Sunday, April 28, 2013
భారతీయ సినిమా వందేళ్ల వేడుక ప్రారంభం
Friday, April 26, 2013
'షాడో' చిత్ర సమీక్ష
'షాడో' చిత్ర సమీక్ష 2/5
మన దేశం లో బాంబ్ పేలుళ్లకు కుట్ర చేస్తున్న అంతర్జాతీయ మాఫియా డాన్ నానా భాయ్ రహస్యాలను తెలుసుకున్న రహస్య జర్నలిస్ట్ రఘురాం వాటిని ప్రచురించాలనే ప్రయత్నం లో ప్రాణాలు కోల్పోతాడు . ఆ కిరాతకాన్ని కళ్ళారా చూసిన రఘురాం కొడుకు రాజారాం పగబట్టి 'షాడో' పేరుతో వారిని వరుసగా చంపుతుంటాడు . అదే సమయంలో నానా భాయ్ ని పట్టుకోవడానికి స్పెషల్ పొలీస్ అధికారి ప్రతాప్ మలేషియా వస్తాడు . తనకన్నా ముందే నానా భాయ్ గ్యాంగ్ ని హతమారుస్తున్న షాడో ను పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు . ఒక సారి నానా భాయ్ మనుషులతో జరిగిన ఘర్షణలో మతి స్థిమితాన్ని కోల్పోయిన షాడో, తిరిగి కోలుకునే క్రమం లో చిన్న నాడు తప్పిపోయిన తల్లి,చెల్లి బతికే వున్నారని ... ప్రతాప్ తన చెల్లి భర్త అని తెలుసుకుంటాడు . కుటుంబాన్ని రక్షించుకుంటూనే నానా భాయ్ ని చంపి పగ తీర్చుకోవడం ఈ చిత్ర కధాంశం .
ఈ సినిమాతో మరోసారి ఒక సన్నాసి దర్శకుడి వల్ల ఓ మంచి నిర్మాత దెబ్బ తినిపోయాడు . ఫోజులెక్కువ ...విషయం తక్కువ తో బతికేసే గారడీ గాళ్ళ మాయలో ఈ నిర్మాతలు ఎలా పడతారో అర్ధం కాదు . తెలుగులో దశాబ్దాల నుండీ చూస్తున్న పగ-ప్రతీకారం కధ , రొటీన్ ఫ్యామిలీ సెంటిమెంట్ , అరిగి పోయిన యాక్షన్ సన్నివేశాలతో నిర్మించిన ఈ చెత్త చిత్రానికి నిర్మాత ఎంతో భారీ గా ఖర్చు చేసారు . థియేటర్ లోకి వెళ్ళిన జనమంతా సినిమా చూసి వడ దెబ్బ తగిలినట్లు గిల గిల్లాడుతున్నారు . ఎక్కడా మనకు కొత్తదనం మచ్చుకైనా కనిపించదు . అసలీ దర్శకుడికి కనీస సినిమా పరిజ్ఞానమైనా ఉందా ? -అనిపిస్తుంది . బాధ్యత లేకుండా, నిర్మాత డబ్బును దుర్వినియోగం చేస్తూ- పిల్లలాటలా ఈ సినిమాని చేసాడు . గబ్బర్ సింగ్ లో హై లైట్ అయిన 'అంత్యాక్షరి' ని ఇందులోనూ పెట్టి... అనుకరించడం కూడా రాదని చూపించు కున్నాడు.
రాజారాం గా ,షాడో గా వెంకటేష్ బాగా చేసాడు . అయితే విషయం లేని సినిమాలో కష్టానికి ఫలితముండదు . సినిమా ప్రారంభం లో వెంకటేష్ షాడో గెటప్ కొంత ఎబ్బెట్టుగా వుంది .తాప్సీ అందం గా నటించింది . పొలీస్ అధికారి ప్రతాప్ గా శ్రీకాంత్ చురుగ్గానే చేసాడు . సైకో శీను గా ఎమ్మెస్ నారాయణ చాలా పెద్ద పాత్ర పోషించినా అతని కామెడీ అంతంతమాత్రం గానే వుంది . కృష్ణ భగవాన్ కొంత పర్వాలేదు . హిందీ నటుడు ఆదిత్య పంచోలి ఇందులో మాఫియా డాన్ నానా భాయ్ గా నటించాడు .
