RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Saturday, February 9, 2013

హీరోలతో ఫ్రెండ్లీగా ఉంటా! -లక్ష్మీరాయ్

తాను నటించిన హీరోలతో ఫ్రెండ్లీగా ఉంటానని పేర్కొన్నారు నటి లక్ష్మీరాయ్. ఈ బ్యూటీ ఎప్పుడూ ఏదో ఒక సంఘటనతో చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తూ ఉంటుంది. క్రికెట్ క్రీడాకారుడు ధోని నుంచి శ్రీశాంత్ వరకు పలువురితో సన్నిహితంగా మెలుగుతూ సంచలన వ్యాఖ్యలతో హాట్ గ ర్ల్‌గా పేరు తెచ్చుకున్నారు. మధ్యలో కాస్త సెలైంట్ అయినా మళ్లీ వార్తల్లోకెక్కారు. ఈ నేపథ్యంలో....

                                            'మిర్చి' చిత్ర సమీక్ష          3/5
యు.వి.క్రియేషన్స్ పతాకం ఫై కొరటాల శివ దర్శకత్వం లో వంశీ  కృష్ణ రెడ్డి,ఉప్పలపాటి ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ప్రభాస్‌, అనుష్క, రిచా వంటి తారాగణం తో రచయితగా సుపరిచితుడైన కొరటాల శివ దర్శకుడిగా మారి చేసిన ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో  ఉత్సుకత వుంది . కథ కొత్తదేమీకాదు.. ట్రీట్‌మెంట్‌ వెరైటీ అనిచెబుతున్న ఈ దర్శకునికి శ్రీశ్రీ కవితలంటే ఎనలేని అభిమానం. 'పోరాడితే పోయేదేముంది.. బానిన సంకెళ్ళు తప్ప...' అనే అంశాన్ని స్పూర్తిగా తీసుకుని.... 'వీలైతే ప్రేమిద్దాం. పోయేదేముంది. మళ్ళీ వాళ్లే ప్రేమిస్తారని.. 'రాసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
 జై (ప్రభాస్‌) ఇటలీలో ఆర్కెటెక్చర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. సరదాగా జీవితాన్ని గడిపేస్తున్న అతడు ఎం.ఎస్‌. చదివే మానస (రిచా) ప్రేమలో పడతాడు. ఆ టైమ్‌లో తన ఫ్యాక్షన్‌ కుటుంబం గురించి తెలియజేస్తుంది. తరువాత సీన్‌లో జై ఇండియాలో ఓ కాలేజీలో జాయిన్‌ అవుతాడు. అక్కడ స్టూడెండ్‌గా ఉండే రౌడీ పూర్ణ (సుబ్బరాజు)తో స్నేహాన్ని పెంచుకొని అతనికి దగ్గరవుతాడు. జై వేసిన ప్లాన్‌తో పూర్ణ మంచివాడిగా మారిపోతాడు. ఆ తర్వాత సెలవులకు తన ఊరికి తీసుకెళ్ళి తన ఇంటివారినందరినీ జైని పరిచయం చేస్తాడు పూర్ణ. అతని నాన్న నాగినీడు, బాబారు ఉమ (సుప్రీత్‌రాజ్‌) పక్కనే ఉన్న రెంటచింతల గ్రామంలోని ఊరిపెద్ద తమ ప్రత్యర్థి అయిన దేవ (సత్యరాజ్‌)పై ఇంకా పగతో రగిలిపోతుంటారు. మీకు ఇప్పటికే అర్థమై వుంటుంది కదా... జై.. పూర్ణను మార్చినట్లే... అందరినీ మార్చి ప్రేమతో తనవైపుకు ఎలా తిప్పుకున్నాడు. తన తండ్రి అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేసి చూపాడు? అన్నది పాయింట్‌. ఇందులో అనుష్క ఫ్లాప్‌బ్యాక్‌లో తన మామ కూతురుగా కన్పిస్తుంది. చివరికి ఎవర్ని పెళ్ళి చేసుకున్నాడనేది సినిమాలో చూడాలి...
పాత్రపరంగా జై పాత్రలో ప్రభాస్‌ ఇమిడిపోయాడు. ఎన్నో మాస్‌ చిత్రాలు చేసిన ప్రభాస్‌ ఈ చిత్రంలో నిగ్రహంగా చేయాల్సివచ్చింది. రెండు కోణాలున్న ఈ పాత్రలో అవసరమైనచోట రుద్రుడులానూ, శాంతమూర్తిలానూ నటించాడు. బాంక్‌మేనేజర్‌ బ్రహ్మానందంతోపాటు మానస కుటుంబంతో చేసిన కామెడీ సన్నివేశాలు, రొమాన్స్‌, యాక్షన్‌ సరదా సరదాగా అనిపిస్తాయి.
ప్లాష్‌బ్యాక్‌లో వచ్చే అనుష్క పాత్ర గ్రామీణ యువతి. ఆమెపై చిత్రించిన 'ఇదేదో బాగుందే.. డార్లింగ్‌' పక్కామాస్‌ సాంగ్స్‌ పర్వాలేదు. దేవీశ్రీప్రసాద్‌ బాణీల్లో బాగున్నవవే. ఇక కథంతా రిచాగంగోపాథ్య ఫ్యామిలీ చుట్టే తిరుగుతుంది. రచయితగా 'భద్ర', 'బృందావనం' వంటి కథలు రాసిన కొరటాల శివ అదే తరహాలో రాసుకున్నకథే. స్క్రీన్‌ప్లేలో కొత్తదనాన్ని చూపి.. మాస్‌ ఎలిమెంట్లతో కథను నడిపించేశాడు. ద్వితీయార్థంలో తల్లి, తండ్రి, కొడుకుమధ్య వచ్చే సన్నివేశాలకు గమనంలో స్పీడ్‌వల్ల రొటీన్‌ అనేది పెద్దగా అనిపించదు. సత్యరాజ్‌ పాత్ర నీట్‌గా, అందరూ బాగుండాలని కోరుకునే హుందాయైన పాత్ర. నదియా ఆయన భార్యగా నటించింది. సంపత్‌రాజ్‌, ఆదిత్యమీనన్‌, నాగినీడు, బెనర్జీ, సప్రీత్‌, హేమ, రఘుబాబు...పాత్రలు కథప్రకారమే ఉన్నాయి. బ్రహ్మానందం బ్యాంక్‌ మేనేజర్‌గా, వీరప్రతాప్‌గా నటించి హాస్యం కోసం ట్రై చేశాడు.
కథ ఎలా ఉంది అనేదికాకుండా కథనాన్ని నడపడంలో పాత చిత్రాల్ని మరిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. లాజిక్కులకు అందని యాక్షన్‌ సన్నివేశాలు, హఠాత్తుగా హీరో ప్రత్యక్షం కావడం, కరడుగట్టిన ప్రతీకారంతో రగిలిపోయిన వారిని ఒక్కసారిగా మార్చడమనే సన్నివేశాలు సినిమాటిక్‌గా ఉన్నాయి. 'శంఖం', 'దమ్ము', 'బిందాస్‌', 'బృందావనం' వంటి చిత్రాలు గుర్తుకువస్తాయి. 'బృందావనం'లో రెండు కుటుంబాల్లో అన్నదమ్ముల గొడవ గ్రామాల గొడవైతే... 'మిర్చి'లో రెండు గ్రామాల్లోని రెండు కుటుంబాల గొడవ. మొత్తంమీద మాస్‌ చిత్రంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు సగం వరకు సక్సెస్‌ అయ్యారు.                                                    -రవళి                                                                                                                                                                 

