RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Thursday, May 1, 2014

'అనామిక' చిత్ర సమీక్ష

                                             'అనామిక' చిత్ర సమీక్ష   3/5

శేఖర్‌ కమ్ముల  దర్శకత్వం లో వయాకామ్‌10 మోషన్ పిక్చర్స్ ,ఇడెంటిటీ మోషన్ పిక్చర్స్ ,మూవింగ్ పిక్చర్స్ ప్రెజెంట్స్ , లాగ్‌లైన్‌ ప్రొడక్షన్స్‌ పతాకం ఫై  దీపక్ ధర్  - రజనీష్ ఖనూజ ఈ చిత్రాన్ని నిర్మించారు  . 

 అనామిక (నయనతార) భర్త అజయ్‌శాస్త్రి (హర్షవర్ధన్‌ రాణె) ఓ సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అమెరికా నుండి హైదరాబాద్‌ వచ్చి తప్పిపోతాడు. అతని గురించి గాలిస్తూ ఆమె కూడా హైదరాబాద్‌కి వస్తుంది. పాత బస్తీ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైట్‌ ఇవ్వగా పోలీస్‌లు  అంతగా సహాయపడరు. ఆ స్టేషన్‌లోనే పనిచేసే పార్ధసారధి(వైభవ్‌) అనామికకు తోడ్పడతాడు. అజయ్‌ గురించి తెలిసిన వాళ్ళంతా చనిపోతుంటారు. పాత బస్తీ పోలీస్‌ స్టేషన్‌కి కొత్తగా వచ్చిన స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ ఖాన్‌(పశుపతి)అజయ్‌శాస్త్రి తీవ్రవాది అని ఆరోపిస్తాడు. దాన్ని  అనామిక వ్యతిరేకిస్తుంది. అజయ్‌శాస్త్రి తీవ్రవాది కాదని అనామిక నిరూపించిందా ? చివరికి అజయ్‌ ఏమయ్యాడు. పీపుల్స్‌ప్లాజాలో జరిగిన బాంబ్‌ బ్లాస్ట్ లో నిందుతుడైన మిళింద్‌ ఎవరు? అతని కేస్‌ని హోం మినిస్టర్‌(నరేష్‌) ఎందుకు ప్రక్క తోవ పట్టించాడు అనే ప్రశ్నలకు సమాధానం కోసం సినిమా చూడాలి ... 

తప్పిపోయిన భర్తను వెతుక్కునే భార్యగా నయనతార అద్భుతంగా నటించింది. మరో నటి అయితే ఈ పాత్ర పండేది కాదేమో అనేలా చేసింది.హెవీ క్యారెక్టర్‌ని ఎమోషన్స్‌తో బాగా క్యారీ చేసింది.  ఎస్‌.ఐ గా నటించిన వైభవ్‌ పాత్రకు తగ్గట్టు  ఎక్స్‌ప్రెషన్స్‌ పెద్దగా చూపించలేకపోయాడు. కానీ చాలా నాచురల్‌గా యాక్ట్‌ చేశాడు. పశుపతి కూడా పోలీస్‌ పాత్రకు సూటయ్యాడు. హోటల్‌ ఓనర్‌, స్టేషన్‌లో రైటర్‌గా చేసిన నరసింగరావు బాగానే చేశారు. సెకెండ్‌ ఇన్నింగ్‌లో జోరుగా సినిమాలు చేసుకుంటూ పోతున్న సీనియర్‌ నరేష్‌ ఇందులో హోం మినిస్టర్‌ ఆదికేశవులుగా నటించాడు. అతను కనిపించిన ప్రతిసారి ఫోన్‌లో టెన్షన్‌గా హర్డ్‌డిస్క్‌ గురించి మాట్లాడడం తప్ప చేసిందేమీ లేదు. 

