RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Wednesday, April 24, 2013

మూడు భాషల్లోనూ నటిస్తా!:కొంకణాసేన్

పాత్ర నచ్చితే ఏ భాషాచిత్రమనే విషయాన్ని తాను పెద్దగా పట్టించుకోనని, బెంగాలీ, హిందీ, ఇంగ్లిష్.. ఏ భాషాచిత్రమైనా నటించేందుకు అంగీకరిస్తానని చెబుతోంది నటి కొంకణాసేన్. తల్లి అపర్ణా సేన్ నుంచి నటనను వారసత్వంగా అంది పుచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ విమర్శకుల ప్రశంసలందుకునే ఎన్నో చిత్రాల్లో నటిం చింది. బెంగాలీ చిత్రం ‘ఏక్ జె అచ్చే కన్యా’తో తన నటప్రస్థానాన్ని ప్రారంభించిన కొంకణాసేన్ ఆ తర్వాత....

అక్రంతో స్నేహం మాత్రమే!:సుస్మితా సేన్


క్రికెటర్లకు, సినీతారలు, మోడల్స్కు మధ్య సంబంధాలు ఇప్పటివి కావు. గతంలో క్రికెటర్లతో ప్రేమాయణం, పెళ్లిళ్లు, పెటాకుల సంఘటనలు చాలానే ఉన్నాయి. క్రికెటర్లతో సినీ తారల సంబంధాలను చెప్పుకోవాల్సి వస్తే.. షర్మిల టాగోర్-మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడీ, రీనారాయ్-మోహిసిన్ ఖాన్, జీనత్ ఆమన్-ఇమ్రాన్ ఖాన్, నీనా గుప్తా-వివియన్ రిచర్డ్స్, సంగీతా బిజ్లానీ-అజరుద్దీన్, కిమ్ శర్మ-యువరాజ్ సింగ్, దీపికా పదుకోనే-మహేంద్ర సింగ్ ధోని, దీపికా పడుకోనే-యువరాజ్ సింగ్, గీతా బస్రా-హర్భజన్ సింగ్, ఇష్రా శర్వానీ-జహీర్ ఖాన్, ఎలిజబెత్ హార్లీ-షేన్ వార్న్ ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి కోవలనే మాజీ మిస్ యూనివ‌ర్స్ సుస్మితా సేన్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వ‌సీం అక్రంల మధ్య వ్యవహారం నడుస్తోందని....

Sunday, April 14, 2013

సిద్ధార్థ్ ఇక దర్శకత్వం వేపు...

మెగా ఫోన్ పట్టాలనే కోరిక ఉందంటున్నారు యువ నటుడు సిద్ధార్థ్. నటుడిగా తెరంగేట్రం చేసి దశాబ్దం దాటినా ఇంకా యంగ్ బాయ్ ఇమేజ్‌ను కాపాడుకుంటున్న సిద్ధార్థ్ తొలుత తమిళంలో హీరోగా పరిచయమైనా, ఆ తరువాత తెలుగు, హిందీ తదితర భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటుడిగా పేరు పొందారు. ఇటీవల విడుదలైన హిందీ చిత్రం' చష్మే బద్దూర్' విజయానందాన్ని అనుభవిస్తున్న ఆయన.....

ఆ సంబంధాలు పెట్టుకోను!-సనాఖాన్

అవకాశాల కోసం సెక్స్ సంబంధాలు పెట్టుకోనని నటి సనాఖాన్ పేర్కొంది. ఈమె శింబుకు జంటగా శిలంబాట్టం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తరువాత తంబిక్కు ఇంద ఊరు, అయిరం విళక్కు తదితర చిత్రాల్లో నటించినా హీరోయిన్‌గా ఆశించిన స్థాయికి చేరుకోలేదు. తాజాగా మాలీవుడ్‌లోకి ప్రవేశించింది. అక్కడ సిల్క్‌స్మిత జీవిత ఇతివృత్తంతో తెరకెక్కుతున్న.....

Friday, April 5, 2013

'బాద్ షా' చిత్ర సమీక్ష

'బాద్ షా' చిత్ర సమీక్ష   2.5 / 5


 పరమేశ్వర పతాకం ఫై శ్రీను వైట్ల దర్శ కత్వం లో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించాడు .                                                                                                                


