Friday, December 30, 2011
బాలీవుడ్ లో హిట్లు - ఫట్లు
Tuesday, December 27, 2011
ముగ్గురు ఖాన్‌లను అధిగమించి ఒంటి చేత్తో వందకోట్లు
డిస్నీలో షబానా,సుహాసిని
Sunday, December 25, 2011
'శృంగార తార' ముద్ర నుంచి బయట పడ్డాను :నేహా ధూపియా
Thursday, December 22, 2011
' రాజన్న' చిత్ర సమీక్ష
' రాజన్న' చిత్ర సమీక్ష 3.25/5
అన్న పూర్ణ స్టూడియోస్ పతాకం ఫై విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం లో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు.
దేశ స్వాతంత్రం కోసం నాలుగు మిత్రులతో కలిసి తెల్లవాళ్ళని ఎదుర్కొన్న రాజన్న దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పోరాటానికి స్వస్తి చెప్పి స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లా నేల కొండ పల్లి కి బయల్దేరుతాడు. అక్కడికి చేరే సరికి ....భారత దేశం లో ఇంకా కలవని నిజాం పాలకులు రజాకార్లతో , దొరల తోడుతో సాగిస్తున్న అమానుష పాలన చూసి చలించి పోతాడు. అణగారిన ప్రజల్లో తన పాట తో పోరాట పటిమను పెంచుతాడు. రజాకార్లను, దొరలను తరిమి కొట్టేలా చేస్తాడు. లక్ష్మమ్మ ను పెళ్లి చేసుకుంటాడు. అయితే వీరి తిరుగు బాటును సహించని నిజాం సర్కార్ వారి ఫై భారీ దాడికి సన్నాహాలు చేస్తుంది. వారిని నిలువరించడానికి సిద్ధమైన రాజన్న కు స్వాతంత్ర పోరాటం లో అతని తో కలిసి పాల్గొన్న నలుగురు మిత్రులు వచ్చి బాసట గా నిలు స్తారు. పెద్ద పెట్టున వచ్చిన నిజాం సైనికులతో పోరాడుతూ రాజన్న బృందం నేలకొరుగు తారు. రాజన్న భార్య పారిపోతూ ప్రాణాలు విడుస్తుంది. వారి కూతురు మల్లమ్మను ఊరిలో ఒకరు పెంచుకుంటారు. మల్లమ్మకు పాటంటే ప్రాణం . ఆ ఊరి దొరసాని ఓ సారి మల్లమ్మ ని పాడోద్దంటూ నిషేధం విధిస్తుంది. అలా పాడినందుకు శిక్షించడానికి వస్తే తప్పించుకు పారిపోతుంది. దొరల కష్టాలు పోవాలంటే - డిల్లీ వెళ్ళి ప్రధాని నెహ్రూ ని కలిసి పరిస్థితిని వివరించాలని సంగీతం మాస్టర్ చెప్పిన దాని ప్రకారం డిల్లీ ప్రయానమవుతుంది . అలా వెళ్ళిన మల్లమ్మ డిల్లీ చేరి, తను అనుకున్నది ఎలా సాదించింది అనేది చిత్రం లో చూడాలి .