చక్కటి విలువలతో  తెలుగు సినిమాని తీసే దర్శకుల్లో శేఖర్‌ కమ్ముల ఒకరు. 'ఆనంద్‌' నుంచి 'లైప్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' వరకు ఫీల్‌గుడ్‌ సినిమాను చూపించిన ఆయన తొలిసారిగా  అరువు కథను చేసేందుకు ధైర్యం చేశాడు. అదీ కూడా బాలీవుడ్‌లో ప్రూవ్‌ అయిన 'కహాని' . నయనతార ప్రధాన పాత్రలో తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ఈ  'అనామిక'. బాలీవుడ్‌ ప్రఖ్యాత నిర్మాణ సంస్థలు నిర్మించాయి. శేఖర్‌ కమ్ముల కహాని సినిమాను రీమేక్‌ చేస్తున్నాడనగానే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ హీరోయిన్‌ ఓరియంటెడ్ చిత్రం   ప్రమోషన్‌కి హీరోయిన్‌ రాకపోయినా, శేఖర్‌ కమ్ముల చేసిన వినూత్నమైన ప్రచారం సినిమాకు బాగానే హెల్ప్‌ అయ్యింది. ఇది రీమేక్‌ కథే అయినా తెలుగు నేటివిటీకి అనుగుణంగా చాలా  మార్పులు చేశాడు శేఖర్‌ కమ్ముల. దీనికి యండమూరి వీరేంద్రనాథ్‌ సహాయం తీసుకున్నాడు. థ్రిల్లర్‌ కథని ట్విస్ట్‌లతో వీలైనంత కొత్తగా తెరకెక్కించడానికి వీరిద్దరూ కృషి చేశారు. కానీ ఫస్టాఫ్‌లో ఫూర్తిస్థాయి థ్రిల్లర్‌ అనే ఫీల్‌ కలిగించలేకపోయారు . తొలి భాగం  స్లోగా ఉండడం అందుకు ఒక కారణమనొచ్చు. సెకెండాఫ్‌లో ట్విస్ట్లులు , ఉత్కంఠతో ఆసక్తికరంగా ఉండడంతో-  వేగం పెరిగినట్లు  అనిపిస్తుంది. క్లైమాక్స్‌ సీన్స్‌ చాలా బాగా డీల్‌ చేశాడు శేఖర్‌.
క్లైమాక్స్‌ సీన్స్‌ని మార్చి మలిచిన తీరు బావుంది. 'కహాని' సినిమాను రీమేక్‌ చేయడమనేది శేఖర్‌ కమ్ములకు సవాల్‌తో కూడిన పని.  'కహాని' సినిమాలో ప్రధాన అంశాలను మాత్రమే తీసుకుని శేఖర్‌ కొత్తగా చూపించడానికి ట్రై చేశాడు. ఆ విషయంతో కొంత వరకు సఫలం అయ్యాడు కూడా.  కానీ ఇందులో చేసిన అన్ని మార్పులు సినిమాకు ప్లస్‌ కాలేదు . సెకెండాఫ్‌ చూస్తుంటే ముందు ఏదో ట్విస్ట్‌ ఉందని ఈజీగా తెలిసిపోతుంది. కొన్ని ట్విస్ట్‌లకు ఆన్సర్‌ దొరకలేదు. సినిమా చూసొచ్చాక అజయ్‌ శాస్త్రి అలియాస్‌ మిళింద్‌ గురించి కొన్ని అనుమానాలు కలుగుతాయి. వాటి గురించి  దర్శకుడు సినిమాలోనే  చెప్తే బావుండేది. కానీ ఆ అనుమానాల్ని లాస్ట్‌ టైటిల్‌ కార్డ్‌లో వేయడం కరెక్ట్‌ కాదు . ఇందులో ఉగ్రవాదాన్ని చూపించారు. కానీ ఏ మతాన్ని కించపరచలేదు. ఇందులో చక్కని సందేశం కూడా ఉంది. ఎమోషన్స్‌ని చక్కగా సినిమాలో క్యారీ చేయడం శేఖర్‌ ప్రధాన బలం.

ఆర్టిస్ట్‌ల నుండి చక్కని నటనను రాబట్టుకున్నాడు శేఖర్‌. తప్పిపోయిన భర్తను వెతుక్కునే భార్యగా నయనతార అద్భుతంగా నటించింది. మరో నటి అయితే ఈ పాత్ర పండేది కాదేమో అనేలా చేసింది.హెవీ క్యారెక్టర్‌ని ఎమోషన్స్‌తో బాగా క్యారీ చేసింది.  ఎస్‌.ఐ గా నటించిన వైభవ్‌ పాత్రకు తగ్గట్టు  ఎక్స్‌ప్రెషన్స్‌ పెద్దగా చూపించలేకపోయాడు. కానీ చాలా నాచ్యూరల్‌గా యాక్ట్‌ చేశాడు. పశుపతి కూడా పోలీస్‌ పాత్రకు సూటయ్యాడు. హోటల్‌ ఓనర్‌, స్టేషన్‌లో రైటర్‌గా చేసిన నరసింగరావు బాగానే చేశారు. సెకెండ్‌ ఇన్నింగ్‌లో జోరుగా సినిమాలు చేసుకుంటూ పోతున్న సీనియర్‌ నరేష్‌ ఇందులో హోం మినిస్టర్‌ ఆదికేశవులుగా నటించాడు. అతను కనిపించిన ప్రతిసారి ఫోన్‌లో టెన్షన్‌గా హర్డ్‌డిస్క్‌ గురించి మాట్లాడడం తప్ప చేసిందేమీ లేదు. సంభాషణలు బావున్నాయి. బ్యాగ్రౌండ్‌లో వచ్చే సిరివెన్నెల  రెండు పాటలు బావున్నాయి. కీరవాణి ఆర్‌.ఆర్‌ సినిమాకు పెద్ద ఎసెట్‌ అనొచ్చు. సెకెండాఫ్‌ ఎడిటింగ్‌ చాలా బావుంది. తెలుగులో ఆరీ అలెక్సా కెమెరాతో చిత్రీకరించిన తొలి చిత్రమిది. విజయ్‌.సి.కుమార్‌ ఫోటోగ్రఫీ ఎక్స్‌లెంట్‌. ఓల్డ్‌ సిటీని సెట్స్‌ని అద్బుతంగా తీర్చిదిద్దిన చిన్నాకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. నిర్మాణ విలువలు బావున్నాయి. మార్తండ్‌.కె.వెంకటేష్‌  ఎడిటింగ్ కూడా బాగుంది   - ధరణి 

0 comments:

Post a Comment