RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, September 27, 2013

'అత్తారింటికి దారేది' చిత్ర సమీక్ష

'అత్తారింటికి దారేది' చిత్ర సమీక్ష     3.75/5

           శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం ఫై రిలయన్స్ వారి సమర్పణలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన,దర్శకత్వంలో బి .వి .ఎస్ .యన్ .ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు .


           ఇటలీలోని మిలాన్ లో రఘు నందా పెద్ద  బిజినెస్ మెన్. ఆయన మనవడే గౌతమ్ నందా. 'ఆరడుగుల బుల్లెట్' లా తాతకు అన్నివేళలా గౌతమ్ అండగా ఉంటాడు. రఘు నందాకు  ఒక చివరికోరిక వుంటుంది. తనకు ఇష్టంలేకుండా వేరొకరిని పెళ్లిచేసుకుందన్న కోపంతో తన కూతురు సునంద ను ఇల్లు వదిలి  పొమ్మన్నానని అనుక్షణం బాధపడుతూ వుంటాడు. తను చనిపోయేలోపు కన్న కూతురుని కళ్ళారా చూడాలనివుందని అడగితే- తాత  కోరిక నెరవేర్చడానికి హైదరాబాద్ కు చేరుకుంటాడుగౌతమ్సునంద ఇంట్లో సిద్దార్థ్ పేరుతో కారు డ్రైవర్ గా పనికి కుదురుతాడు.అలా వచ్చిన గౌతంకు తన మరదళ్ళు అయిన శశి, ప్రమీల లతో ఎలాంటి ప్రేమ బంధం ఏర్పడింది? తండ్రి అంటే మండి పడుతున్న  సునందలో మార్పు తీసుకురావడానికి ,  తాత కోరికను తీర్చడానికి  గౌతమ్ ఏం చేసాడనేది సినిమాలో చూడాలి ...   

కనుల పండువగా వుండే భారీసినిమాలు కరువై  
అవురావురుమంటున్న   తెలుగు ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టే సినిమా ‘అత్తారింటికి దారేది’. పవన్ కళ్యాణ్ హీరో ఇమేజ్ కి  , త్రివిక్రమ్ జనరంజక రచనా - దర్శకత్వ ప్రతిభ కలిసి...కమర్షియల్, ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్ అంశాలు మేళవించిన   ఈ చిత్రం ప్రేక్షకులకు,  పవన్ కళ్యాణ్ అభిమానులకు  మంచి  వినోదాన్ని అందిస్తుంది . 
       పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కు సరిగా  సరిపోయే విధంగా గౌతమ్ నందా పాత్ర ను  దర్శకుడు త్రివిక్రమ్ చక్కగా తీర్చిదిద్దాడు. గౌతమ్ పాత్ర లో ఉండే ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్, బుల్లెట్ లా పేలే డైలాగ్స్ పవన్ కళ్యాణ్ అభిమానులకు విశేషంగా ఆనందింపజేస్తాయి. పవన్ కళ్యాణ్ తో 'చూడు 'సిద్దప్ప నేను సింహం లాంటి వాడిని...', సింహం నిద్ర పోతుంటే జూలుతో జడవేయ్యోద్దు..పులి పలకరించిందని పక్కనే నిలుచుని ఫోటోకు ఫోజివ్వద్దు' వంటి  త్రివిక్రమ్ కలం నుంచి అలాంటి మార్కు ఉన్న డైలాగ్స్ ఈ చిత్రంలో చాలా వున్నాయి . త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కు పవన్ కళ్యాణ్ మరింత పవర్ యాడ్ చేసి అభిమానులకు వంద శాతం సంతృస్తిని కలిగించాడు. అయితే కథలో కొత్తదనం లేకపోవడం...స్క్రీన్ ప్లే వేగంగా,పట్టుగా లేకపోవడం కొంత నిరాశను కలిగించినా.. త్రివిక్రమ్ మార్క్ కథనం, పవన్ పెర్ఫార్మెన్స్ ఆడియెన్స్ ఆ ఇబ్బందిని మర్చి పోయేలా చేసాయి . అలాగే రచయితగా త్రివిక్రమ్  ప్రాసకోసం,పంచ్ ల కోసం ఒక్కోసారి సందర్భ ఔచిత్యాన్నిమర్చిపోవడం కనిపిస్తుంది . సినిమా ద్వితీయార్ధంలో బ్రహ్మనందం చేసిన 'అహల్య'  ఎపిసోడ్, పవన్ కళ్యాణ్ బాబా ఎపిసోడ్ ప్రేక్షకులను అభిమానులకుతప్ప...మిగతా ప్రేక్షకులకు బాగా ఇబ్బంది పెట్టాయి .   ఇక రైల్వే స్టేషన్ లో క్లైమాక్స్ సీన్ చిత్రానికి హైలెట్.   క్లైమాక్స్ లో దర్శకుడు త్రివిక్రమ్ టేకింగ్, పవన్ కళ్యాణ్ నటన చిత్రం స్థాయిని పెంచాయి . 
              రఘునందా గా బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ తనదైన శైలిలోచక్కగా  నటించాడు.'మిర్చి' చిత్రం ద్వారా టాలీవుడ్ లో రీఎంట్రి ఇచ్చిన నదియా సునందగా    ప్రధాన పాత్రలో  ఆకట్టుకున్నారు. శశిగా సమంత, ప్రణీతలు గ్లామర్ తో ఆలరించారు.  పోసాని సన్నివేశాలు కూడా బాగున్నాయి . ఇతర పాత్రల్లో మోహన్ రుషి , రావు రమేష్ ,అలీ , ఎమ్మెస్ నారాయణ , రఘుబాబు , కోట , డా" భరత్, కాదంబరి కిరణ్ , పృథ్వి , ప్రదీప్ నటించారు . 
      