ఈ తరహా కధాంశం తో ,భారీ ఖర్చు తో సినిమా చెయ్యడం నిజం గా సాహసమే. అయితే నటుడిగా ఈ తరహా పాత్ర చెయ్యాలనే కోరిక వల్లనో .... తెలంగాణా వాదులను సంతృప్తి పరచాలనే ఆలోచన తోనో నాగార్జున సొంత బేనర్ ఫై ఈ చిత్రాన్ని చేసారు. పోరాట సన్నివేశాలకు రాజ మౌళి రూపకల్పన చేస్తానని చెప్పడం కూడా నాగార్జున సాహసానికి బలాన్నిచ్చి వుంటుంది. అయితే పోరాట సన్నివేశాలకే కాకుండా సినిమా అంతా రాజ మౌళి పర్య వేక్షణలోనే జరిగినట్లు సినిమా పరిజ్ఞానం ఉన్నవారికి తేలిగ్గా అర్ధమవుతుంది. మల్లమ్మ గా అనీ నటన , కీరవాణి సంగీతం, నాగార్జున పోరాట సన్నివేశాలు ఈ చిత్రం లో ప్రత్యేకతలు . చారిత్రక నేపధ్యం అంటూనే పూర్తి కల్పిత గాధను సినిమా టిక్ గా తెరకెక్కించారు. సినిమా ప్రారంభంలో మల్లమ్మ తో చేసిన సన్నివేశాలు చాలా బాగున్నాయి. ప్రధానం గా- మల్లమ్మను వూరివారంతా సాగనంపే సన్నివేశం .దొంగ బారినుండి డబ్బును వదిలేసి,మట్టిని దక్కించుకునే సన్నివేశం . ఇంటర్వెల్ ముందు నాగార్జున ఎంట్రీలో ...బ్రిటిష్ వారితో పోరాటంలో హీరో ఇమేజ్ ని పెంచే ప్రయత్నం చేస్తూ , సహజత్వానికి దూరమై పోయారు. సినిమా రెండవ భాగం ప్రారంభం నుండి వరుసగా రజాకార్ల దురాగతాలను చూపే సన్నివేశాలుప్రేక్షకులను స్పందింప జేస్తాయి.వీటిలో ముఖ్యం గా- దొరల బండి ముందు అవ్వ కొడుకు పరుగెడుతూ చని పోవడం, అందానికి పన్ను కట్టమనే సన్నివేశం. ' వెయ్ 'అంటూ రాజన్న తన పాట ...డప్పు దరువు తో గ్రామస్తులను చైతన్య వంతులను చేసే సన్నివేశాలు స్పూర్తిదాయకంగా ఉన్నాయి. అందులో ప్రధానంగా - పోచవ్వ పోరాటం, చిన్న పిల్లాడు ముందుకు రావడం , దొర దగ్గర కుర్రాడి తిరుగుబాటు. క్లైమక్స్ లో మిత్రులతో కలిసి నాగార్జున చేసే భారీ పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. హీరో శత్రువులను వరుసపెట్టి చీల్చి చెండాడే ఇటువంటి సన్నివేసమే' మగధీర' లో రాజమౌళి చేసారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే' సింహా 'లో బోయపాటి శ్రీను చేసారు. ఇప్పుడు మరో సారి ఈ చిత్రం లో చూస్తాము. తేడా అంతా- ఇందులో హీరో తో పాటు మరో నలుగురు మిత్రులు వుండటం. పోరాటం చివరిలో మిత్ర బృందం అంత ఒకే చోటా చేరి తనువులు చాలించడం మనసులను కదిలిస్తుంది. అయితే ఆదిలాబాద్ నుంచి పదేళ్ళ మల్లమ్మ సుదూరం లో ఉన్న డిల్లీ కి వెళ్ళడం ...నెహ్రు ని కలవడం వంటివి ప్రేక్షకులకు కొరుకుడు పడవు. తెలుగు తనం తో, పల్లె పలుకులతో , వీనుల విందుగా సాగిన కీరవాణి పాటలు ,నేపధ్య సంగీతం ఈ చిత్రం లోని చాలా లోపాలను కప్పేసింది. చాలా సన్నివేశాలకు ప్రాణం పోసింది. “వేయరా వేయ్”, "అమ్మా అవనీ" వంటిపాటలు సినిమాకి వన్నె తెచ్చాయి.