నాగేంద్ర బాబు,గీత,మధురిమ,నాగి నీడు,జయప్రకాశ్ రెడ్డి,సయ్యాజి షిండే, రాహుల్ దేవ్, నాజర్ , సూర్య, ఉత్తేజ్,సత్యం రాజేష్,రమ్య, సుబ్బరాజు, శ్రీనివాస్ రెడ్డి ,ధర్మవరపు, సుమన్, వెన్నెల కిషోర్ ఇతర పాత్రలు పోషించారు .
కోన వెంకట్ – మెహర్ రమేష్ కలిసి రాసిన డైలాగ్స్ మరీ చప్పగా వున్నాయి . తమన్ పాటల్లో 'షాడో టైటిల్ సాంగ్' బాగుంది .పాటల చిత్రీకరణ బాగుంది . రీ రికార్డింగ్ కూడా సినిమాకి న్యాయం చెయ్యలేదు . మూరెళ్ళ శ్రీను-శ్యాం కె నాయుడు ల ఫోటోగ్రఫీ, వెంకటేష్ ఎడిటింగ్, స్టన్ శివ ఫైట్స్ అంతంత మాత్రంగానే వున్నాయి -రాజేష్
Wednesday, April 24, 2013
మెరిల్ నాకు ఆదర్శం:శ్రీదేవి
మూడు భాషల్లోనూ నటిస్తా!:కొంకణాసేన్
అక్రంతో స్నేహం మాత్రమే!:సుస్మితా సేన్
Sunday, April 14, 2013
సిద్ధార్థ్ ఇక దర్శకత్వం వేపు...
ఆ సంబంధాలు పెట్టుకోను!-సనాఖాన్
Friday, April 5, 2013
'బాద్ షా' చిత్ర సమీక్ష
'బాద్ షా' చిత్ర సమీక్ష 2.5 / 5
పరమేశ్వర పతాకం ఫై శ్రీను వైట్ల దర్శ కత్వం లో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించాడు .
శ్రీను వైట్ల సమర్ధుడైన దర్శకుడు . సినిమా విజయానికి హీరో ని నమ్ముకోవడం కన్నా కామెడీని నమ్ముకోవడం ఉత్తమం అనే సూత్రాన్ని ఇటీవల తన భారీ చిత్రాల్లో ప్రయోగించి, మంచి విజయాలు సాధించారు . శ్రీను ఆ మధ్య పూరీ 'పోకిరి' ని అనుసరిస్తూ 'దూకుడు' చేసాడు . ఇప్పుడు దాదాపుగా అదే చిత్రాన్ని తిరిగి యన్టీ ఆర్ తో 'బాద్ షా' గా చేసాడు . అందుచేత ఈ చిత్రం కధ గురించి ప్రత్యేకం గా చెప్పడానికి ఏమీ లేదు . ఈ చిత్రంలో భారీ నిర్మాణ విలువలున్నాయి .కోన వెంకట్ సంభాషణలు , గుహన్ ఫోటోగ్రఫీ,వర్మ ఎడిటింగ్ ,విజయ్ యాక్షన్ ,ప్రకాష్ ఆర్ట్ ,తమన్ సంగీతం బాగున్నాయి . అయితే సినిమాలొ కొత్తదనం మాత్రం కొరవడింది .మాఫియా ను మట్టు పెట్టడానికి మారు వేషం లో పోలీసులు ప్రయత్నించే ఈ కధ లో,కధనం లో స్పష్టత లేదు . చాలా చోట్ల గందర గోళానికి గురవుతాము . సినిమా ప్రారంభం నుండి హీరోయిన్ కాజల్ మాటల రొద.. .ఇంటర్వెల్ దగ్గరకొచ్చే కొద్దీ ఎడతెగని