                          శ్రీను వైట్ల సమర్ధుడైన దర్శకుడు . సినిమా విజయానికి హీరో ని నమ్ముకోవడం కన్నా కామెడీని నమ్ముకోవడం ఉత్తమం అనే సూత్రాన్ని ఇటీవల తన భారీ చిత్రాల్లో  ప్రయోగించి, మంచి విజయాలు  సాధించారు . శ్రీను ఆ మధ్య పూరీ 'పోకిరి' ని అనుసరిస్తూ 'దూకుడు' చేసాడు . ఇప్పుడు దాదాపుగా అదే చిత్రాన్ని తిరిగి యన్టీ ఆర్ తో 'బాద్ షా' గా చేసాడు . అందుచేత ఈ చిత్రం కధ గురించి ప్రత్యేకం గా చెప్పడానికి ఏమీ లేదు . ఈ చిత్రంలో భారీ నిర్మాణ విలువలున్నాయి .కోన వెంకట్ సంభాషణలు , గుహన్ ఫోటోగ్రఫీ,వర్మ ఎడిటింగ్ ,విజయ్ యాక్షన్ ,ప్రకాష్ ఆర్ట్ ,తమన్ సంగీతం బాగున్నాయి . అయితే సినిమాలొ కొత్తదనం  మాత్రం కొరవడింది .మాఫియా ను మట్టు పెట్టడానికి మారు వేషం లో పోలీసులు ప్రయత్నించే ఈ కధ  లో,కధనం లో  స్పష్టత లేదు . చాలా చోట్ల గందర గోళానికి  గురవుతాము  . సినిమా ప్రారంభం నుండి  హీరోయిన్ కాజల్  మాటల రొద.. .ఇంటర్వెల్ దగ్గరకొచ్చే కొద్దీ ఎడతెగని 
యాక్షన్ హంగామా . రెండవ భాగం నుండీ తెలంగాణా యాస తో ఈవెంట్ మేనేజర్ గా  బాద్ షా మరో రూపం లో హంగామా . నిజానికి ఇటువంటి సన్నివేశాల్లోనే దర్శకుడు శ్రీ ను  వైట్ల-  కధ లో విషయం లేకపోయినా,మంచి హాస్యాన్ని రాబట్టి... ప్రేక్షకులను మాయ చేస్తుంటాడు . అయితే ఇందులో అతను చేసిన ప్రయత్నం విఫలమయ్యింది . అక్కడక్కడ తప్ప కామిడీ రొటీన్ గా సాగింది .  కలల్లో విహరిస్తాడంటూ బ్రహ్మానందంఫై భారీ ఆశలతో దర్శకుడు పెట్టిన కామెడి ట్రాక్ తుస్స్ మంది . మహేష్ బాబు కామెంటరీ ,అతిధి  పాత్రలో సిద్ధార్ధ ,విలన్ పొలీస్ గా నవదీప్ ... ఇలా ఎన్ని అదనపు ఆకర్షణ లున్నా ఉపయోగ పడలేదు .దర్శకుడిగా శ్రీను వైట్ల సమర్ధత ఫైనే సందేహాన్ని కలిగించే చిత్రం ఇది . 

               కాజల్ , వెన్నెల కిషోర్ లతో హీరో చేసిన కొన్ని సీన్స్...మందు కొట్టిన ఆడాళ్ళతో  యన్టీ ఆర్ పాటల సన్నివేశం ... ఇటలీ అందాలు బాగున్నాయి .బాద్షా గా యన్టీ ఆర్ బాగా నటించాడు  . డాన్సులు ఫైట్లు బాగా చేసాడు . సీనియర్ యన్టీ ఆర్ ను కొన్ని చోట్ల బాగా అనుకరించాడు . రాబోయే రోజుల్లో రాజకీయ అవసరాలకోసం సీనియర్ యన్టీ ఆర్ వారసత్వాన్ని జూనియర్ వాడుకునే ప్రయత్నం చేసాడు .   అయితే అతని గెటప్ కారణం గా గ్లామర్ గా కన్నా, ఇబ్బంది కరంగానే చాలా చోట్ల  కనిపించాడు . జానకి గా కాజల్ అందం గా , బాగా చేసింది .  రివెంజ్  నాగేశ్వర్ రావు పేరుతో రామ్ గోపాల్ వర్మ ను తలపించేలా ఎమ్మెస్ నారాయణ ఫై చేసిన కామెడి బాగుంది .పిల్లి పద్మనాభ సిన్హా గా బ్రహ్మానందం కామెడి అర్ధం పర్ధం లేకుండా  చిరాకెత్తించింది . క్రమ శిక్షణకు మారు పేరైన పిల్లి వంశ పోలీస్ అధికారిగా నాజర్ నటన మరీ అతిగా వుంది  .   ఇతర పాత్రల్లో  ప్రదీప్ రావత్ ,ఆశిష్ విద్యార్ధి ,  సయ్యాజీ షిండే ,  తని కెళ్ల  భరణి , షఫీ , సుహాసిని , మోహన్ రుషి , సుప్రీత్ , సత్యం రాజేష్ ,నాగబాబు , చంద్ర మోహన్ , సుధా , ప్రగతి , సురేఖా వాణి, జయప్రకాశ్ రెడ్డి , అజయ్ , తగు బోతూ రమేష్, రవిప్రకాష్ , బ్రహ్మాజీ , గిరిధర్ , రజిత  , భరత్ , రాజీవ్ కనకాల నటించారు . తమన్ పాటలు...  చిత్రీకరణ బాగున్నాయి . 'కొట్టినా తిట్టినా' పాట 'బిజినెస్ మాన్ ' లోని 'సారొస్తారు' పాట అనుకరణ లా  వుంది .రీ  రికార్డింగ్ బాగుంది .   ఇందులో నికోల్ ఫై  ఐటెం సాంగ్ మరో బోనస్  
                            -రాజేష్ 

Thursday, April 4, 2013

తొలి మహిళా పాప్‌ స్టార్‌ బిలియనీర్‌ మడోన్నా

ఏ వయస్సు వరకు అందంగా ఉంటాం? అంటే చెప్పడం కష్టం. సాధారణంగా అయితే 40 ఏళ్ల వరకు రూపురేకలు ఆకట్టుకునేలా ఉంటారు . కానీ ఈమె వయసు 55 ఏళ్లు. అయినా తరగని అందం ఈమె సొంతం. పాప్‌ రంగంలోకి ఎంతో మంది వచ్చినా ఆమె స్థానం పదిలం. ఆమె పాట కోసం ప్రాణాలర్పించేవాళ్లు ఉన్నారంటే ఆ కంఠం పలికించే స్వరాలు ఎంత అద్భుతమో అర్థం చేసుకోవచ్చు. పాటే కాదు ఆటలోనూ.... 

హన్సికకు పెళ్ళీడు వచ్చేసింది!