పోరాటకారుడు రాజన్న గా నాగార్జున తన పూర్వ విధానానికి పూర్తి భిన్నమైన గెట్అప్ తో పాత్రకు పూర్తి న్యాయం చేసారు. అతని కుమార్తె మల్లమ్మ గా సినిమాకు ప్రధానమైన పెద్ద పాత్రలో అనీ అద్భుతం గా నటించింది. రాజన్న భార్యగా స్నేహ, అతని మిత్రులుగా అజయ్, సుప్రీత్, శ్రావణ్, ప్రదీప్ రావత్ , సంగీతం మాస్టార్ గా నాజర్ , దొరసానిగా శ్వేతా మీనన్, ఇతర పాత్రల్లో ముకేష్ రుషి శకుంతల, హేమ,విజయ కుమార్, శ్రీధర్, సత్య నాగ్ నటించారు. మల్లమ్మ తాత పాత్రలో చేసిన సమ్మెట గాంధీ కూడా చాలా బాగా చేసాడు. శ్యాం,అనిల్ భండారిల మంచి ఫోటోగ్రఫీ ...కోటగిరి ఎడిటింగ్....రవీందర్ కళా ప్రతిభ చూపిన ఈ చిత్రం లో గ్రాఫిక్స్ ను రాజ మౌళి తరహాలో సందర్భోచితం గా ఉపయోగించుకున్నారు. -రాజేష్

Wednesday, December 21, 2011
రజనీకాంత్, కమల్‌హాసన్, శంకర్ల హాట్ ప్రాజెక్టు
Monday, December 19, 2011
రచయిత, నటుడు భూపాల్ రెడ్డి కి సన్మానం
రచయిత, నటుడు భూపాల్ రెడ్డి కి సన్మానం
ప్రముఖ రచయిత్రి వాసి రెడ్డి సీతా దేవి జయంతి సందర్భం గా - ఇటీవల కేంద్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్న రచయిత, నటుడు [కొమరం భీమ్] భూపాల్ రెడ్డి కి 'యువ కళా వాహిని' నేతృత్వం లో సన్మానం జరిగింది. డిశంబర్ 16 న 'తెలుగు యూనివర్సిటీ' లో జరిగిన ఈ కార్య క్రమం లో - డా:సి .నారాయణ రెడ్డి , దూర దర్శన్ పూర్వ సంచాలకులు పాలకుర్తి మధు సూదన రావు , రచయిత్రి శ్రీ లత , ఆవుల మంజులత, సుద్దాల అశోక్ తేజ, యం .ఆర్.నాయక్, త్రిపురనేని సాయి చంద్ , అల్లాణి శ్రీధర్ , 'యువకళా వాహిని' వై.కే. నాగేశ్వర రావు, జి . మల్లికార్జునరావు తది తరులు పాల్గొన్నారు. టి. నాగి రెడ్డి , వెంగ మాంబ , గంగాధర్ బృందం ప్రదర్శించిన 'సత్య హరిశ్చంద్రీయం ' సభికులను ఆకట్టుకుంది .

Saturday, December 17, 2011
ఉత్తమ సినిమా కల్చర్ ని పెంచాలి
మళ్లీ మొదట్నించీ జీవితాన్ని ప్రారంభించాలంటున్న భాను ప్రియ
Wednesday, December 14, 2011
ప్రపంచ సినిమా చరిత్రలోనే వినూత్న ‘ప్రయోగం’

మీ గురించి చెబుతారా?
బి.టెక్ పూర్తిచేసుకుని కొంతకాలం ఢిల్లీలోని సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్‌గా ఉద్యోగం చేసి సినిమా మీద మక్కువతో ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ ఎం.ఏ. ఫిలిం మేకింగ్ కోర్స్ పూర్తిచేశాను. సినిమా రంగంలోకి అందరూ నాలుగు డబ్బులు సంపాదించుకుందామనే కాంక్షతో వస్తుంటారు. కానీ నేను తెలుగు ప్రేక్షకులకు సరికొత్త ప్రయోగంతో రొటీన్‌కు భిన్నంగా తన సినిమా ఉండాలని అటువంటి తన ఆలోచనలకు ఒక కార్యరూపంగా రూపొందించిన చిత్రమే ఈ ‘ప్రయోగం’.
ప్రయోగం మేకింగ్: ఇక సినిమా కథ విషయానికి వస్తే ఇందులో ‘ప్రయోగం’ అనేది ఒక వెబ్సైట్ పేరు. ఒక సైంటిఫిక్ బ్యాక్‌గ్రౌండ్ డిటెక్టివ్ ఈ వెబ్‌సైట్‌ను నడిపిస్తూ ఉంటాడు. సిటీలో మత్తుమందులు విచ్చలవిడిగా విస్తరిస్తున్న తరుణం లో అసలు ఈ మత్తుమందులు సిటీకి సప్లయ్ చేసే వ్యక్తిని పట్టుకోవడానికి సైంటిఫిక్ డిటెక్టివ్ చేసిన ఎక్స్పరిమెంట్ ఏమిటనేది ప్రయోగం కథ. అతడు నిర్వహించిన ఈ ప్రయోగం ద్వారా అసలు నేరస్తులు పట్టుబడటమే కాకుండా సొసైటీలో నాలుగు గ్రూపుల మధ్య నడిచే మానసిక సంఘర్షణలు, వైరుధ్యమైన పరిస్థితులు, మానవ సంబంధాలు, వారి వ్యక్తిత్వాలు.
ప్రయోగం ఆలోచన ఎలా వచ్చిందంటే...