         దేవి శ్రీ ప్రసాద్ఈ చిత్రానికి  అందించిన ఆడియో ఇప్పటికే శ్రోతలను అలరిస్తోంది . రామజోగయ్య శాస్త్రి రాసిన 'కిర్రాక్', 'దేవ దేవం', 'బాపు గారి బొమ్మ', 'టైమ్ టూ పార్టీ' పాటలతోపాటు,  దేవి శ్రీ ప్రసాద్ స్వయంగా రాసిన 'నిన్ను చూడగానే', శ్రీమణి రాసిన 'ఆరడుగుల బుల్లెట్'తోపాటు 'కాటమ రాయుడా' అంటూ పవన్ పాడిన పాటకు అనూహ్య స్పందన లభించింది. ఆడియోకు  ధీటుగా పాటల  చిత్రీకరణ కూడా వుండటం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ . పీటర్ హైన్స్ వెరైటీ ఫైట్స్ అందించారు .  ప్రసాద్ మూరెళ్ల తన ఫోటోగ్రఫీ తో  యూరప్ అందాలను చక్కగా చూపడమే కాకుండా,కీలక సన్నివేశాల చిత్రీకరణకు జీవం పోశారు.ఒక పాటలో దేవిశ్రీ ప్రసాద్ , మరోపాటలో ముంతాజ్, హంసనందిని కనిపించడం విశేషం                    -రాజేష్ 

Saturday, September 21, 2013

శృంగార దృశ్యాలకూ సిద్ధం !

తప్పనిసరైతే శృంగార దృశ్యాల్లో నటించేందుకైనా సిద్ధంగానే ఉన్నానని, సినిమాల్లో పాత్రలకు సంబంధించి తన ఉద్దేశాలపై వివాహం ఎటువంటి ప్రభావమూ చూపలేదంటూ కుండబద్దలు కొట్టింది నటి కరీనాకపూర్. ‘పెళ్లికి అటువంటి పాత్రలకూ ఎటువంటి సంబంధమూ లేదు. కెరీర్‌ను పెళ్లికి, ప్రేమకు కొంతమంది ఎందుకు ముడిపెడతారో నేను అర్ధం చేసుకోలేకపోతున్నా’ అని పేర్కొంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ‘ఓంకార’ సినిమాలో అజయ్ దేవ్‌గణ్‌తో శృంగార దృశ్యాల్లో....

పెళ్లి చేసుకుంటామని ఎందరో...

