RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, December 20, 2013

'బిరియాని' చిత్ర సమీక్ష

                                  'బిరియాని'  చిత్ర సమీక్ష  3/5

స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా  వెంకట్ ప్రభు దర్శకత్వం లో ఈ చిత్రాన్ని నిర్మించారు . 

సుదీర్  అమ్మాయిలను అమితంగా ఆకట్టుకునే  టాలెంట్ తో   ప్లే బాయ్ లా, చిన్న నాటి మిత్రుడు పరశు రామ్ తో
కలిసి  తిరుగుతుంటాడు  .ఇండస్ట్రియలిస్ట్ అయిన వరదరాజన్ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు . ఒక రోజు వరదరాజన్ ఇచ్చిన ఓ పార్టీకి వచ్చి,వెళ్తూ -బిర్యానీ కోసం వెదుకుతున్న  సుదీర్ -పరశు లకు  హాట్ బ్యూటీ మాయ తగులు తుంది. ఆమె మాయకి పడిపోయి మాయతో కలిసి ఆమె హోటల్ కి వెళతారు . ఆ రాత్రి బాగా తాగి ఎంజాయ్ చేసిన వారికి , ఉదయం లేచి చూస్తే మాయ కనిపించదు. సుదీర్ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు.  ఆ మర్డర్ కేసు నుండి తనని రక్షించు కోవడానికి ప్రేమికురాలు ప్రియాంక తో పాటు , స్నేహితుల సాయం తీసుకుంటాడు. ఆ మర్డర్ మిస్టరీని  సుదీర్ ఎలా చేదించాడు?అనేదే మిగిలిన కథాంశం..

ఇటీవల కొన్నిచిత్రాల  చేదు అనుభవం అందుకున్న  కార్తీ హిట్ కొట్టక తప్పని చిత్రం ఇది . ప్రతిభావంతుడైన దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం కార్తీని , ప్రేక్షకులను నిరాశ  పరచలేదు . హీరో ను ను ప్లే బాయ్ గా చూపుతూ, మంచి మసాలా బ్యాక్ గ్రౌండ్ లో వెంకట్ ప్రభు  తరహా స్క్రీన్ ప్లే ... సస్పెన్స్ తో ఈ చిత్రం నడుస్తుంది . మొదటి భాగం అంతా సరదా సన్నివేశాలతో , కాస్త చిరాకు తెప్పించినా -ఇంటర్వెల్ సన్నివేశాలు సినిమాకి ఊపు నిచ్చాయి . రెండవ భాగం ఆసక్తికరం గా, వేగం గా సాగుతుంది .అందువల్ల చాలా లాజిక్స్ మిస్ అయినా ప్రేక్షకుడు గుర్తించడు  . హోటల్ లో వరద రాజన్ హత్య  జరిగినప్పుడు సి. సి. కెమెరాతో పాటు, చాలా మంది దాన్ని గమనించడానికున్న అవకాశాన్నీ  దర్శకుడు దాటవేశాడు .అలాగే ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు , సస్పెన్స్ రివీల్  చేసేటప్పుడు కొంత కన్ఫ్యూజ్ అవుతాము . ఎంత జాగ్రత్తగా చేసినా, డబ్బింగ్ సినిమా వాసనలు పోలేదు  .  అయితే హీరో ను పోలీసులు చేజ్ చేస్తుంటే -దానికి పాటను జత చెయ్యడం , రైల్వే స్టేషన్ లో ఉత్కంట కలిగించే  సన్నివేశం లో -'ఫ్లాష్ మాబ్ డాన్స్' పెట్టడం కొత్తగా అనిపిస్తాయి .  క్లైమాక్స్  ఈ చిత్రానికి హై లైట్ .సీరియస్ సన్నివేశాల్లో కూడా కామెడీ జొప్పించడం ఈ దర్శకుడి ప్రత్యేకత .  

సుదీర్ గా ప్లే బాయ్ తరహా పాత్రలో కార్తీ మొదటి భాగం లో మంచి వినోదాన్ని అందిస్తూ , రెండవ భాగం లో హీరోయిజాన్ని చక్కగా  పండించాడు  .ఒక పాటలో స్వంత గొంతు కలిపాడు . హన్సిక అందం గా , పాత్రోచితం గా చేసింది .  సుదీర్ మిత్రుడు పరశురామ్ గా ప్రేమ జీ   హీరో కు మంచి సపోర్ట్  అందించాడు .మాయ గా మాండీ  వేడి వేడిగా కనిపించింది  , వరదరాజన్ గా నాజర్ , హీరో అక్క గా మధుమిత , సి .బి .ఐ అధికారి రియాజ్ గా సంపత్ , కాంట్రాక్ట్ కిల్లర్ - హిట్ వుమన్ గా ఉమా ,  పరశురామ్ అల్లుడు విజయ కృష్ణ గా రాంకీ తమ తమ పాత్రలను బాగా పోషించారు . యువ హీరో జై కూడా ఒకసారి కనిపించాడు  . 

వందవ చిత్రం అయినప్పటికీ  యువన్ శంకర్ రాజా ఈ చిత్రం లో ఒక్క పాటా బాగుందనిపించలేదు . రీ రికార్డింగ్ మాత్రం కొత్తగా , బ్రహ్మాండం గా చేసాడు .శశాంక్ వెన్నెలకంటి మాటలు  ప్రత్యేకం గా చెప్పు కోవాల్సినంత బాగున్నాయి . శక్తి శరవణన్ ఫోటోగ్రఫీ , ప్రవీణ్ - ప్రశాంత్ ల ఎడిటింగ్ , శెల్వ స్టంట్స్ బాగున్నాయి                                             -రాజేష్

0 comments:

Post a Comment