నిర్మాణ విశేషాలు: ఈ చిత్ర నిర్మాణ విశేషాల గురించి చెబుతూ భానుప్రకాష్ ఇలా అన్నారు. ‘ప్రయోగాత్మకమైన ఆలోచన రావడం కష్టం కాదు. ఆ ఆలోచనని కథగా మలిచి దానికి సంబంధించిన వారందరినీ ఒప్పించి, ఒక తాటిపైన ఉంచి, కెమెరాలో బంధించి జనరంజకంగా తీర్చిదిద్దటం అత్యంత కష్టతరమైన పని. నేను చేసిన ఈ ప్రయోగం కోసం నలభై మంది ఆర్టిస్టులను ఎంపికచేసి వారికి 66 రోజులపాటు లొకేషన్లో సెట్ వేసి ట్రైనింగ్ ఇచ్చి షూట్ చేశాము. ఎందుకంటే నటీనటులు కెమెరా ముందు రెండు గంటలపాటు కట్ లేకుండా ఏకధాటిగా నటిస్తూనే ఉండాలి.
ఒకవేళ వారిలో ఎవరైనా ఒక గంట తర్వాత తప్పు చేస్తే, అక్కడ కట్ చేసి మళ్లీ మొదటినుండి రెండు గంటలు షూట్ చేయాలి. ఇంత రిస్క్ తీసుకోవడానికి కారణం ప్రేక్షకులు ఈ నాలుగు గ్రూపుల నిజ జీవితాలు చూస్తున్న అనుభవం కలగాలి. ఈ మేకింగ్‌లో రెండో కష్టం ఏమిటంటే...ఈ నాలుగు ఫ్రేముల్లో ఉన్న నటులు ఒకరితో ఒకరు ఫోన్లో సంభాషిస్తూ ఉండాలి. నాలుగు ఫ్రేముల్లో రెండు గంటల షూట్లో ఒక ఫ్రేమ్‌లో వ్యక్తి ఏ సెకండ్లో కాల్ చేస్తాడో...ఇంకో ఫ్రేమ్‌లో ఉన్న వ్యక్తి దాని తర్వాత సెకండ్లో కాల్ లిఫ్ట్ చెయ్యాలి.
ఇది ప్రాక్టికల్‌గా చాలా కష్టమైన పని. ఇక మూడోది...జీపులో ఫిక్స్ చేసిన కెమెరాతో జీపు రెండు గంటలపాటు వివిధ ప్లేసులకి, రోడ్లమీద తిరుగుతూ రెండు గంటల్లో ఫలానా టైమ్‌కి ఫలానా ప్లేస్‌కి జీపు వచ్చి తీరాలి. దీనితో జీపు ట్రాఫిక్ వల్ల అప్పుడప్పుడు త్వరగా, లేటుగా వచ్చేది. టైమ్‌కి ఆ ప్లేస్‌కి వచ్చేవరకూ మొదటినుంచి రెండు గంటల షాట్ మళ్లీ తీయాల్సివచ్చేది.
ఎవరికోసం ఈ ప్రయోగం?
ఈ ప్రయోగంతో ఏం చెప్పదల్చుకున్నారు?
వినోదం ప్రధానంగా సాగే ఈ ప్రయోగంలో అంతర్లీనంగా డ్రగ్స్ జోలికి వెళ్లవద్దు అనే మెసేజ్ కూడా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు అడ్వాన్స్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ చిత్రం విజయవంతం చేసి తెలుగు వాళ్లు కూడా ప్రయోగాత్మక చిత్రాలు మిగిలిన భాషల కన్నా ధీటుగా తీయగలరు అనే విశ్వాసాన్ని ప్రపంచానికి తెలియజేయాలని...నూతన ప్రయత్నంగా చేస్తున్న నా ఈ ‘ప్రయోగం’ సక్సెస్ చేస్తారని మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను.
