RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Sunday, April 28, 2013

అందుకే ‘డర్టీ పిక్చర్’ తెరకెక్కించాను!

'లవ్ సెక్స్ ఔర్ ధోకా', 'క్యా సూర్ కూల్ హై హమ్', 'రాగిణి ఎంఎంఎస్' తదితర సినిమాలను తెరకెక్కించి వివాదాస్పద చిత్రాల నిర్మాతగా పేరు సంపాదించుకున్న ఏక్తాకపూర్ దేశంలో మహిళలపట్ల జరుగుతున్న దారుణాలపై స్పందించారు. భారతదేశంలో మహిళలపట్ల మగాళ్ల మైండ్‌సెట్ మారాలని ఏక్తా అభిప్రాయపడ్డారు. మగాళ్ల మనస్తత్వమే ఇండియాలో సమస్యగా మారుతోందన్నారు. మగాళ్లు ఏ మాత్రం సామాజిక బాధ్యతతో వ్యవహరించడం లేదని.... 

భారతీయ సినిమా వందేళ్ల వేడుక ప్రారంభం

భారతీయ చలన చిత్ర పరిశ్రమ వందేళ్ల పండుగను జరుపుకోవడానికి సిద్ధమైంది.నిర్మాణంలో ఎవరికీ తీసిపోని సామర్ధ్యం వల్ల భారతీయ చిత్రాలంటే ప్రపంచ సినిమా రంగానికి గొప్ప ఆదరణ పెరుగుతోంది. ఇటీవల కాలంలో భారతీయ నేపథ్యానికి హాలీవుడ్ కూడా ఆకర్షణకు లోనవుతోంది. అందుకు తాజా ఉదహరణ 'లైఫ్ ఆఫ్ పై' చిత్రంగా చెప్పుకోవచ్చు. గత వందేళ్లలో చిత్ర పరిశ్రమలో పలువురు అద్బుతమైన ప్రతిభాపాటవాలతో భారతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చారు. అందులో సత్యజిత్ రే, రాజ్ కపూర్, బిమల్ రాయ్, గురుదత్, శ్యామ్ బెనెగల్, బల్ రాజ్ సహానీ, ఆదూర్ గోపాలకృష్ణన్, శేఖర్ కపూర్ లను ప్రముఖంగా చెప్పుకోవచ్చు . ఈ సందర్భంగా వందేళ్ల సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి.... 

Friday, April 26, 2013

'షాడో' చిత్ర సమీక్ష


'షాడో' చిత్ర సమీక్ష          2/5

యు స్క్వేర్ మూవీస్ పతాకం ఫై మెహర్ రమేష్ దర్శకత్వంలో పరుచూరి శివరామప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు . 
 
మన దేశం లో బాంబ్ పేలుళ్లకు కుట్ర చేస్తున్న అంతర్జాతీయ మాఫియా డాన్ నానా భాయ్ రహస్యాలను తెలుసుకున్న రహస్య జర్నలిస్ట్ రఘురాం వాటిని ప్రచురించాలనే ప్రయత్నం లో ప్రాణాలు కోల్పోతాడు . ఆ కిరాతకాన్ని కళ్ళారా చూసిన రఘురాం కొడుకు రాజారాం  పగబట్టి 'షాడో' పేరుతో వారిని వరుసగా చంపుతుంటాడు  . అదే సమయంలో నానా భాయ్ ని పట్టుకోవడానికి  స్పెషల్ పొలీస్ అధికారి ప్రతాప్ మలేషియా వస్తాడు . తనకన్నా ముందే నానా భాయ్ గ్యాంగ్ ని హతమారుస్తున్న షాడో ను పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు . ఒక సారి నానా భాయ్ మనుషులతో జరిగిన ఘర్షణలో మతి స్థిమితాన్ని కోల్పోయిన షాడో, తిరిగి కోలుకునే క్రమం లో చిన్న నాడు తప్పిపోయిన తల్లి,చెల్లి బతికే వున్నారని ... ప్రతాప్ తన చెల్లి భర్త అని తెలుసుకుంటాడు . కుటుంబాన్ని రక్షించుకుంటూనే నానా భాయ్ ని చంపి పగ తీర్చుకోవడం ఈ చిత్ర కధాంశం . 