యాక్షన్ హంగామా . రెండవ భాగం నుండీ తెలంగాణా యాస తో ఈవెంట్ మేనేజర్ గా బాద్ షా మరో రూపం లో హంగామా . నిజానికి ఇటువంటి సన్నివేశాల్లోనే దర్శకుడు శ్రీ ను వైట్ల- కధ లో విషయం లేకపోయినా,మంచి హాస్యాన్ని రాబట్టి... ప్రేక్షకులను మాయ చేస్తుంటాడు . అయితే ఇందులో అతను చేసిన ప్రయత్నం విఫలమయ్యింది . అక్కడక్కడ తప్ప కామిడీ రొటీన్ గా సాగింది . కలల్లో విహరిస్తాడంటూ బ్రహ్మానందంఫై భారీ ఆశలతో దర్శకుడు పెట్టిన కామెడి ట్రాక్ తుస్స్ మంది . మహేష్ బాబు కామెంటరీ ,అతిధి పాత్రలో సిద్ధార్ధ ,విలన్ పొలీస్ గా నవదీప్ ... ఇలా ఎన్ని అదనపు ఆకర్షణ లున్నా ఉపయోగ పడలేదు .దర్శకుడిగా శ్రీను వైట్ల సమర్ధత ఫైనే సందేహాన్ని కలిగించే చిత్రం ఇది .
కాజల్ , వెన్నెల కిషోర్ లతో హీరో చేసిన కొన్ని సీన్స్...మందు కొట్టిన ఆడాళ్ళతో యన్టీ ఆర్ పాటల సన్నివేశం ... ఇటలీ అందాలు బాగున్నాయి .బాద్షా గా యన్టీ ఆర్ బాగా నటించాడు . డాన్సులు ఫైట్లు బాగా చేసాడు . సీనియర్ యన్టీ ఆర్ ను కొన్ని చోట్ల బాగా అనుకరించాడు . రాబోయే రోజుల్లో రాజకీయ అవసరాలకోసం సీనియర్ యన్టీ ఆర్ వారసత్వాన్ని జూనియర్ వాడుకునే ప్రయత్నం చేసాడు . అయితే అతని గెటప్ కారణం గా గ్లామర్ గా కన్నా, ఇబ్బంది కరంగానే చాలా చోట్ల కనిపించాడు . జానకి గా కాజల్ అందం గా , బాగా చేసింది . రివెంజ్ నాగేశ్వర్ రావు పేరుతో రామ్ గోపాల్ వర్మ ను తలపించేలా ఎమ్మెస్ నారాయణ ఫై చేసిన కామెడి బాగుంది .పిల్లి పద్మనాభ సిన్హా గా బ్రహ్మానందం కామెడి అర్ధం పర్ధం లేకుండా చిరాకెత్తించింది . క్రమ శిక్షణకు మారు పేరైన పిల్లి వంశ పోలీస్ అధికారిగా నాజర్ నటన మరీ అతిగా వుంది . ఇతర పాత్రల్లో ప్రదీప్ రావత్ ,ఆశిష్ విద్యార్ధి , సయ్యాజీ షిండే , తని కెళ్ల భరణి , షఫీ , సుహాసిని , మోహన్ రుషి , సుప్రీత్ , సత్యం రాజేష్ ,నాగబాబు , చంద్ర మోహన్ , సుధా , ప్రగతి , సురేఖా వాణి, జయప్రకాశ్ రెడ్డి , అజయ్ , తగు బోతూ రమేష్, రవిప్రకాష్ , బ్రహ్మాజీ , గిరిధర్ , రజిత , భరత్ , రాజీవ్ కనకాల నటించారు . తమన్ పాటలు... చిత్రీకరణ బాగున్నాయి . 'కొట్టినా తిట్టినా' పాట 'బిజినెస్ మాన్ ' లోని 'సారొస్తారు' పాట అనుకరణ లా వుంది .రీ రికార్డింగ్ బాగుంది . ఇందులో నికోల్ ఫై ఐటెం సాంగ్ మరో బోనస్
-రాజేష్