విద్యాబాలన్ పారితోషికాన్ని ఐదు కోట్లకు పెంచేసింది
Tuesday, December 13, 2011
మల్లీశ్వరి 60 ఏళ్ల పండుగ
మల్లీశ్వరి 60 ఏళ్ల పండుగ
‘మల్లీశ్వరి’ తెలుగు చిత్ర సీమకు చుక్కానిలాంటిదని , ఎన్నటికి వన్నె తగ్గని అద్భుత కళాఖండమని ... జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.' యువ కళావాహిని' ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో జరిగిన ‘వాహిని వారి మల్లీశ్వరి 60 ఏళ్ల పండుగ’ సభకు సినారె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ బీఎన్‌రెడ్డి దర్శకత్వ ప్రతిభ, దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం, సాలూరి రాజేశ్వర్‌రావు సంగీతం' మల్లీశ్వరి' ని చిరస్థాయిగా నిలబెట్టాయని సినారె పేర్కొన్నారు. ఎన్టీఆర్, భానుమతి పాత్ర లు, ‘ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు’, ‘మనసున మల్లెల’ పాటలు నేటికీ మరుపురానివన్నారు. దేవులపల్లి సాహిత్య ప్రతిభకు మల్లీశ్వరి పాటలు తార్కాణమన్నారు.
సభలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వర్రావు మాట్లాడుతూ- 1951లో వచ్చిన' మల్లీశ్వరి' తెలుగు చలన చిత్ర పరిశ్రమకు స్ఫూర్తి నిచ్చిందన్నారు. బీఎన్‌రెడ్డి దర్శకత్వ ప్రతిభకు చిత్రంలోని సన్నివేశాలే నిదర్శనమన్నారు.బి .యన్ .రెడ్డి వంటి ఉన్నత స్థాయి దర్శకుల స్ఫూర్తి తోనే తను చిత్ర నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన సారిపల్లి కొండల రావు ప్రసంగిస్తూ- బీఎన్‌రెడ్డి లాంటి దర్శకులు అరుదుగా లభిస్తారన్నారు. ఫిల్మీడియా సౌజన్యం తో ఈ కార్యక్రమం జరిగింది.
సభలో ప్రముఖ రచయిత, నటులు రావి కొండల రావు, నిర్మాత, దర్శకులు అల్లాణి శ్రీధర్, ప్రముఖ రచయిత డాక్టర్ ముదిగొండ శివప్రసాద్, సాహితీ వేత్త ఓలేటి పార్వతీశం, లంకా లక్ష్మీనారాయణ, వై.కె. నాగేశ్వర్రావు, మళ్లీ ఖార్జునరావు, నరసింహారావు, త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు . సినిమాలోని సన్ని వేశాలను, కథను, పాటలతో పాటు రసవత్తరం గా ఎస్.వి. రామారావువివరించారు . సభకు ముందు వీకే దుర్గ , శరత్ చంద్ర' మల్లీశ్వరి' చిత్రంలోని పాటలను మధురంగా ఆలపించారు.

Friday, December 9, 2011
'పంజా' చిత్ర సమీక్ష
'పంజా' చిత్ర సమీక్ష 2.5/5
సంఘ మిత్ర ఆర్ట్స్ -అర్క మీడియా వర్క్స్ సంయుక్తం గా ఈ చిత్రాన్ని విష్ణువర్ధన్ దర్శకత్వం లో నిర్మించారు. నీలిమ తిరుమల శెట్టి , నగేష్ ముంతా , శోభు యార్లగడ్డ , ప్రసాద్ దేవినేని ఈచిత్రానికి నిర్మాతలు.
చిన్న తనం లో తనకు ఆశ్రయం ఇచ్చి ఆదుకొన్న కొల్కొత్తా మాఫియా లీడర్ భగవాన్ కు నీడలా ఉంటూ... ప్రత్యర్ధి కులకర్ణి గ్యాంగ్ నుండి కాపాడు తుంటాడు జై .
జీవితంలో తాను కోల్పోయిన ప్రేమను సంధ్య లో చూసుకుంటాడు. భగవాన్ కొడుకు మున్నా రావడం తో పరిస్థితులు మారుతాయి. అతని శాడిస్ట్ చేష్టలు అందరిని బాధిస్తాయి. జై సన్నిహితురాలు , క్లబ్ డాన్సర్ జాన్వి మున్నా దృష్టిలో పడుతుంది. అతన్ని ఇష్టపడని జాన్విని మున్నా అతి క్రూరం గా కొట్టి చంపుతాడు. ఆ సందర్భం లో జై తో జరిగిన సంఘర్షణ లో మున్నా చనిపోతాడు. దాన్ని అవకాశం గా తీసుకుని గురవయ్య అనే ముటా సభ్యుడు భగవాన్ -జై ల మధ్య చిచ్చు పెడతాడు. తనని చంపడానికి చూస్తున్న భగవాన్ ని ఎదుర్కోవడం ఇష్టం లేని జై అక్కడికి దూరం గా వెళ్ళి పోవాలను కుంటాడు. అక్కడి నుండి సంధ్య వాళ్ళ వూరికి వెళ్ళిన జై అక్కడ కొన్ని సమస్యలను పరిష్కరిస్తాడు. పగతో రగిలిపోతున్న భగవాన్ జై మిత్రుడు చోటూ ను పట్టుకుని సంధ్య వివరాలు సేకరిస్తారు. సంధ్యను ఎత్తుకు తీసుకొస్తారు. ఆమెను కాపాడేందుకు జై తిరిగి కోల్‌కతా వస్తాడు. ఆ తర్వాత జరిగింది తెర ఫై చూడాలి ....
