RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Sunday, January 29, 2012

'ఏజెంట్ వినోద్' కోసం యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టింది


 

తారల ఇళ్లల్లో మంగళవాయిద్యాలు

బ్యాండ్.. బాజా.. బారాత్... ప్రస్తుతం బాలీవుడ్ తారలు కొం దరు ఈ ఆలోచనలోనే ఉన్నారు. ఈ సంవత్సరం బాలీవుడ్‌లో కనీసం ఐదారు పెళ్లిళ్లయినా జరుగుతాయని అంటున్నారు. వీటిలో మొదటిది రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియాల పెళ్లి. ఎనిమిది సంవత్సరాలుగా సాగుతోన్న ఈ జంట  .....బాలీవుడ్ తారల ఇళ్లల్లో మంగళవాయిద్యాలు మారుమోగే సమయం వచ్చింది. ఈ ఏడాదిలో చాలా మంది తారలు పెళ్లిళ్లు చేసుకునే అవకాశాలున్నాయని సినీ పండితులు చెబుతున్నారు. అయితే రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా పెళ్లి మాత్రం ఖరాయింది. వీరిద్దరూ వచ్చే నెల మూడున దంపతులు కాబోతున్నారు.....

Friday, January 27, 2012

అమెరికాలో అందమైన ప్రేమ కధ

ధర్మపథ క్రియేషన్స్ అధినేత కె.రాజశేఖర్ అనగానే ‘గౌతమబుద్ధ’ చిత్రం మనకళ్లముందు సాక్షాత్కరిస్తుంది. గౌతమబుద్ధ అనగానే మనమందరం గర్వించే దృశ్యకావ్యం నిలుస్తుంది. ‘గౌతమబుద్ధ’ మనం గర్వించే దృశ్యకావ్యం కనుకనే ప్రభుత్వం కూడా మెచ్చి నంది అవార్డులను అందజేసింది. మహా పండితుడు సద్గురు శివానంద కుమారుడైన రాజశేఖర్ తండ్రి యొక్క ఉత్తమాభిరుచిని వంట పట్టించుకున్న వాడు గనుక రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా ‘గౌతమబుద్ధ’ను నిర్మించారు. డబ్బు సంపాదించిన వారు, కోట్లాది రూపాయల టర్నోవర్తో వ్యాపారాలను చేస్తున్నవారు చిత్రరంగాన, చిత్రరంగానికి అవతల ...

జెనీలియా నటనకీ, పెళ్లికీ సంబంధం లేదనీ తేల్చి చెప్పింది


బాలీవుడ్ నటుడు రితీశ్ దేశ్ ముఖ్ ని ఫిబ్రవరి 3న పెళ్లాడబోతున్న చిరునవ్వుల సుందరి జెనీలియా పెళ్లి తర్వాత కూడా నటిస్తాననీ, నటనకీ, పెళ్లికీ సంబంధం లేదనీ తేల్చి చెప్పింది. వారితో సినిమాలు తీస్తున్న నిర్మాతలు వారి పెళ్లి కారణంగా తమ సినిమాల షెడ్యూళ్లలో మార్పులు చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత ఓ నెల వరకు వాళ్లు షూటింగులకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాళ్లున్న సన్నివేశాల్ని నెల తర్వాత ప్లాన్ చేస్తున్నారు.జెనీలియా మాత్రం పెళ్లి వల్ల తన సినిమాలకు ఎలాంటి ఆటంకం కలగడం లేదని చెబుతోంది. నిజానికి ఆమె హీరోయిన్ గా ఎంపికైన ...

Saturday, January 21, 2012

తాప్సీ బైక్ రైడింగ్‌... బిపాసాబసు రిక్షా సవారీ


ఆ మధ్య 'మిస్టర్ పర్‌ఫెక్ట్'లో పవర్‌బైక్ రైడింగ్ చేసి ఎంతో ఆకట్టుకుంది తాప్సీ. ఇప్పుడు మరో ఉత్తరాది భామ సమీరా కూడా ఇలాంటి బైక్ రైడింగ్‌తో అలరించనుందట. ఇందుకోసం వేగంగా బైక్‌ని నడపటం నేర్చుకొంటోందట ఈ ముద్దుగుమ్మ. తను నూతనంగా నటించబోయే 'సాల్ట్' అనే చిత్రంలో ఈ ఫీట్ చేయడానికి రెడీ అవుతోందట ఈ బొద్దుగుమ్మ. ఇందులో హీరోయిన్ వేగంగా బైక్ రైడింగ్ చేసుకుంటూ ప్రమాదానికి గురవుతుంది. అది కూడా తనకు తానుగా ఈ ప్రమాదానికి గురికావాల్సిన ...

ఇప్పటి వరకు నేను ఏదీ అనుకోని ప్లాన్ చేయలేదు

‘నెంబర్‌గేమ్స్‌ను నేను పట్టించుకోను. నా పని చేసుకుంటూ వెళ్లడమే నాకు తెలుసు. ఒకరి స్థానాన్ని భర్తీ చేయాలనే ఆసక్తి నాకు లేదు’ అంటున్నాడు యువ కథానాయకుడు మహేష్‌బాబు. సీనియర్ నటుడు కృష్ణ నట వారసుడిగా రంగప్రవేశం చేసిన మహేష్ అనతి కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో క్రేజీ కథానాయకుడిగా ఎదిగాడు. ‘పోకిరి’తో 75 ఏళ్ళ సినీ చరివూతను తిరగరాసిన ఈ ప్రిన్స్.. ‘దూకుడు’తో ఆ రికార్డులను తిరగరాశాడు. ఇప్పుడు తాజాగా ‘బిజినెస్ మేన్’ చిత్రంతో మరో సంచలనాత్మక విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకొని హీరోగా తిరుగులేని స్థానాన్ని ....

Friday, January 20, 2012

'హోసన్నా'... పాటతో వివాదంలో చిక్కుకున్న రెహ్మాన్


ఏఆర్ రెహ్మాన్ ఓ పాట విషయంలో వివాదంలో చిక్కుకున్నారు. 'ఏక్ దివానా థా' చిత్రంలో ఆయన సమకూర్చిన హోసన్నా... అనే పాట ఈ వివాదానికి దారి తీసింది. ఇందులో ఓ అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తూ 'హోసన్నా' అనే పదాన్ని ఉపయోగించడం క్రైస్తవులు తప్పు పడుతున్నారు. 'హోసన్నా' పాట రాసిన జావేద్ అక్తర్, సంగీత దర్శకుడు రెహమాన్ క్షమాపణ చెప్పాలని మతపెద్దలు డిమాండ్ చేస్తున్నారు. "హోసన్నా అనే మాట యూదులకు, క్రైస్తవులకు ఎంతో పవిత్రమైనది...దేవుణ్ణి 'హోసన్నా' అని సంబోధిస్తూ ఉంటాం. అలాంటి పదాన్ని ఎలా పడితే అలా ఉపయోగించడం క్షంతవ్యం కాదని ....