్న రామ్ కు తగిన గుణపాఠం చెప్పాలని లక్కీ- అతని పోలీస్ కారును దొంగిలిస్తాడు. ఆ కారులో ఉన్నది రామ్ అనుకుని, రాజకీయవేత్తగా మారిన రౌడీ మద్దాలి శివారెడ్డి మనుషులు చంపాలనుకుంటారు . ఆ దాడి నుంచి లక్కీ క్షేమంగా బయటపడతాడు. అది తన అన్నని చంపాలని చేసిన దాడి అని తెలుసుకున్నలక్కీ - అతని మనుషులతో సహా శివారెడ్డిని విపరీతం గా కొడతాడు . దాంతో వారి కుటుంబం ఫై పగ బట్టిన శివారెడ్డి- అతని తండ్రి సలహా మేరకు రాజకీయ అధికారం కోసం కొంతకాలం వేచి చూస్తాడు . రాష్ట్ర మంత్రి అయిన తర్వాత వారి కుటుంబాన్ని రోడ్ మీదికి లాగే పనులకు శ్రీకారం చుడతాడు . శివారెడ్డి ని ఎదుర్కోవడానికి లక్కీ ఏమి చేసాడో సినిమాలో చూడాలి ....
ఖర్చు ఎక్కువ పెట్టిస్తాడనే పేరున్నప్పటికీ , విలక్షణమైన దర్శకుడని సురేందర్ రెడ్డి తన చిత్రాలతో ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఈ చిత్రం విషయానికి వస్తే- వక్కంతం వంశీ కథ రొటీన్ గానేవుంది . గతకాలపు చేదు అనుభవాల వల్ల కధ కన్నా, వినోదాన్నేఈ చిత్రం లో సురేందర్ ఎక్కువ నమ్ముకున్నాడు . అందుకే ఈ చిత్రానికి ' రేసుగుర్రం' వంటి భారీ హీరోయిక్ పేరు పెట్టే బదులు, 'జులాయి' తరహా సరదా పేరు పెడితే ఈ సినిమాకి సరిపోయేది . ఎందుకంటే - ఇందులో రేసు లేదు ... గుర్రము లేదు ... లాజిక్ అంతకంటే లేదు . అన్నింటి కన్నా ఘోరమైన విషయం ఏంటంటే - తన కుటుంబానికి తీవ్రమైన ఇబ్బందులు పెట్టిన విలన్ని- సీరియస్ గాఎదుర్కొనడానికి బదులుగా హీరో పరమ సిల్లీ పద్ధతిలో... అందులోనూ బ్రహ్మనందం వంటి కమెడియన్ ని ముందు పెట్టి, తను వెనుక ఉండి ఎదిరిస్తాడు .మన హీరో ల తాజా పరిస్థితి ఇది...జాలిపడాలి !
లక్కీ గా అల్లు అర్జున్ లోని స్టైలిష్ లుక్ , మాస్ పెర్ఫార్మెస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి . నటనలో అభివృద్ధి సాధించాడు . వినడానికి ఇబ్బంది పెట్టే తన గొంతుతో 'దేవుడా' అనే ఊతపదం పలికే సాహసం చేసాడు . అయితే అల్లు అర్జున్ నుంచి కోరుకునేమంచి డాన్స్ మూమెంట్స్ మాత్రం ఈ సినిమాలో అంతగా లేవు .అలాగే, విలన్ తండ్రి ముఖేశ్ రుషికి వార్నింగ్ ఇచ్చే సీన్ చెయ్యడానికి నటుడిగా అతని పరిణితి సరిపోలేదు. పోలీస్ ఆఫీసర్ రామ్ గా శ్యామ్' కిక్' తర్వాత మరో గుర్తుండిపోయే మంచి క్యారెక్టర్ ఇందులో చేసాడు. స్పందన పాత్రలో శృతి గ్లామర్ తో పాటు, పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. ఆమె ఫై చేసిన 'లోపల ఫీలవుతున్నా' అనే ఎపిసోడ్స్ ఆలోచన బాగుంది. వాటిలో శృతి బాగా చేసింది. అలాగే హీరో తో పాటు పాటల్లో కొన్ని బోల్డ్ స్టెప్పులు వేసి సహకరించింది . రౌడీగా మారిన రాజకీయవేత్త మద్దెల శివారెడ్డి పాత్రలో భోజ్ పురి నటుడు రవికిషన్ అవకాశం వున్న మేరకు బాగా చేశాడు. ప్రకాష్‌రాజ్ క్యారెక్టర్ సరదాగావుంది . కానీ అతన్ని అర్థాంతరంగా వదిలేసారు. దర్శకుడు బ్రహ్మనందం కామెడీనే ఎక్కువగా నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. బ్రహ్మానందం క్లయిమాక్స్‌కి ముందు వచ్చి ‘కిల్‌బిల్ పాండే’గా చెలరేగిపోయాడు. క్లైమాక్స్ వరకు తనే హీరో అయి బ్రహ్మానందం సినిమాని' ఓకే' అనిపించాడు . ' కిక్' సినిమాలో ఆలీ క్యారెక్టర్ ను కొనసాగింపుగా ఈ చిత్రంలో డాక్టర్ గా చేసినా అంతగా పండలేదు . పోసాని , ముఖేశ్ రుషి, తనికెళ్ల భరణి, జయప్రకాశ్ రెడ్డి , రాజీవ్ కనకాల, సలోని, కోట ,సయ్యాజి షిండే, ఎమ్మెస్ , శ్రీనివాస రెడ్డి , దువ్వాసి , పవిత్ర , ప్రగతి , రఘు బాబు , రఘు కారుమంచి ఇతరపాత్రలు పోషించారు .
