RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, July 5, 2013

' సింగం' చిత్ర సమీక్ష

' సింగం' చిత్ర సమీక్ష  3/5

స్టూడియో గ్రీన్ -ప్రిన్స్ పిక్చర్స్ సంస్థలు హరి దర్శకత్వంలో ఎస్ .లక్ష్మణ కుమార్ ఈ చిత్రం  నిర్మించారు . 

             ఒక పెద్ద మాఫియా ముఠా ను పట్టుకోవడానికి నరసింహం పొలీస్ ఉద్యోగానికి  రాజీనామా చేసి ఓ స్కూల్ లో డ్రిల్ మాస్టర్ గా చేరతాడు . అక్కడ ప్రత్యర్ధులు గా కనిపించే ముఠా నాయకులు భాయ్ ,త్యాగరాజు లు జనాన్ని అలా నమ్మిస్తూ , లోపాయికారీ గా డ్రగ్స్ బిజినెస్ చేస్తున్న విషయాన్ని  తెలుసుకుంటాడు . వారి వెనుక వున్న అంతర్జాతీయ డాన్ డానీ వంటి  కీలక వ్యక్తులను పట్టుకోవాలను కుంటాడు . ఆ పని  మామూలు పోలీసులతో కాదని, ప్రభుత్వ అనుమతి పొంది  ఆపరేషన్- డి పేరుతో సంఘ వ్యతిరేక శక్తులను ఏరి పారేసే పని ప్రారంభిస్తాడు . తర్వాత ఏమి జరిగిందో సినిమాలో చూడాలి ... 

              సూర్య-హరి కాంబినేషన్ లో రూపొంది దేశమంతా విజయాన్ని అందుకున్న  ' సింగం' (యముడు)కు ఇది కొనసాగింపు . మొదటి భాగం కన్నా దీన్ని మరింత జనాకర్షణీయంగా రూపొందించడంలో దర్శకుడు హరి విజయవంతం అయ్యాడు .  ' సింగం' మంచి మసాలా మాస్ చిత్రం .  మనం రొటీన్ గా చూసే మరో పొలీస్ కధా  చిత్రమే అయినప్పటికీ- సన్నివేశాల్లో కొత్తదనం...చురుకుదనం ...కధనం లో బిగి... వేగం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి .విదేశాల పేర్లు చెప్పడం,చూపడం తోనే సరిపెట్టకుండా ఒక విదేశీయుడిని విలన్ గా ప్రదాన పాత్రలో పెట్టడం ఈ చిత్రంలో మరో ప్రత్యేకత .  డబ్బింగ్ చిత్రం అయినప్పటికీ అనువాదంలో- లొకేషన్లకు  కాకినాడ -అరకు వంటి సరిపోయే పేర్లు పెట్టడంతో పాటు , పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్ట్రెయిట్  చిత్రం చూస్తున్నట్లే వుంటుంది. పక్కా కమర్షియల్ చిత్రం అయినప్పటికీ దేశ భక్తిని జోడించడం అభినందనీయం .  సూర్య నటన ఈ చిత్రంలో హైలైట్ .నరసింహంగా నిజంగా 'ఆకలితో వున్న  సింహం' లానే దూకుడు గా నటించాడు .ఆవేశ పూరితమైన సన్నివేశాలతో పాటు, ఫైట్స్ లో కూడా చాలా బాగా చేసాడు . అనలరసు  నేతృత్వం లో యాక్షన్ సన్నివేశాలు కూడా భారీ ఖర్చుతో వినూత్నంగా చిత్రీకరించారు . శశాంక్ వెన్నెలకంటి  సంభాషణలు కూడా చిత్రానికి బలాన్ని ఇచ్చాయి.  స్కూల్ జాతీయగీతం సమయం లో  గూండాల రభస , కాకినాడ అల్లర్లు... అమ్మాయిని కాపాడటం, సహాయం అరెస్ట్ ,అరెస్టైన డానీని ముఠా  నాయకులు విడిపించడం , పోలీస్ కమీషనర్.. భాయ్.. త్యాగరాజు లతో హీరో వాగ్వాదం ,సౌత్ ఆఫ్రికాలో డానీని అరెస్ట్ చేసేందుకు హీరో ప్రయత్నాలు ... చేజ్ బాగున్నాయి .కాకుంటే -డబ్బింగ్ బాగున్నప్పటికీ, సాయికుమార్ సినిమాల్లో లాగా డైలాగ్ పార్ట్ కొంత ఎక్కువయ్యి కొన్నిసార్లు గోలగా అనిపిస్తుంది .సినిమా రెండవ భాగం నిడివి ఎక్కువ అయ్యిన ఫీలింగ్ కలుగుతుంది .  ఈ చిత్ర ప్రారంభంలో అంజలి తో ఓ స్పెషల్ సాంగ్ పెట్టారు . అయితే, గుండ్రంగా వుండే అంజలి  డాన్సులకు పనికిరానని ఈ పాటతో  నిరూపించుకుంది .   
 
                  కాలేజీ అటెండర్ దాసు గా  సంతానం కామెడీ ఈ చిత్రం లో బాగా పండింది . అతను  'పరలోకంలో వున్న ప్రభువా' అంటూ ప్యాంటులు ఊడ దీసే సన్నివేశాలు తెగ నవ్విస్తాయి .పాటల్లో గ్లామర్ కు  తప్ప  కావ్యగా అనుష్క పాత్రకు  ప్రత్యేకత ఏమీ లేదు . హీరో ఫై  అమాయకం గా మనసుపడే సత్య గా హన్సిక పాత్ర కూడా కొత్తగా ఏమీ లేదు . ఇతర పాత్రలను  విదేశీ నటుడు డానీ సపానీ , ముకేష్ రుషి, రెహమాన్ , మసూర్ అలీ ఖాన్ , వివేక్ , విజయ కుమార్ , కె .విశ్వనాద్ , సుమిత్ర , నాజర్ , రాధా రవి , మనోరమ పోషించారు . దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో గంగ్నమ్ డాన్స్ ని తలపించే ' సింగం డాన్స్' మాత్రమే చిత్రీకరణతో సహా బాగుంది . రీ రికార్డింగ్ , ప్రియన్ ఫోటోగ్రఫీ, విజయన్ ఎడిటింగ్ బాగున్నాయి  -రాజేష్ 

0 comments:

Post a Comment