'లవకుశ' 50 ఏళ్ల పండగ
'లవకుశ' 50 ఏళ్ల పండగ సందర్బంగా 'యువకళావాహిని' శుక్రవారం శ్రీ త్యాగరాయ గానసభలో ఏర్పాటు చేసిన చిత్రగానలహరి, చిత్రంలో నటించిన నటీనటుల సత్కార సభలో వివిధరంగాల ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.తెలుగు సినిమా చరిత్రలో తొలి రంగుల సినిమాగా ప్రసిద్దికెక్కి.. అవార్డులతో పాటు ప్రశంసలు పొందిన గొప్ప పౌరాణిక దృశ్యకావ్యం 'లవకుశ' అని వక్తలు కొనియాడారు. లవకుశ చిత్రంలోని పాటలు, సంగీతం, ఘంటసాల గానం, పద్యాలు చిత్ర విజయానికి దోహదపడ్డాయని వారు అన్నారు.
ఈ సందర్భంగా' లవకుశ 'చిత్రం లో లవకుశులుగా నటించిన నాగరాజు, సుబ్రహ్మణ్యం, భరతుడుగా నటించిన ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణలను, ఒరియా 'లవకుశ 'చిత్రంలో సీతారాములుగా నటించిన రోజారమణి, చక్రపాణిలను, లవకుశలో లక్ష్మణుడిగా నటించిన దివంగత నటుడు కాంతారావు సతీమణి హైమవతిలను అతిథులు ఘనంగా సత్కరించారు. సభలో శాసనమండలి సభ్యులు రుద్రరాజు పద్మరాజు, సారిపల్లి కొండలరావు పాలకుర్తి మధుసూదనరావు, జె.బాపురెడ్డి, ఆచార్య అనుమాండ్ల భూమయ్య, డా.కె.వి.కృష్ణకుమారి, యం.వెంకటేశ్వర్లు, జంధ్యాల రవికాంత్, సత్కార గ్రహీతలు వై.కె.నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు .
'లవకుశ' చిత్రంలోని పాటలను 50ఏళ్ల పండుగలో మిత్రా, వి. వి. రామారావు , పవన్ కుమార్ ,సాయిరమ్య, లక్ష్మీ మేఘన, అనఘ, తన్మయి, పద్మశ్రీలు ఆలపించి ప్రేక్షకుల్ని తన్మయుల్ని చేశా రు. ముఖ్యంగా సాయిరమ్య, లక్ష్మీమేఘనలు ఆలపించిన లవకుశ పాటలు, పద్యాలు మైమరపింపజేశాయి.

0 comments:
Post a Comment