RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, October 25, 2013

' భాయ్' చిత్ర సమీక్ష

                                       ' భాయ్' చిత్ర సమీక్ష 2.25 /5




రిలయన్స్ సమర్పణ లో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం ఫై వీరభద్రం దర్శకత్వం లో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు . 

             పలుదేశాల్లో తన సామ్రాజ్యాన్ని విస్తరించిన హాంగ్ కాంగ్ డాన్ డేవిడ్ తన కొడుకులు టోనీ , జేమ్స్ కన్నా భాయ్ నే ఎక్కువగా నమ్ముతాడు . హైదరాబాద్ లో ఒక గుర్తు తెలియని పోలీస్ అధికారి తన ముఖ్య అనుచరులను చంపేస్తున్నాడని తెలిసి -భాయ్ ని అక్కడికి పంపుతాడు . తమ వారిని చంపుతున్న పోలీస్ అధికారిని గుర్తించిన భాయ్ కి - అతన్ని చంపాలనుకున్న  సమయం లో తెలుస్తుంది ... 'అతను తన తమ్ముడు అర్జున్' అని  . అదేసమయం లో తన చెల్లెలు కూడా కలుస్తుంది.  ఆమెకు దగ్గరుండి పెళ్లిచేసేందుకు  వెడ్డింగ్ ప్లానర్ గా మారి, అడ్డంకులను తొలగించి  పెళ్లి జరిపిస్తాడు . అర్జున్ చేతిలో తన పెద్ద కొడుకు టోనీ చనిపోవడం తో, చిన్న కొడుకు జేమ్స్ తో  కలిసి ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి డేవిడ్ హైదరాబాద్ వస్తాడు .వారి బారి  నుండి  భాయ్  తన  వారిని ఎలా కాపాడుకున్నాడు ? అసలు ఈ భాయ్ గతమేమిటి ?అనేది సినిమాలో చూడాలి ...

 .              రెండు హాస్యప్రధానమైన చిత్రాలతో విజయవంతమైన దర్శకుడు వీరభద్రం ఈ సారి యాక్షన్ ప్రధాన చిత్రం చెయ్యడం విశేషం . "ఈ కధను ఏడేళ్ళ క్రితమే నాగార్జున కోసం తయారు చేసా"నని ఓ ప్రెస్ మీట్ లో వీరభద్రం చెప్పారు . ఈ సినిమా చూస్తే అది నిజమే అనిపిస్తుంది .ఎప్పుడో తియ్యాల్సిన కధతో ఈ చిత్రం ఇప్పుడు తీసారనిపిస్తుంది  . ఇలాంటి కధతో ఈ మధ్య కాలం లో 'గబ్బర్ సింగ్' ,'షాడో' తో సహా ఎన్నో సినిమాలొచ్చాయి . సరే, పాత కధతోనే అయినా- ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీశారా? 'తీర్ధానికి తీర్ధం- ప్రసాదానికి ప్రసాదం' అన్నట్లు తలా తోకా లేని సన్నివేశాలను గుదిగుచ్చి సినిమాగా మార్చారు .కామెడీ స్పెషలిస్ట్ అయిన దర్శకుడు -ఈ చిత్రం లో బ్రహ్మానందం వంటి నటులున్నా  హాస్యాన్నిబాగా  పండించ లేకపోయాడు .  మంచి కమర్షియల్ చిత్రానికి కావాల్సిన అన్ని హంగులూ ఈ చిత్రానికి వున్నాఅందువల్లనే ఉపయోగం లేకుండా పోయింది .ఈ చిత్రం లో రత్నబాబు -సందీప్ రాసిన డైలాగ్స్ హైలైట్ . చాలా సన్నివేశాల్లో  పేలాయి .అయితే- ఏదన్నా మోతాదుకు మించితే ఇబ్బందే .ఇందులో అసందర్భ సంభాషణలు కూడా వినిపించాయి  .హీరో  మౌత్ ఆర్గన్ వాయించగానే చెల్లి 'అన్నయ్యా' అంటూ పరుగెత్తుకు రావడం- వంటి సిల్లీ సంగతులు  ఇందులో బోలెడు.  బిల్డప్ ఎక్కువ ఇచ్చిన  - హాంగ్ కాంగ్ డాన్ డేవిడ్ ని , పవర్ ఫుల్ పోలీస్ అధికారి అర్జున్ ని   సినిమా రెండవ భాగం లో డమ్మీలను చేసేసి సినిమాలో ఫోర్స్ ని చంపేశారు . 

             వయసు పెరుగుతున్నా నాగార్జున గ్లామర్ లో తరుగుదల లేదు . మూడు రకాల గెటప్స్ లో ఎంతో స్టైలిష్ గా, హుషారుగా చేసారు . తెలంగాణా  మాండలీకంలో మాట్లాడటం కూడా విశేషం . అయితే మాస్ యాక్షన్ సన్నివేశాల్లో మాత్రం అతను గతం లో  చేసిన చిత్రాలు గుర్తుకొస్తాయి . హీరోయిన్ కావాలి కాబట్టి రిచా ను పెట్టారు .పాటల్లో ఆమె అందం గానే వుంది . కామ్న ఒక్క సీన్ లో  ఎందుకు వుందో అర్ధం కాదు . చెల్లిగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్ జారా ఎంపిక కూడా కరెక్ట్ కాదు . ఆశిష్ విద్యార్ధి , సయ్యాజి షిండే, సోనూ సూద్ వంటి మంచి నటులను ఉపయోగించుకోలేక పోయారు . మందు మేన్షన్ రాజు గా ఎమ్మెస్ నారాయణ పాత్ర ...'రూలర్' అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించడం బాగుంది . ఎన్నారై  విక్రం డోనర్ గా బ్రహ్మానందం పాత్ర  పర్వాలేదు.అతను అమీర్ పేట...అంబర్ పేటల మధ్య కన్ఫ్యూజ్  కావడం తమాషాగా వుంది . తమ్ముడు అర్జున్ గా స్నేహ భర్త ప్రసన్న ,ఇతర పాత్రల్లో నాగి నీడు , నర్సింగ్ యాదవ్, అజయ్ , పరుచూరి వెంకటేశ్వర రావు , జయప్రకాశ్ రెడ్డి ,రఘుబాబు , సత్యం రాజేష్ , వెన్నెల కిషోర్  తదితరులు నటించారు . కనువిందు కోసం ఒక పాటలో నటాలియా కౌర్ , మరో పాటలో హంసా  నందిని  కనిపించారు . దేవిశ్రీ ప్రసాద్ స్థాయి లో పాటలు లేవు కానీ, 'ఓకే' అనిపిస్తాయి . పాటల చిత్రీకరణ బాగుంది .రీ రికార్డింగ్ కూడా పర్వాలేదు .  సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ బాగుంది                        -రాజేష్ 

0 comments:

Post a Comment