RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Thursday, November 10, 2011

‘యువకళావాహిని’ వైకే కొత్త ఆలోచన

ఏ సినిమాకు వెళ్దాం? అనే ప్రశ్నతో ‘ఎవరు తీశారు’ అనే ఆలోచనా వస్తుంది. ఏ కల్చరల్ ఈవెంట్‌కు వెళ్దాం? అనే ప్రశ్నకు ‘ఎవరు నిర్వహిస్తున్నారు’ అనే ఆలోచనా సహజం. ‘యువకళావాహిని’ నిర్వహించే కార్యక్రమాలు కళాభిమానులను ఇట్టే ఆకర్షిస్తాయి. దీని వెనుక మూడున్నర దశాబ్దాల కృషి ఉంది. వ్యవస్థాపక అధ్యక్షుడు, నటుడు, దర్శకుడు యార్లగడ్డ కృష్ణ నాగేశ్వరరావు (వైకే) శ్రమా ఉంది. ఇటీవలే సంస్థ పక్షాన....

టికెట్ల ధరలను 35నుంచి 100వరకు పెంచుకుంటారట

డబ్బింగ్ చిత్రాలను నియంత్రించి, చిన్న చిత్రాలను బతికించాలనే ఉద్దేశంతో ఫిల్మ్ చాంబర్ ఏర్పాటుచేసిన సబ్ కమిటీ కొన్ని నిర్ణయాల్ని సూచించిన సంగతి తెలిసిందే. వాటితో పాటు సినిమా నిర్మాణానికి అయిన బడ్జెట్‌ని బట్టి టికెట్ల ధరలను రూ. 35 నుంచి రూ. 100 వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని కోరాలని కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు చాంబర్ అధ్యక్షుడు డి. సురేశ్‌బాబు తెలిపారు. గతంలో భారీ సినిమాలు విడుదలైనప్పుడు తొలి రెండు వారాల్లో పైతరగతి టికెట్ల ధరల్ని 75 శాతం పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. చిన్న నిర్మాతలు, ప్రేక్షకుల నుంచి కూడా నిరసనలు వ్యక్తం కావడంతో ఆ పద్ధతిని తీసేసి...

Tuesday, November 8, 2011

గ్లామర్ వున్నంత కాలం మాత్రమే రాణించగలం:కరీనా

‘బాడీగార్డ్’, ‘రా.వన్’ చిత్రాలతో బాలీవుడ్ కథానాయికల్లో నెంబర్‌వన్ అనిపించుకున్న కరీనా ప్రస్తుతం ఐశ్వర్యారాయ్ నటించాల్సిన ‘హీరోయిన్’ చిత్రంలో నటిస్తూ అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. సినీ రంగం గురించి ఈ మధ్య ఓ సందర్భంలో కరీనా కపూర్ మాట్లాడుతూ- ‘ ఇది గ్లామర్ ప్రపంచం. ఇందులో గ్లామర్ వున్నంత కాలం మాత్రమే రాణించగలం. వయసు మీదపడ్డాక కూడా నటించాలన్న కోరిక నాకు లేదు. నాకు తెలిసి ఇంకో ఐదారేళ్ళు మాత్రమే ....

Monday, November 7, 2011

నన్ను మించిన అందగత్తె అమ్మ:త్రిష

నేను పదవ తరగతి చదువుతుండగానే మోడలింగ్‌లోకి వెళతానని అమ్మతో చెప్పాను. నా ఆసక్తిని తెలుసుకున్న అమ్మ మోడలింగ్ రంగానికి చెందిన తార వద్దకు తీసుకెళ్లింది. ఆమెకు అప్పుడు ప్రసాద్ స్టూడియోలో ఒక సోప్ యాడ్ కోసం స్క్రీన్ టెస్ట్ చేస్తున్నారు. ముంబయి, బెంగళూరుకు చెందిన చాలా మంది మోడల్స్ ఆ టెస్ట్‌లో పాల్గొన్నారు. తార నాకు కొన్ని సంభాషణలు రాసి ఇచ్చి చెప్పమన్నారు. నేను ఎలాంటి తడబాటు లేకుండా చెప్పాను. దీంతో మోడల్‌గా ఎంపికయ్యాను. అనంతరం చెన్నైలో జరిగిన మిస్ చెన్నై పోటీల్లో పాల్గొని ....

Sunday, November 6, 2011

రివెర్స్ గేర్ లో జెనీలియా, హన్సిక

‘‘హన్సిక ఎనర్జీ నిజంగా సూపర్బ్. గులాబీరేకులా సుకుమారంగా... సుతిమెత్తగా కనిపించే తను... కెమెరా ముందుకెళ్లగానే చెలరేగిపోతుంది. తనకు అంత ఎనర్జీ ఎక్కడ్నుంచి వస్తుందో నాకు అర్థం కావడం లేదు’’... ఇటీవల ఓ ఇంటర్‌వ్యూలో హన్సికను ఉద్దేశించి జెనీలియా అన్న మాటలివి.వీరిద్దరూ తమిళంలో విజయ్‌కు జోడీగా ‘వేలాయుధం’లో నటించారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా తమిళనాట విజయదుందుభి మ్రోగిస్తోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లో ...

కృష్ణ వంశీ మళ్ళీ ఫెయిల్... చతికిలపడ్డ 'రా.వన్'

Friday, November 4, 2011

వాళ్లతో నన్ను పోలుస్తున్నారు:అంజలి

‘‘సావిత్రి గొప్ప మహానటి అని ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం. ఆమె అంత కాకపోయినా... నా నటన గురించి కూడా కనీసం పదేళ్ల తర్వాత కూడా చెప్పుకోవాలి. అదే లక్ష్యంగా ముందుకు పోతున్నా’’ అంటున్నారు తెలుగమ్మాయి అంజలి. ఈ ముద్దుగుమ్మ తమిళంలో నటించిన ‘ఎంగేయుమ్ ఎప్పోదుం’ చిత్రం ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. ఈ సందర్భంగా అంజలి పై విధంగా స్పందించారు. ‘‘డెరైక్టర్ శరవణన్ ఈ కథ చెప్పగానే కాసేపు అదే ట్రాన్స్‌లో .....