Monday, February 4, 2013

బాలీవుడ్‌లోకి ‘డ్యాన్స్’ విజేత లారెన్

దురికి మోహన్ రావు ప్రపంచ రికార్డ్

వెండితెరపై మగువలు తాగి తందనాలు

మీనాకుమారి నుంచి దీపిక వరకూ... బిపాసా నుంచి నిన్నమొన్నటి ఎలీనా వరకూ... ఎందరో తారామణులు తాగుడుకు ఎందుకు బానిసయ్యారు. అది తెరపైనేనా? తెర వెనుక కూడానా? ఇలా ఎన్నో సందేహాలు జనాన్ని పట్టి పీడిస్తుంటాయి. అయితే వెండితెరపై మగువ తాగి తందనాలాడడం అనేది హాలీవుడ్‌లో మొదలైంది. తర్వాత ఆ సంస్కృతి బాలీవుడ్‌కి పాకింది. అక్కడ తొలిగా అందాల నటి, ధీశాలి మీనాకుమారి పెగ్గు వేసి సిగరెట్‌ వెలిగించిన ఘనత...

కేబుల్ టీవీ ప్రసారాల డిజిటైజేషన్‌

పరిమిత చానెళ్లు. నాణ్యత లేని ప్రసారాలు. ఇదీ ప్రస్తుత కేబుల్ టీవీ సేవల స్థితి. కేబుల్ ఆపరేటర్ ప్రసారం చేసే చానెళ్లను మాత్రమే, అది కూడా కొన్నింటినే మంచి నాణ్యతతో చూసే వీలుంది. గత 22 ఏళ్లుగా సామాన్యుడు భరిస్తూ వస్తున్న అనలాగ్ టెక్నాలజీ. ఇక నుంచి ఈ సమస్యలేవీ ఉండవు. డిజిటల్ ప్రసారాలతో కనీసం 500 చానెళ్లు. అదీ అత్యంత నాణ్యవంతంగా. రూ. 150కి మించని పే చానెళ్ల ప్యాకేజీ. రూ.100కే 100 ఫ్రీ చానెళ్లు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా....

Friday, February 1, 2013

'ఒంగోలు గిత్త' చిత్ర సమీక్ష


                                       'ఒంగోలు గిత్త' చిత్ర సమీక్ష           2/5

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం ఫై 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం లో బి.వి.యస్.యన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.


