కే .వి.రెడ్డి అవార్డ్ అందుకున్న కోదండరామిరెడ్డి
'జగదేక దర్శకుడు' కే.వి.రెడ్డి అవార్డ్ తో పాతికేళ్ళుగా ప్రముఖ దర్శకులను గౌరవిస్తున్న ' యువకళావాహిని' కే. వి. రెడ్డి శత జయంతి సందర్భం గా కోదండరామిరెడ్డి ని ఈ అవార్డ్ తో సత్కరించింది. రవీంద్రభారతిలో ఫిబ్రవరి 3 న జరిగిన ఈ కార్యక్రమం లో అక్కినేని నాగేశ్వర్ రావు చేతుల మీదుగా కోదండరామిరెడ్డి ఈ అవార్డ్ స్వీకరించారు. కే.వి.రెడ్డి ప్రాణం పోసిన ప్రతి చిత్రం నవతరం దర్శకులు,నటులకు 'వేదం' వంటిది. కే.వి.రెడ్డి వంటి గొప్ప దర్సకులవల్లనే నటులు గొప్పవారయ్యారు. సమాజానికి మంచి-చెడులు చెప్పాలనే తపన తో కే.వి.రెడ్డి కధలు రాసుకునేవారు.ఆయన చిత్రాల్లో ' పోతన',' వేమన', 'మాయా బజార్' లాంటి చిత్రాలు ఒక పార్శమైతే ...'దొంగ రాముడు', 'పెద్దమనుషులు', 'పెళ్లినాటి ప్రమాణాలు' మరో కోణం. పురాణాల ఫై మోజు, దర్శకత్వ శాఖ ఫై పూర్తి పట్టు, సామాజిక స్పృహ ఉన్న గొప్ప దర్శకుడు కే.వి.రెడ్డి -అని అక్కినేని అన్నారు. సారిపల్లి కొండలరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ- సినిమా చరిత్ర వున్నంతకాలం కే.వి.రెడ్డి రూపొందించిన 'మాయా బజార్','పాతాళ భైరవి' చిత్రాలు వుంటాయి-అని అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ-చిత్ర పరిశ్రమ నిర్వహించాల్సి ఇటువంటి కార్యక్రమాలను ' యువకళావాహిని' వంటి సాంస్కృతిక సంస్థలు నిర్వహించడం అభినందనీయం- అనిఅన్నారు. నిర్మాత కే.అచ్చిరెడ్డి మాట్లాడుతూ- స్వర్ణయుగపు దర్శకుల క్రమశిక్షణ పుణికిపుచ్చుకున్న దర్శకుడు కోదండరామిరెడ్డి -అని అన్నారు. మహా దర్శకుడు కే.వి.రెడ్డి అవార్డును అక్కినేని చేతులమీదుగా అందుకోవడం చాలా ఆనందం గా వుందని- కోదండరామిరెడ్డి తనకుజరిగిన సత్కారానికి కృతజ్ఞతలు చెప్పారు. జర్నలిస్టులు వాసిరాజు ప్రకాశం, ఏ .రాంబాబు, 'లయన్స్' పీ .జయప్రకాష్ రెడ్డి, జి.హనుమంతరావు, 'యువకళావాహిని' వై.కే.నాగేశ్వరరావు కే.వి.రెడ్డి అవార్డ్ ను ఎంపికచేశారు. ఏ. వి.యస్ ,జయలలిత, ' కార్నేషన్' రాం , రాచమల్లు ఇస్మాయిల్ రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కే.వి.రెడ్డి-కోదండరామిరెడ్డిల ' సిని సంగీత విభావరి' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

0 comments:
Post a Comment