ఈ సినిమాతో మరోసారి ఒక సన్నాసి దర్శకుడి వల్ల  ఓ మంచి నిర్మాత దెబ్బ తినిపోయాడు . ఫోజులెక్కువ ...విషయం తక్కువ తో బతికేసే గారడీ గాళ్ళ మాయలో ఈ నిర్మాతలు ఎలా పడతారో అర్ధం కాదు . తెలుగులో దశాబ్దాల నుండీ చూస్తున్న పగ-ప్రతీకారం కధ , రొటీన్ ఫ్యామిలీ  సెంటిమెంట్ , అరిగి పోయిన యాక్షన్ సన్నివేశాలతో నిర్మించిన ఈ చెత్త చిత్రానికి నిర్మాత ఎంతో భారీ గా ఖర్చు చేసారు . థియేటర్ లోకి వెళ్ళిన జనమంతా  సినిమా చూసి వడ దెబ్బ తగిలినట్లు గిల గిల్లాడుతున్నారు . ఎక్కడా మనకు కొత్తదనం మచ్చుకైనా కనిపించదు .  అసలీ దర్శకుడికి కనీస సినిమా పరిజ్ఞానమైనా  ఉందా ? -అనిపిస్తుంది .  బాధ్యత లేకుండా, నిర్మాత  డబ్బును దుర్వినియోగం చేస్తూ-  పిల్లలాటలా ఈ సినిమాని చేసాడు . గబ్బర్ సింగ్ లో హై లైట్ అయిన 'అంత్యాక్షరి' ని ఇందులోనూ పెట్టి...  అనుకరించడం కూడా రాదని  చూపించు కున్నాడు.  

రాజారాం గా ,షాడో గా వెంకటేష్ బాగా చేసాడు . అయితే విషయం లేని సినిమాలో కష్టానికి ఫలితముండదు . సినిమా ప్రారంభం లో వెంకటేష్ షాడో గెటప్ కొంత ఎబ్బెట్టుగా వుంది .తాప్సీ అందం గా నటించింది .  పొలీస్ అధికారి ప్రతాప్ గా శ్రీకాంత్ చురుగ్గానే చేసాడు . సైకో శీను గా ఎమ్మెస్ నారాయణ చాలా పెద్ద పాత్ర పోషించినా అతని కామెడీ అంతంతమాత్రం గానే వుంది . కృష్ణ భగవాన్ కొంత పర్వాలేదు . హిందీ నటుడు ఆదిత్య పంచోలి ఇందులో మాఫియా డాన్ నానా భాయ్ గా నటించాడు . 
నాగేంద్ర బాబు,గీత,మధురిమ,నాగి నీడు,జయప్రకాశ్ రెడ్డి,సయ్యాజి షిండే, రాహుల్ దేవ్, నాజర్ , సూర్య, ఉత్తేజ్,సత్యం రాజేష్,రమ్య, సుబ్బరాజు, శ్రీనివాస్ రెడ్డి ,ధర్మవరపు, సుమన్, వెన్నెల కిషోర్ ఇతర పాత్రలు పోషించారు . 

కోన వెంకట్ – మెహర్ రమేష్ కలిసి రాసిన డైలాగ్స్ మరీ చప్పగా వున్నాయి . తమన్ పాటల్లో 'షాడో టైటిల్ సాంగ్' బాగుంది .పాటల చిత్రీకరణ బాగుంది .  రీ రికార్డింగ్ కూడా సినిమాకి న్యాయం చెయ్యలేదు .  మూరెళ్ళ శ్రీను-శ్యాం కె నాయుడు ల ఫోటోగ్రఫీ,  వెంకటేష్ ఎడిటింగ్, స్టన్ శివ ఫైట్స్  అంతంత మాత్రంగానే వున్నాయి                    -రాజేష్ 

