రంగనాద్' నడత 'పుస్తకావిష్కరణ
మనిషి జీవితం లో 'నడత' కు చాలా ప్రాముఖ్యత వుందని అక్కినేని నాగేశ్వర్ రావు అన్నారు. రవీంద్రభారతిలో ప్రముఖ నటుడు రంగనాద్ రచన' నడత' పుస్తకావిష్కరణ చేసిన అక్కినేని మాట్లాడుతూ -ప్రస్తుతం వక్ర మార్గంలో, విష పూరితమైన దిశలో పోతున్న సమాజానికి రంగనాద్ కవితలు కనువిప్పు కలిగించేలా వున్నాయని అన్నారు. 'యువకళావాహిని' ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమంలో డా"కే .ఐ .వరప్రసాద్ రెడ్డి దంపతులకు రంగనాద్ తన కవితా సంపుటిని అంకితమిచ్చారు. రంగనాద్ ను అతిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో రాళ్ళ బండి కవితా ప్రసాద్,డా"సి.నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ,సారిపల్లి కొండల రావు,వేమూరి రామ కోటేశ్వర్ రావు, బైసా రామదాస్, క్రిష్ణ, వై.కే.నాగేశ్వర్ రావు పాల్గొన్నారు. సభ ప్రారంభం లో రంగనాద్ చిత్రాల్లోని పాటలతో అందించిన ' గీతాలహరి' ప్రేక్షకులను అలరించింది.

0 comments:
Post a Comment