తమన్ పాటల్లో 'సిన్మా సూపిస్తా మామా' తప్ప చెప్పుకోదగ్గవి లేవు , రీ రికార్డింగ్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది . మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చాలా బాగుంది .గౌతంరాజు ఎడిటింగ్ బాగుంది . రామ్ - లక్ష్మణ్ ల థ్రిల్స్ బాగున్నాయి . అయితే ఇంటర్వెల్ ముందు ఫైట్ మరీ అతిగా వుంది . దీపక్ రాజ్ - విక్రం సిరి ల సంభాషణలు బాగున్నాయి -రాజేష్
Friday, March 28, 2014
'లెజెండ్' చిత్ర సమీక్ష
'లెజెండ్' చిత్ర సమీక్ష 3 / 5
14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్-వారాహి చలనచిత్రం పతాకం ఫై బోయపాటి శ్రీను దర్శకత్వం లో అచంట గోపినాథ్, ఆచంట రాము, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు .
ఇంట్లో కారం, ఒంట్లో అహంకారం లేకుండా బతకలేననే జితేందర్ (జగపతిబాబు) ముఖ్యమంత్రిపై పదవిపై ఆశలు పెంచుకుంటాడు. పెళ్లి చూపుల కెళ్లి ఓ వివాదంలో చిక్కుకుంటాడు. ఆ ఊరి పెద్ద (సుమన్) జితేందర్ ను నష్టపరిహారంచెల్లించి , క్షమాపణ చెప్పాలని తీర్పు ఇస్తాడు. జితేందర్ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా అతని భార్య (సుహాసిని)ను కుమారుడు కృష్ణ (బాలకృష్ణ)ను కిడ్నాప్ చేస్తాడు. ఆ వ్యవహారంలో తల్లి చనిపోవడంతో- కృష్ణ జితేందర్ తండ్రి, అతని అనుచరులను చంపుతాడు. చిన్నతనంలో ఫ్యాక్షన్ రాజకీయాల్లో తలదూర్చడం ఇష్టం లేని కారణంగా కృష్ణను పై చదువుల కోసం లండన్ పంపుతారు . చదువు పూర్తయిన తర్వాత దుబాయ్ లో బిజినెస్ లో స్థిరపడతాడు. పెళ్లి చేసుకుందామని వచ్చిన కృష్ణకు జితేందర్, అతని అనుచరుడి రూపంలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. జితేందర్ ను, అతని అనుచరులను ఎదుర్కొన్న కృష్ణను హతమార్చేందుకు కృష్ణపై కాల్పులు జరుపుతారు. కృష్ణ పరిస్థితి విషమంగా మారుతుంది. ఆ సంఘటన తర్వాతే సినిమాలో పెద్ద మలుపు వస్తుంది . మిగతా విశేషాల కోసం సినిమా చూడాల్సిందే. ..
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’ సంచలనం సృష్టించింది. బాలయ్యని ఆరేళ్ల పాటు వేధించిన పరాజయాల్ని ఆ చిత్రం మరిపించింది. దాంతో మరోసారి ఈ కాంబినేషన్లో సినిమా అనేసరికి అభిమానుల్లో భారీ అంచనాలు సహజం . పక్కా కమర్షియల్ హంగులతో, సెంటిమెంట్ తోపాటు, బాలకృష్ణ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన చిత్రం' లెజెండ్' .ఈ సారికూడా వరుస పరాజయాల బాధితుడు బాలయ్యను ఈ చిత్రం గట్టెక్కించింది . అలాగే ఎన్నికల్లో ప్రచారానికి తగిన స్తైర్యాన్నీ కల్పించింది . 'దమ్ము' చిత్రంతో ఎదురెబ్బ తిన్న బోయపాటి శ్రీను ఈ చిత్రంలో చక్కటి స్క్రీన్ ప్లే తో ముందుకు పోయాడు. తొలిభాగంలో కథ మామూలుగా నడిపించినా.. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి- ఆతర్వాత ద్వితీయార్ధంలో సన్నివేశాలను వేగం గా నడిపించాడు . మంచి టేకింగ్ కు రత్నం మాటలు తోడవ్వడంతో ప్రేక్షకుడికి ఓ మంచి అనుభూతిని కలిగించారు. అయితే చిత్రంలో మితి మీరిన హింస, ఊహలకు అందని ఫైట్స్ మైనస్ పాయింట్స్ గా చెప్పాలి . కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్ లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. 'బాలయ్యని కొత్తగా చూపడం కన్నా,అభిమానులు అలవాటు పడ్డ విధానం లోనే లాగించేస్తే విజయం తధ్యం'-అని ఈ చిత్రం మరోసారి నిరూపించింది .
బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్‌కి, పవర్ఫుల్ హవభావాలకి , డైలాగ్ డెలివరీకి తగ్గవిధం గా అతని పాత్రని దర్శకుడు రూపొందించాడు . ద్వితీయార్థంలో ప్రవేశించే పాత్రలో బాలకృష్ణ చెలరేగిపోయాడు. ఫాన్స్‌ని అలరించే సన్నివేశాలు, మాస్ రెచ్చి పోయే సంభాషణలు బాగానే కుదిరాయి . అయితే ,బాలయ్య వయసు పైబడ్డ ఛాయల్ని యంగ్ క్యారెక్టర్‌తో కవర్ చేయలేకపోయాడు. లెజెండ్ పాత్రకి తగిన వేషధారణ,జగపతిబాబు గెటప్ పర్ఫెక్ట్గా కుదిరాయి. హీరోగా కూడా ఇంత మంచి గెటప్ జగపతిబాబు ఎప్పుడూ వేయలేదు. అలాగే, జగపతి నటన కూడా బాగుంది. కాకపోతే పాత్రీకరణ లో లోపాల వల్ల ఒక్కోసారి జగపతిబాబు పాత్ర తేలిపోయింది.సెకండాఫ్ లో బాలకృష్ణ – జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. హీరోయిన్లు ఇద్దరూ పెద్దగా చేయడానికేమీ లేదు. సోనాల్ చౌహాన్ అందం గా కనిపిస్తే ,రాధికా ఆప్టే విసిగిస్తుంది. బ్రహ్మానందం పాత్ర ఇబ్బంది పెట్టే సినిమాల్లో ఇదొకటి. సుమన్, సుహాసిని, సితార,జయప్రకాష్‌రెడ్డి, రావు రమేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.హంసా నందిని ఐటెం సాంగ్ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదు.
దేవి శ్రీ ప్రసాద్ బాలకృష్ణ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన 'సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిసాడంటే వీడు' అనే టైటిల్ సాంగ్, మెలోడి 'పట్టు చీర బాగుందే.. కట్టు బొట్టు బాగుందే' అభిమానులను ఆకట్టుకున్నాయి . ఈ పాటలను ఏమాత్రం తగ్గకుండా తెర రూపం కల్పించారు. కీలకమైన సన్నివేశాలకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో దేవి శ్రీ ప్రసాద్ జీవం పోశారు. సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ సక్సెస్ అయ్యాడు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఫస్ట్ హాఫ్ మీద ఇంకాస్త శ్రద్ధ తీసుకొని కొన్ని అనవసర సీన్స్ ని కట్ చేసి ఉంటే బాగుండేది - దినేష్
Saturday, March 15, 2014
‘రాజా రాణి’ చిత్ర సమీక్ష
‘రాజా రాణి’ చిత్ర సమీక్ష 3.25 / 5
ఏ.ఆర్. మురుగదాస్ ప్రొడక్షన్స్ పతాకం ఫై అట్లీ దర్శకత్వం లో మురుగదాస్, ఫాక్స్ స్టార్ స్టూడియో ఈ చిత్రాన్ని నిర్మించారు .
ఆర్య(జాన్) , నయనతార(రెజీనా) పెళ్ళిచేసుకున్నా ఒకరంటే ఒకరికి గిట్టదు . ఎప్పుడూ గొడవ పడుతుంటారు . ఆ పరిస్థితుల్లో జాన్ తాగుడికి అలవాటు పడతాడు . రెజీనా అతనికి దూరం గా పోవాలని ట్రాన్స్ ఫర్ మీద విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటుంది . ఆ తర్వాత కాలంలో వారికి తెలుస్తుంది .... తాము ఇద్దరూ లవ్‌లో ఫెయిల్ అయిన వారమేనని . తాము ఇష్ట పడిన వారిని కోల్పోయి , కేవలం తల్లిదండ్రుల ఆనందం కోసం -ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరూ కలిసి బతకడానికి ఇబ్బంది పడుతుంటారు . ఒకరి గతం ఒకరికి తెలిసిన తర్వాత ఇద్దరిలోను మార్పు వస్తుంది. ఇద్దరిలోను మళ్లీ ప్రేమ భావనలు చిగురిస్తాయి. కానీ ఎవరూ బయటపడరు . ఒకరి మనసును ఒకరు తెలుసుకుని- వారు కొత్త జీవితం ఎలా మొదలు పెట్టారనేది సినిమాలో చూడాలి ....
ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద సహాయకుడిగా పని చేసిన అట్లీ మరో ప్రముఖ దర్శకుడు మురుగదాస్ నిర్మించగా డైరెక్ట్ చేసిన తమిళ చిత్రం ‘రాజా రాణి’ . తొలిసారి దర్శకత్వం వహిస్తున్నప్పటికి, డైరెక్టర్ అట్లీ మంచి ప్రతిభ చూపించాడు.అక్కడ మంచి విజయం సాధించింది. నయనతార, ఆర్య జంటగా సాధించిన రెండో విజయమిది. ' లవ్ ఫెయిల్యూర్ తర్వాత కూడా లైఫ్ ఉంటుంది, మళ్లీ లవ్ ఉంటుంది' - అనేది ఈ సినిమా లో ప్రధానాంశం . గతం లో మనం చూసిన మణిరత్నం 'మౌనరాగం' వంటిచి త్రాలను గుర్తుచేసే - పాత పాయింటే అయినా కొత్తగా...సమర్దవంతం గా చెప్పిన అట్లీ అభినందీయుడు . కధలోని ఫీల్‌ని ప్రేక్షకుడు మిస్ కాని విధంగా సినిమాని చక్కగా నడిపించాడు . ముఖ్యం గా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రెండు ప్రేమ కథలు ప్రేక్షకులకు మంచిఅనుభూతిని ఇస్తాయి.
ప్రేమ ఫెయిలయ్యిందనే పేరుతో అఘాయిత్యాలకు పాల్పడే యువతను కొత్తజీవితం వైపు మళ్ళించే
విధంగా ఇటువంటిచిత్రాలుతోడ్పడతాయి.
నయనతార-ఆర్య లమధ్య గొడవలని వినోదాత్మకం గా చూపించారు . ఉద్వేగపూరితమైన సన్నివేశాలు, కుటుంబ సమేతంగా చూడాల్సిన ప్రేమ కథ... వీటి కోసం ఈ సినిమాని చూడొచ్చు. అయితే ,మరీ సాగ దీసినట్లు కొన్ని సన్నివేశాలు మన సహనాన్ని పరీక్షిస్తాయి . అలాగే ,క్లయిమాక్స్ రొటీన్‌గా వుంది . అయినా ఓ మంచి సినిమా కోసం కొన్నింటిని భరించాలి .
ఇందులో నయనతారది ప్రధాన పాత్ర . తనని విడిచిపోయిన ప్రియుడు, ఇష్టం లేని భర్త మధ్య మానసికంగా నలిగిపోయే యువతి పాత్రలో నయనతార అద్భుతంగా నటించింది . ఒక వైపు అందంగా అలరిస్తూనే రెజీనాగా తన పాత్రలో జీవించింది. కళ్ళ ముందే దూరమైన ప్రియురాలు , ఇష్టం లేని భార్యల మధ్య సంఘర్షణను అనుభవించే యువకుడిగా ఆర్య కూడా చాలా బాగా చేసాడు . అమాయకత్వం చూపుతూ, రంగులు మార్చే సూర్యగా జై, అతని ప్రియురాలు కీర్తనగా నజ్రియా ఇద్దరూ బాగా చేసారు. నయనతార తండ్రి పాత్రలో సత్యరాజ్ హుందాగా నటించారు . సంతానం చేయడానికి ఎక్కువ అవకాశం లేకున్నా,తన మార్క్ కామిడీతో ప్రత్యేకతను చాటుకున్నాడు. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది . రూబెన్ ఎడిటింగ్ లో మరింత షార్ప్ గా పనిచేస్తే సినిమా ఇంకా బాగుండేది . అనువాద భాష కారణంగా - జి.వి. ప్రకాష్‌కుమార్ పాటలు అంతంత మాత్రం గానే అనిపించినా... భాషతో పని లేదు కనుక, అతని నేపధ్య సంగీతం మాత్రం బ్రహ్మాండంగా వినిపిస్తుంది. . పాటల్లో అనంతశ్రీరామ్ చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. శ్రీరామకృష్ణ సంభాషణలు మాత్రం సినిమాకు నిండుదనాన్నిచ్చాయి .
-రాజేష్