రెండుసార్లు చేదు అనుభావాల్ని చవిచూసిన ప్రముఖ నటి నయనతార ప్రస్తుతం తన జీవితంలో ప్రేమకు తావు లేదని స్పష్టం చేసింది. ప్రేమ అనే రెండు అక్షరాలు ఆమె జీవితంలో ఒకసారి కాదు.... రెండుసార్లు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. భగ్న హృదయంతో నయనతార తన కెరీర్ మీదే దృష్టి పెట్టింది. నటిగా ఆమె సెకెండ్ ఇన్సింగ్స్ ప్రారంభించి షూటింగ్స్ తో తీరిక లేకుండా గడుపుతోంది. అయితే యువ హీరోల రూపంలో ప్రేమ మళ్లీ నయనను చుట్టుముట్టే ప్రయత్నం చేస్తోంది. నయనతార తనకు ప్రత్యేక స్నేహితురాలు అంటూ హీరో ఆర్య బహిరంగంగానే ప్రకటించారు. అంతేకాదు ఆమెను ఇంటికి తీసుకెళ్లి...

బుల్లితెర ఫై 100కోట్ల 'మహాభారతం'

బాలీవుడ్ సినిమాలకు రూ. 100 కోట్లు ఖర్చు చేయడం సాధారణ విషయం. అలాగే హిందీ సినిమాలు రూ. 100 కోట్లు వసూలు సాధిస్తుండడం కూడా మామూలు విషయంగా మారిపోయింది. బుల్లితెర కూడా భారీతనాన్ని ఆపాదించుకుంటోంది. టీవీ సీరియళ్లకు ఆదరణ పెరుగుతుండడంతో భారీ వ్యయంతో వీటిని నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. భారతదేశ టెలివిజన్ చరిత్రలో అత్యంత భారీ వ్యయంతో రూపొందిన మెగా సీరియల్ సెప్టెంబర్ 16నుంచి ప్రేక్షకుల ముందుకు....

'త్వరలో దక్షిణాది సినిమాకూ రూ.100కోట్ల వైభవం'

త్వరలో దక్షిణాదిసినిమా వందకోట్ల మార్క్ ను దాటుతుందని ప్రముఖ తెలుగు నటుడు అక్కినేని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ల ఎన్ని సినిమాలు వచ్చినా ఆ మైలురాయిని చేరుకోవడం గగనంగా మారిందన్నాడు. బుధవారం ఐఎన్ ఎస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో నాగార్జున పలువిషయాల్ని పంచుకున్నారు. బాలీవుడ్ ఇప్పటికే ఆస్థానాన్ని అందిపుచ్చుకోగా, దక్షిణాది సినిమా మాత్రం ఇంకా వెనుకంజలోనే ఉందని తెలిపారు. ఆ భర్తీ త్వరలో పూర్తి చేస్తామనే ధీమాను....

'రాజకీయాల్లోకి రా.. కథానాయకుడా'


సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దక్షిణ భారత సినీ వినీలాకాశంలో తిరుగులేని కథానాయకుడు రజనీకాంత్. ఆయన రాజకీయ ప్రవేశంపై చాలా కాలంగా ఉత్కంఠ నెలకొంది. గతంలో రజనీకాంత్ ఇచ్చిన ఓ సంకేతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయూంశమైంది. రాజకీయ సంకేతంగా ఆయన గళం విప్పడం అభిమానుల్లో ఉత్తేజం నింపింది. తర్వాత విడుదలైన చిత్రాల్లో రాజకీయ డైలాగులు పేలడంతో రజనీ రాజకీయ ప్రవేశంపై చర్చ తీవ్రమైంది. రాజకీయాల్లోకి ఎప్పుడు రావాలో, ఎలా రావాలో, రావాల్సిన సమయంలో వస్తా ....

నాటకరంగానికి 'అక్కినేని నాటక కళా పరిషత్‌' ప్రోత్సాహం !


అభినయ రంగంలో అన్ని మెట్లూ అధిరోహించిన 90 ఏళ్ల అక్కినేని నుంచి అభినందనలు, బహుమతులు అందుకునే అవకాశం కల్పించే 'డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు నాటక పరిషత్‌ కళా 'కు 20 ఏళ్లు వచ్చాయి. నటనా రంగంలో వెలుగులు విరజిమ్మిన ప్రతిభావంతులలో ముందు పేరుగా చెప్పుకునే అక్కినేని నాగేశ్వరరావు పేరిట అభిమానులు రాష్ట్ర రాజధానిలో నాటకాల పోటీలను ఆ పరిషత్తును నిర్వహిస్తున్నారు. 1929లో మొదలై పోటీ నాటకాలకు ఒరవడి దిద్దిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు స్ఫూర్తితో నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తూ తెలుగు నాట ప్రతిష్టాత్మక పరిషత్తుగా...