మహతి మ్యూజిక్ - శ్రీ నాగ రంజని లలిత సంగీత అకాడమీ ఆధ్వర్యం లో జనవరి 5న రవీంద్ర భారతి లో 'సదా బహార్ నగ్మే'( హిందీ చలన చిత్ర ఆపాత మధురాలు) సినీగీత విభావరి జరిగింది.మూడు దశాబ్దాల హిందీ చలన చిత్ర స్వర్ణయుగం (1950-1980)లోని జన రంజకమైన "జ్యోతి కలష్ ఛల్ కే ", "తేరే మేరె సప్నే", "బయ్య నాదరో", "గుమ్ నామ్ హాయ్ కోయి", "మేరే సప్నోంకి రాణి", "ఓ మేరే సోనారే ", "ధీరె ధీరె మచల్", "రైనా బీత్ జాయే" వంటి ఎంపిక చేసిన గీతాలను ఆలపించి పాత పాటల తీయదనాన్ని అందించారు.లతా మంగేష్కర్,ఆషా భోంస్లే ,మన్నాడే,రఫీ,కిషోర్ కుమార్,జేసుదాస్,సుమన్ కళ్యాణ్ పూర్ వంటి మహా గాయకులు నాడు ఆలపించిన గీతాలను డా"చిత్తరంజన్, డా"యం.విజయకుమార్ ,మురళి,కౌశిక్,విజయ లక్ష్మీ దేశికన్,వందన పవన్,మహతి రాఘవన్, అమృత వల్లి ఆనంద్ తదితరులు ఆలపించి ప్రేక్షకులను పులకరింప జేసారు.ఈ కార్యక్రమం లో పాడిన వారంతా మహాభాష్యం కుటుంబ సభ్యులే కావడం విశేషం.ఈ కార్య క్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీత్ ,మహేంద్ర సత్యం సీనియర్ ఉపాధ్యక్షులు శివానంద తనేజ ముఖ్య అతిధులుగా హాజరై గాయనీ గాయకులను అభినందించారు.'సంగీత్ సాగర్' అశోక్ బృందం వారు వాద్య సహకారం అందించారు.సినీ గీత చిత్రీకరణలను వీడియో స్క్రీన్ ద్వారా రఘురామ్ ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.ఈ కార్యక్రమాన్ని సంస్థ కార్యనిర్వాహక కార్యదర్శులు రాఘవ దేశికన్,డా"యం.విజయ కుమార్ రసవత్తరం గా నిర్వహించారు.
0 comments:
Post a Comment