'కె.వి.రెడ్డి అవార్డు' ను అందుకున్న బి.గోపాల్
విఖ్యాత దర్శకుడు 'కె.వి.రెడ్డి అవార్డు' ప్రదానోత్సవం 'యువకళావాహిని' ఆధ్వర్యంలో 24న రవీంద్రభారతిలో ఉల్లాసభరితంగా జరిగింది. ఈ అవార్డును డా"అక్కినేని నాగేశ్వరరావు, కె.విశ్వనాధ్,డి.రామానాయుడుల చేతులమీదుగా ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ కు ప్రదానం చేశారు. కె.వి. రెడ్డి చలనచిత్ర పరిశ్రమ మరిచిపోలేని గొప్ప వ్యక్తని, అంతకంటే గొప్ప దర్శకుడని చెబుతూ - ప్రేక్షకులను రంజింపజేసే పకడ్బందీ కధనం(స్క్రీన్ ప్లే)అందించడం లో కె.వి.రెడ్డి దిట్ట -అని డా"అక్కినేని కొనియాడారు.పరుచూరి సోదరుల గురించి అక్కినేని విసిరిన ఛలోక్తులు నవ్వులు పూయించాయి.
డాక్టర్ డి.రామానాయుడు మాట్లాడుతూ- బి.గోపాల్ తమ సంస్థకు బిడ్డలాంటి వాడని అన్నారు.ఈ ఏడాది తను దర్శకత్వం వహిస్తానని చెప్పారు. బి.గోపాల్ మాట్లాడుతూ- థియేటర్లో నేలపై కూర్చొని అక్కినేని సినిమాలు చూసిన తాను ఆయన చేతుల మీదుగా అవార్డు అందుకోవటం నమ్మలేనంత ఆనందంగా ఉందన్నారు. రామానాయుడు దర్శకుడిగా అవకాశం ఇవ్వకుంటే తాను ఈ స్థితిలో వుండే వాడిని కాదని,ఈ అవార్డును రామానాయుడుకే అంకితం చేస్తున్నానని అన్నారు. ఈ సభలో పరుచూరి సోదరులు, సారిపల్లి కొండల రావు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్,నిర్మాత యస్.గోపాల్ రెడ్డి, నిర్మాత డా"వెంకటేశ్వరరావు, 'జాతీయ అవార్డు గ్రహీత' వాసిరాజు ప్రకాశం, 'సినీ వినోదం.కామ్' సంపాదకుడు రాంబాబు అడ్ల , వై.కె.నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.యస్.వి.రామారావు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో గంగాధర్,విజయలక్ష్మి ,చింతలపాటి సురేష్ ల 'కె.వి.రెడ్డి సినీ సంగీత విభావరి' ఆహుతులను ఆకట్టుకుంది.

0 comments:
Post a Comment