చిన్నప్పుడే ఒంగోలు మిర్చి యార్డ్ లోకి వచ్చిన  అనాధ, క్రమంగా వైట్ పేరుతో మిర్చి వర్తకుడిగా ...అందరికీ  తలలో నాలుకలా మారుతాడు. మిర్చి యార్డ్ చైర్మన్ ఆదికేశవులు దృష్టిలో సమర్ధుడనిపించుకుంటాడు. ఒక సందర్భంలో -ఆదికేశవులు కూతుర్ని తనకిచ్చి పెళ్లి చెయ్యడానికి ఒప్పించి, నిశ్చితార్ధం కూడా కానిస్తాడు. బయటికి ఎంతో గొప్పవాడిగా కనిపించే ఆదికేశవులు అసలు రూపం మరొకటి వుంటుంది. మిర్చి యార్డ్ ను మరో చోటికి తరలించాలని , ఎమ్మెల్యే తో కలిసి అతడు చేసే కుట్రను వైట్ అడ్డుకుంటాడు.ఆదికేశవులు అసలు రూపాన్ని బైటికి తేవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడు.ఇంతకీ ఈ వైట్ ఎవరు? మిర్చి యార్డ్ లో అతను ఏ ప్రయోజనం ఆశిస్తున్నాడు?చివరికి ఆదికేశవులు  గోముఖాన్ని ఎలా తొలిగించాడనేది సినిమాలో చూడాలి ...

'బొమ్మరిల్లు' తో గొప్పపేరు,'పరుగు'తో మంచిపేరు తెచ్చుకున్న భాస్కర్,ఆ తర్వాత  'ఆరెంజ్' పేరుతో పూర్తిగా విదేశాల్లో అర్ధంలేని ఓ 'ఆధునిక' చిత్రాన్ని విపరీత  ఖర్చుతో తీసి,  నిర్మాత  నాగబాబు కొంప ముంచాడు. ఇప్పుడు, తన ధోరణికి పూర్తి భిన్నంగా, పక్కా కమర్షియల్ పంధాలో ఈ చిత్రాన్ని చేసాడు.  అయితే ,అసలు అతనికి 'పక్కా కమర్షియల్ పంధా' అంటే ఏంటో తెలియక పోవడం వల్ల ...తనకు తోచిందేదో చేసేసి మరో పెద్ద పరాజయాన్ని ఇచ్చాడు . పరమ రొటీన్ కధతో, అర్ధం లేని  స్క్రీన్ ప్లేతో చేసిన ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు నాసిరకం  టేకింగ్ వల్ల  పండలేదు. సినిమా చూస్తున్న  ప్రేక్షకుడు ఎన్నో సార్లు తీవ్ర అసహనానికి గురవు తాడు. దీనికి తోడు- భాస్కర్ మాస్ మసాలా అంతా అరవ వాసన తో వెగటు పుట్టించింది. సినిమాలో పాటలు మరో పెద్ద మైనస్. అసందర్భం అయినా,జానపద గాయకులతో పాట పెట్టడం అభినందనీయం. కొత్తగా మిర్చి యార్డ్ (గుంటూరు) నేపధ్యంలో చెయ్యడం కూడా బాగుంది.  ఈ చిత్రం లో ఒకే ఒక ప్లస్...ప్రకాష్ రాజ్ పాత్ర, అతని నటన. ఈ మధ్య రొటీన్ పాత్రలే చేస్తున్న ప్రకాష్ రాజ్ ఆదికేశవులు గా అధ్బుతంగా చేసాడు.అయితే ,అతని పాత్రను నగ్నంగా చూపాల్సిన అవసరం ఎంత మాత్రం కనిపించలేదు. మంచితనం ముసుగేసుకునే ఆదికేశవులు కేరెక్టర్ రూపకల్పనలోనూ... ఆదికేశవులు  ఆఫీసులో  "ప్రేమే దైవం...సేవే మార్గం" వంటి స్లోగన్స్ తో బోర్డులు పెట్టడంతోనూ దర్శకుడు ఎవరినో ద్దేశించాడనే సందేహం కలుగుతుంది.

'పిట్ట కొంచం,కూత ఘనం' అనిపించుకునే  రామ్, ఇందులోనూ వైట్ గా ఉత్సాహంతో, బాగా చేసాడు. సంధ్య గా కృతి కర్బంద అందంగా నటించింది. పావురం గా కిషోర్ దాస్ ఈ చిత్రం లో పెద్ద పాత్రను బాగా చేసాడు. అలీ కామెడీ ఇబ్బంది పెట్టింది. తిక్కవరం వాత్సవ్యుడుగా రఘుబాబు తిక్క పాత్ర పర్వాలేదు.రామ్ తండ్రిగా ప్రభు పాత్రోచితంగా నటించాడు. ఇతర పాత్రల్లో రమాప్రభ, ఆహుతి ప్రసాద్, అభిమన్యు సింగ్, అజయ్, జయలక్ష్మి, రాజేంద్ర, జయప్రకాశ్ రెడ్డి చేసారు. మణిశర్మ రీ రికార్డింగ్ ,వెంకటేష్ ఫోటోగ్రఫీ బాగుంది. సురేంద్ర క్రిష్ణ సంభాషణలు అంతంత  మాత్రంగానే వున్నాయి.                                                                                                    -రాజేష్