RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, July 27, 2012

'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' చిత్ర సమీక్ష



                   'ఊ కొడతారా ఉలిక్కి పడతారా'  చిత్ర సమీక్ష       2.5/5

 మంచు ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం ఫై  శేఖర్ రాజా దర్శకత్వం లో మంచు లక్ష్మి ప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మించారు.

అద్భుతభవనం  గంధర్వ మహల్ ని అద్దెకిచ్చి జీవిస్తున్న రాయుడు కి ఇద్దరు కూతుళ్ళు. అక్కడకి కొత్తగా వచ్చి చేరిన ఓ యువకుడు రాయుడు చిన్న కూతురు ని ప్రేమిస్తున్నానంటూ వెంట తిరుగుతూ ... ఆ కుటుంబానికి  మేలు చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. రాయుడు పెద్ద కూతురుకి పెళ్లి కట్నంగా గంధర్వ మహల్ ని ఇమ్మని కోరుతారు. రాయుడు  కుటుంబం అందుకు సిద్ధ పడినా...మరణించిన  రాయుడు తండ్రి నరసింహనాయుడుకు అది ఇష్ట పడక, అతని ఆత్మ  గంధర్వ మహల్లో తిరుగుతూ వారిని ఇబ్బంది పెడుతుంది. ఇంతకీ ఈ గంధర్వ మహల్ అసలు కధ ఏంటి? నరసింహనాయుడు ఎలా మరణించాడు? ఆ ఇంటికి వచ్చిన ఆ యువకుడు ఎవరు? ఈ విషయాలన్నీ సినిమాలోనే చూడాలి ....
                  చాలా సార్లు 'అరుంధతి' ని గుర్తు చేస్తూ అంతకు మించిన భారీనిర్మాణ,సాంకేతిక విలువలతో వచ్చిన ఈ చిత్రంలో అన్ని హంగులూ వున్నాయి...మంచి స్క్రీన్ ప్లే తప్ప. శేఖర్ రాజా గొప్ప  అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదనిపించింది." చెల్లెలికోసం దేనికైనా వెనుదీయని త్యాగమూర్తి అన్నయ్య ,చెల్లెల్ని బాధ పెట్టే భర్త ,చివరికి అతన్ని దండించే అన్నయ్య" ...మనం ఎన్నోసార్లు చూసిన  ఈ కధతోనే  మళ్ళీ  ఈ చిత్రం తీసారు. అయితే అధునాతన సాంకేతికతతో ఈ చిత్రానికి కొత్త కలర్ తేవాలని ప్రయత్నించారు.కానీ ,రెండు, మూడుతరాల కధ కావడంతో ఏర్పడ్డ గందరగోళం ,స్క్రీన్ ప్లేలో పట్టులేక పోవడం, వినోదం కొరవడటం ...ఉన్న కాస్త కామెడీ పండకపోవడం -వంటి కారణాలతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.ఈ చిత్రాన్ని తమిళంలో కూడా చేసినందున సినిమా మొదటి భాగం లో  కొంత అరవ వాసన కొట్టింది.  బాల క్రిష్ణ,మంచు మనోజ్,మంచు లక్ష్మి ప్రసన్నల నటన...గంధర్వ మహల్ వంటి భూపేష్  కళాప్రతిభ, నిప్పుల గుర్రంఫై బాలయ్య రావడం, క్లైమాక్స్ లో ఒక శరీరంలో మరొకరి ఆత్మ... వంటి' పిక్సన్' వారి విజువల్ ఎఫెక్ట్స్  ఈ చిత్రంలో ప్రత్యేకతలు.
                 హీరోగా  కాకుండా , తొలి సారి బాలక్రిష్ణ  ఈ చిత్రం లో ప్రధాన  పాత్రపోషించేందుకు  తీసుకున్న  నిర్ణయం నూటికి నూరు పాళ్ళూ కరెక్టే అనిపిస్తుంది.దర్శకుడు ఇంకా బాగా  ఉపయోగించుకోలేదనే అసంత్రుప్తి కలిగినా...నరసింహనాయుడు పాత్రను బాలయ్య హుందాగా , అద్భుతం గా పోషించాడు. "ఎవరైనా గంధర్వ మహల్ నాదీ అని అన్నారో" వారి అంతు చూస్తాననే అతడు, చెల్లి కాబోయే భర్త కోరితే గంధర్వ మహల్ ని  అప్పగించి ఎలా వెళ్ళి పోతాడో అర్ధం కాదు. వైవిధ్యాన్ని  ఇష్టపడే మంచు మనోజ్ వివిధ గెటప్స్ తో  ఇందులో ప్రతిభావంతంగా  రెచ్చి పోయి నటించాడు.సినిమా ప్రారంభం లో అతని ఫై చిత్రీకరించిన ఫ్లాష్ బ్యాక్ పాట లో హింస, దీక్షా సెథ్ బృందం తో చేసిన మరో పాటలో ఆటవికత కాస్త ఎక్కువయ్యాయి. డైలాగ్ డెలివరీ లో తండ్రి మోహన్ బాబు ను అక్కడక్కడా అనుకరించాడు.అమృతవల్లిగా లక్ష్మీ ప్రసన్న మూడు రకాల గెటప్స్ తో,చక్కటి నటనతో  ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఫణీంద్ర భూపతిగా సోనూ సూద్ 'అరుంధతి' లోని పశుపతిని  గుర్తు చేసాడు.దీక్షా సెథ్ అందంగా కనిపించింది.అజయ్ భూత వైద్యుడిగా వెరైటీ  పాత్ర పోషించాడు. సాయి కుమార్ విలన్ గా  చేసినా కమెడియన్ గెటప్ లో కనిపించడం ఎబ్బెట్టుగా వుంది.ఇతర పాత్రల్లో ప్రభు, భాను చందర్, సుహాసిని, రుషి, పృథ్వి, ప్రవీణ్, మధుమిత, ప్రభ,ధర్మవరపు, రఘుబాబు,అభినయశ్రీ, ఐశ్వర్య నటించారు. బెబో శశి పాటల్లో 'ఇది అని-అది అని'బాగుంది. పాటల చిత్రీకరణ బాగుంది. చిన్నా నేపధ్య సంగీతం సినిమా మూడ్ కి ఉపకరించింది.మంచు మనోజ్ యాక్షన్ ,రాజశేఖర్ ఫోటో గ్రఫీ బాగున్నాయి.                  
                                                                - రాజేష్       

0 comments:

Post a Comment