Wednesday, April 24, 2013

మెరిల్ నాకు ఆదర్శం:శ్రీదేవి

'ఇంగ్లిష్ వింగ్లిష్‌'తో హిట్ కొట్టి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన అందాలతార శ్రీదేవి తనకు హాలీవుడ్ నటి మెరిల్‌స్ట్రీప్ ఆదర్శమంటోంది. తన అద్భుత నటనతో మెరిల్ పలుసార్లు ఆస్కార్ అవార్డుకు ఎంపియింది. ‘నేను ఆమెకు పెద్ద అభిమానిని. ప్రణాళికలు గీసుకొని నేను నా కెరీర్‌ను నిర్మించుకోలేదు. నాకు నప్పుతాయనుకున్న సినిమాలే చేశాను. అవకాశాలు వస్తే మెరిల్‌స్ట్రీప్ మాదిరిగా...

మూడు భాషల్లోనూ నటిస్తా!:కొంకణాసేన్

పాత్ర నచ్చితే ఏ భాషాచిత్రమనే విషయాన్ని తాను పెద్దగా పట్టించుకోనని, బెంగాలీ, హిందీ, ఇంగ్లిష్.. ఏ భాషాచిత్రమైనా నటించేందుకు అంగీకరిస్తానని చెబుతోంది నటి కొంకణాసేన్. తల్లి అపర్ణా సేన్ నుంచి నటనను వారసత్వంగా అంది పుచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ విమర్శకుల ప్రశంసలందుకునే ఎన్నో చిత్రాల్లో నటిం చింది. బెంగాలీ చిత్రం ‘ఏక్ జె అచ్చే కన్యా’తో తన నటప్రస్థానాన్ని ప్రారంభించిన కొంకణాసేన్ ఆ తర్వాత....

అక్రంతో స్నేహం మాత్రమే!:సుస్మితా సేన్


క్రికెటర్లకు, సినీతారలు, మోడల్స్కు మధ్య సంబంధాలు ఇప్పటివి కావు. గతంలో క్రికెటర్లతో ప్రేమాయణం, పెళ్లిళ్లు, పెటాకుల సంఘటనలు చాలానే ఉన్నాయి. క్రికెటర్లతో సినీ తారల సంబంధాలను చెప్పుకోవాల్సి వస్తే.. షర్మిల టాగోర్-మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడీ, రీనారాయ్-మోహిసిన్ ఖాన్, జీనత్ ఆమన్-ఇమ్రాన్ ఖాన్, నీనా గుప్తా-వివియన్ రిచర్డ్స్, సంగీతా బిజ్లానీ-అజరుద్దీన్, కిమ్ శర్మ-యువరాజ్ సింగ్, దీపికా పదుకోనే-మహేంద్ర సింగ్ ధోని, దీపికా పడుకోనే-యువరాజ్ సింగ్, గీతా బస్రా-హర్భజన్ సింగ్, ఇష్రా శర్వానీ-జహీర్ ఖాన్, ఎలిజబెత్ హార్లీ-షేన్ వార్న్ ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి కోవలనే మాజీ మిస్ యూనివ‌ర్స్ సుస్మితా సేన్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వ‌సీం అక్రంల మధ్య వ్యవహారం నడుస్తోందని....

Sunday, April 14, 2013

సిద్ధార్థ్ ఇక దర్శకత్వం వేపు...

మెగా ఫోన్ పట్టాలనే కోరిక ఉందంటున్నారు యువ నటుడు సిద్ధార్థ్. నటుడిగా తెరంగేట్రం చేసి దశాబ్దం దాటినా ఇంకా యంగ్ బాయ్ ఇమేజ్‌ను కాపాడుకుంటున్న సిద్ధార్థ్ తొలుత తమిళంలో హీరోగా పరిచయమైనా, ఆ తరువాత తెలుగు, హిందీ తదితర భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటుడిగా పేరు పొందారు. ఇటీవల విడుదలైన హిందీ చిత్రం' చష్మే బద్దూర్' విజయానందాన్ని అనుభవిస్తున్న ఆయన.....