' పులి', 'తీన్ మార్' ల పరాజయం తర్వాత వచ్చినప్పటికీ ... డిఫరెంట్ గెట్అప్ తో పవన్ కళ్యాణ్ కనిపించిన ఈ చిత్రం పట్ల ప్రేక్షకులు, అభిమానులు విపరీతమైన ఆసక్తి కనపర్చారు. పవన్ మాఫియా గ్యాంగ్ స్టర్ గా చాలా స్టైలిష్ నటన కనపరిచాడు . డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ లో కొత్త దనాన్ని చూపిస్తూ, యాక్షన్ సన్నివేశాల్లో అతను చాలా బాగా చేసాడు. అయితే, సినిమా అంతా కేవలం యాక్షన్ కే పరిమితం కావడం వల్ల, పవన్ నుండి ఆశించే అంశాలు కొరవడటం వల్ల ఈ చిత్రం అసంతృప్తిని మిగిల్చింది. ఈ చిత్ర కధాంశం గతం లో వచ్చిన పవన్ కళ్యాణ్ ' బాలు' , నాగార్జున 'అంతం' చిత్రాలను గుర్తుకు తెస్తుంది. వినోదం పాలు బాగా తక్కువగా ఉన్న ఈ చిత్రం లో ...దర్శకుడి చిత్రీకరణ స్థాయి సామాన్య ప్రేక్షకుడిని మించిపోయింది. అలీ ,బ్రహ్మానందం ఉన్నప్పటికీ వారి కామెడీ అంతంత మాత్రమే. పోలీసు పాపారాయుడుగా బ్రహ్మానందం తో చేసిన సన్నివేశాల్లో పవన్ పాత్ర ని మరీ సిల్లీ గా చూపించారు. హీరో లో ప్రేమ పుట్టడం ...పెరగడం ...మరింత బాగా చూపితే సినిమా కి జీవం వచ్చేది. హీరో లో ఉండే కటినత్వాన్ని చూపినంత బలం గా అతనిలోని సున్నితత్వాని చూప లేదు. సినిమా మొదటి భాగం చూసిన ప్రేక్షకులు హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతి పొందితే ...రెండవ భాగం లో ఆ గ్రాఫ్ దారుణం గా పడి పోయింది. ప్రేక్షకులు ఆసక్తి చూపిన 'పంజా' టైటిల్ సాంగ్ సినిమా ఐపోయాక ,చివర్లో పెట్టడం కూడా మైనెస్ అయ్యింది.
భగవాన్ గా జాకీ ష్రాఫ్ ,అతని ప్రత్యర్ధి గా అతుల్ కులకర్ణి పరిమితమైన పాత్రలే ఐనప్పటికీ బాగా చేసారు. గురవయ్య గా తనికెళ్ళ భరణి, మున్నాగా అడివి శేషు రాణించారు. హీరోయిన్ సంధ్య గా సారా జెనె డయాజ్ ఎంపిక సరిపోలేదు. జాన్వి గా అంజలీ లావణ్య పాత్రకి తగ్గట్టే సెక్సీ గా ఉంది. ఇతర పాత్రల్లో పరుచూరి వేంకటేశ్వర్ రావు ,సుబ్బరాజు , ఝాన్సీ నటించారు.
వినోద్ ఫోటో గ్రఫీ ఈ చిత్రం లో ప్రత్యేకత. యువన్ శంకర్ రాజా సంగీతం లో ' ఎలా ఎలా ' వంటి ఒకటి, రెండు మినహా చెప్పుకోదగ్గ పాటలు లేనప్పటికీ ,రీ రికార్డింగ్ సినిమా మూడ్ కి చాలా సహకరించింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, శ్యాం కౌషెర్ యాక్షన్ సన్నివేశాలు ,విజువల్ అఫెక్ట్స్ బాగున్నాయి. - రాజేష్
సంఘ మిత్ర ఆర్ట్స్ -అర్క మీడియా వర్క్స్ సంయుక్తం గా ఈ చిత్రాన్ని విష్ణువర్ధన్ దర్శకత్వం లో నిర్మించారు. నీలిమ తిరుమల శెట్టి , నగేష్ ముంతా , శోభు యార్లగడ్డ , ప్రసాద్ దేవినేని ఈచిత్రానికి నిర్మాతలు.
జీవితంలో తాను కోల్పోయిన ప్రేమను సంధ్య లో చూసుకుంటాడు. భగవాన్ కొడుకు మున్నా రావడం తో పరిస్థితులు మారుతాయి. అతని శాడిస్ట్ చేష్టలు అందరిని బాధిస్తాయి. జై సన్నిహితురాలు , క్లబ్ డాన్సర్ జాన్వి మున్నా దృష్టిలో పడుతుంది. అతన్ని ఇష్టపడని జాన్విని మున్నా అతి క్రూరం గా కొట్టి చంపుతాడు. ఆ సందర్భం లో జై తో జరిగిన సంఘర్షణ లో మున్నా చనిపోతాడు. దాన్ని అవకాశం గా తీసుకుని గురవయ్య అనే ముటా సభ్యుడు భగవాన్ -జై ల మధ్య చిచ్చు పెడతాడు. తనని చంపడానికి చూస్తున్న భగవాన్ ని ఎదుర్కోవడం ఇష్టం లేని జై అక్కడికి దూరం గా వెళ్ళి పోవాలను కుంటాడు. అక్కడి నుండి సంధ్య వాళ్ళ వూరికి వెళ్ళిన జై అక్కడ కొన్ని సమస్యలను పరిష్కరిస్తాడు. పగతో రగిలిపోతున్న భగవాన్ జై మిత్రుడు చోటూ ను పట్టుకుని సంధ్య వివరాలు సేకరిస్తారు. సంధ్యను ఎత్తుకు తీసుకొస్తారు. ఆమెను కాపాడేందుకు జై తిరిగి కోల్‌కతా వస్తాడు. ఆ తర్వాత జరిగింది తెర ఫై చూడాలి ....
వినోద్ ఫోటో గ్రఫీ ఈ చిత్రం లో ప్రత్యేకత. యువన్ శంకర్ రాజా సంగీతం లో ' ఎలా ఎలా ' వంటి ఒకటి, రెండు మినహా చెప్పుకోదగ్గ పాటలు లేనప్పటికీ ,రీ రికార్డింగ్ సినిమా మూడ్ కి చాలా సహకరించింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, శ్యాం కౌషెర్ యాక్షన్ సన్నివేశాలు ,విజువల్ అఫెక్ట్స్ బాగున్నాయి.
Wednesday, December 7, 2011
దివ్యభారతి జీవిత కధా చిత్రం ... కృష్ణవంశీ ‘అంత:పురం’కు సీక్వెల్
అనుష్క నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్...ఆంతరంగికురాలు కూడా
Tuesday, December 6, 2011
సృష్టికి ప్రతిసృష్టి టుస్సాడ్స్ మ్యూజియం
బాలీవుడ్ అందాల రాణులు కరీనా కపూర్, ఐశ్వర్యారాయ్‌లతో కలిసి ఫొటోలు దిగాలని ఉందా..? మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ని కలవాలనుందా..? బాలీవుడ్ టాప్ హీరోలు అమితాబ్ బచ్చన్, షారూఖ్‌ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ల పక్కన నిలబడాలనుందా..? వీరందరినీ ఒేకసారి దర్శించాలనుందా..? అయితే వెంటనే లండన్‌లోని మేడ్మ టుస్సాడ్స్ మ్యూజియంకు వెళ్లాల్సిందే. మన దేశానికి చెందిన ఈ ప్రఖ్యాత సెలబ్రిటీలే కాదు ప్రముఖ సెలబ్రిటీలు మైకెల్ జాక్సన్, బ్రిట్నీ స్పియర్స్ వంటి ఎందరినో ఒేక చోట సందర్శించే అద్భుతమైన వేదిక ఈ మ్యూజియం. ఇటువంటి ప్రముఖ వ్యక్తుల మైనపు బొమ్మలతో ఏర్పాటైన ....